లింగ పక్షపాతంపై ఐఏఏ సదస్సు.. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై | Iaa To Host Summit On Gender Sensitisation In Media At Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: లింగ పక్షపాతంపై ఐఏఏ సదస్సు.. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై

Published Thu, Jan 26 2023 12:28 PM | Last Updated on Thu, Jan 26 2023 2:46 PM

Iaa To Host Summit On Gender Sensitisation In Media At Hyderabad - Sakshi

హైదరాబాద్: ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ), ఇండియా చాప్టర్ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లోని టీ-హబ్‌ వేదికగా 'జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ మీడియా' అంశంపై సదస్సు నిర్వహిస్తోంది. 30 సెకన్ల TV ప్రకటన నుంచి నుంచి 3 గంటల సినిమాల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయంపై చర్చించనున్నారు. పరిశ్రమలో లింగ పక్షపతాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడనున్నారు.

'వాయిస్ ఆఫ్ ఛేంజ్‌' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రిన్సిపల్ పార్ట్‌నర్‌గా సాక్షి మీడియా గ్రూప్, నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా యూనిసెఫ్ వ్యవహరిస్తున్నాయి.

ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియాకు ప్రాతినిధ్యం వహించే ఏకైక ఏకీకృత ప్రకటనల వాణిజ్య సంస్థ. ఇందులో కార్పొరేట్, విద్యా అనుబంధ సంస్థలు, టాప్-10 దేశాలతో పాటు ప్రపంచవ్యప్తంగా 76 దేశాలకు చెందిన యువ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. 80 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement