International Advertising Association
-
ఘనంగా ఏఐఐ వార్షికోత్సవ వేడుకలు.. ఇద్దరు భారతీయల అరుదైన ఘనత
అమెరికా న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషన్ అడ్వటైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన శ్రీనివాసన్ స్వామీ, రమేష్ నారాయణ్‌లకు ఐఏఏ అసోసియేషన్ ‘నార్త్ స్టార్’ అవార్డులతో ఘనంగా సత్కరించింది. 2014లో ఐఐఏ గ్లోబుల్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాసన్ స్వామి ప్రశంసలందుకున్నారు. 2014 లండన్‌లో జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్‌లో స్వామి, నారాయణ్‌లు గ్లోబుల్ చాంపియన్లుగా గుర్తింపు పొందారు. కాగా, నారాయణ్ ఐఏఏ గ్లోబల్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా, దాని ఏపీఏసీ రీజీయన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వారిద్దరూ ఐఏఏ భారత బోర్డ్ మాజీ అధ్యక్షులు సేవలందించారు. అడ్వటైజింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై శ్రీనివాసన్ స్వామి,రమేష్ నారాయణ్‌లను పరిశ్రమ వర్గాల ప్రతినిధుల అభినందనలు తెలుపుతున్నారు. -
లింగ పక్షపాతంపై ఐఏఏ సదస్సు.. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ), ఇండియా చాప్టర్ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా 'జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ మీడియా' అంశంపై సదస్సు నిర్వహిస్తోంది. 30 సెకన్ల TV ప్రకటన నుంచి నుంచి 3 గంటల సినిమాల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయంపై చర్చించనున్నారు. పరిశ్రమలో లింగ పక్షపతాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 'వాయిస్ ఆఫ్ ఛేంజ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రిన్సిపల్ పార్ట్నర్గా సాక్షి మీడియా గ్రూప్, నాలెడ్జ్ పార్ట్నర్గా యూనిసెఫ్ వ్యవహరిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియాకు ప్రాతినిధ్యం వహించే ఏకైక ఏకీకృత ప్రకటనల వాణిజ్య సంస్థ. ఇందులో కార్పొరేట్, విద్యా అనుబంధ సంస్థలు, టాప్-10 దేశాలతో పాటు ప్రపంచవ్యప్తంగా 76 దేశాలకు చెందిన యువ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. 80 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. -
భవిష్యత్తు ఏఐ ప్రకటనలదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్స్.. ఇదీ సింపుల్‌గా అడ్వర్టయిజింగ్ మాధ్యమాల వరుస క్రమం! కానీ ఇపుడు ఈ జాబితాలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేరుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లు ఏఐ ఆధారిత ప్రకటనలపై పరిశోధన చేస్తున్నాయని, కొన్ని సంస్థలు త్వరలోనే దేశంలో మొబైల్ ఆధారిత ఏఐ ప్రకటనల్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించే సంకేతాలున్నాయని ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) చైర్మన్, వరల్డ్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ స్వామి చెప్పారు. ఏఐతో మొబైల్ అడ్వర్టయిజింగ్ మోసాలకు అడ్డుకట్టపడుతుందని.. అందుకే ఈ విభాగం శరవేగంగా ఏఐ వైపు మళ్లుతోందని చెప్పారాయన. కొచ్చిలో జరగనున్న 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్ వివరాలను గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ‘‘ఏఐ ప్రకటనలతో వేగం, పారదర్శకతతో పాటు ప్రకటనల కమ్యూనికేషన్‌ను ఎడిట్ చేసుకునే వీలుంటుంది. వీక్షకుల మానసిక స్థితి, ముఖ కవళికలను బట్టి ప్రకటనలను అందించవచ్చు. వయస్సు, లింగ భేదం వంటివి కూడా శోధించి అందుకు తగిన యాడ్స్ వస్తాయి. ఈ ప్రకటనలతో సమయం, డబ్బు వృథా జరగదు’’ అని వివరించారు. రూ.61,878 కోట్లకు ప్రకటనల పరిశ్రమ.. ప్రస్తుతం దేశీయ ప్రకటనల పరిశ్రమ పరిమాణం రూ.61,878 కోట్లుగా ఉందని.. ఇందులో రూ.14 వేల కోట్లు డిజిటల్ మీడియం వాటా అని తెలియజేశారు. ఏటా 10.62 శాతం వృద్ధి రేటుతో 2021 నాటికి ప్రకటనల పరిశ్రమ 82,250 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. మొత్తం పరిశ్రమలో టెలివిజన్, ప్రింట్ వాటా 70 శాతం, డిజిటల్ వాటా 17 శాతం వరకుంటుంది. కొచ్చిలో ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్.. ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌కు తొలిసారిగా మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 20–22 తేదీల్లో కొచ్చిలో జరిగే ఈ సదస్సులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, యూనీలీవర్ సీఈఓ పాల్ పోలెమన్, క్వాల్కామ్ సీఈఓ స్టీవెన్ మోల్లిన్‌కోఫ్, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నిలేకనీ, సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సీఈఓ రాజీవ్ మిశ్రా తదితరులు పాల్గొంటారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఏఏకు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో చాప్టర్లుండగా, ఇండియాలో 300 మంది సభ్యులున్నారు. -
తొలిసారిగా రీజినల్ యాడ్ ఏజెన్సీలకు అవార్డ్స్