![Iaa Honours Srinivasan Swamy And Ramesh Narayan For Their Service - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/7/Srinivasan%20Swamy%20and%20Ramesh%20Narayan.jpg.webp?itok=cvbTduZ3)
అమెరికా న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషన్ అడ్వటైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన శ్రీనివాసన్ స్వామీ, రమేష్ నారాయణ్‌లకు ఐఏఏ అసోసియేషన్ ‘నార్త్ స్టార్’ అవార్డులతో ఘనంగా సత్కరించింది.
2014లో
ఐఐఏ గ్లోబుల్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాసన్ స్వామి ప్రశంసలందుకున్నారు. 2014 లండన్‌లో జరిగిన ఇన్‌స్పైర్ అవార్డ్స్‌లో స్వామి, నారాయణ్‌లు గ్లోబుల్ చాంపియన్‌లుగా గుర్తింపు పొందారు.
కాగా, నారాయణ్ ఐఏఏ గ్లోబల్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా, దాని ఏపీఏసీ రీజీయన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వారిద్దరూ ఐఏఏ భారత బోర్డ్ మాజీ అధ్యక్షులు సేవలందించారు. అడ్వటైజింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై శ్రీనివాసన్ స్వామి,రమేష్ నారాయణ్‌లను పరిశ్రమ వర్గాల ప్రతినిధుల అభినందనలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment