IAA
-
ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు
ఆర్కె స్వామి హన్సా గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీనివాసన్ కె.స్వామి(సుందర్ స్వామి) ప్రపంచ ప్రతిష్టాత్మక ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్నారు. మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన 45వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌లో పెనాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ ఫుజి అబ్దుల్ రజాక్ చేతులమీదుగా ఈ అవార్డు తీసుకున్నారు. మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రపంచ స్థాయిలో గణనీయమైన కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. అయితే ఒక భారతీయుడుకి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ అవార్డును అందుకున్న వారిలో షెల్లీ లాజరస్ (ఛైర్మన్ ఎమెరిటస్, ఓగిల్వీ అండ్ మాథర్), పాల్ పోల్మన్ (సీఈఓ, యూనిలీవర్), పాల్ రోస్సీ (ప్రెసిడెంట్, ఎకనామిస్ట్ గ్రూప్), మార్క్ ప్రిచర్డ్ (చీఫ్ బ్రాండ్ ఆఫీసర్, ప్రాక్టర్ & గాంబుల్), ఆండ్రూ రాబర్ట్సన్ (ప్రెసిడెంట్ & సీఈఓ, బీబీడీఓ) ఉన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీనివాసన్ స్వామి మాట్లాడుతూ..తనకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు సహకరించిన తన సహచరులు, నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఏళ్లపాటు ఆయన తండ్రి దివంగత ఆర్కె.స్వామి అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ అవార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. శ్రీనివాసన్ కె.స్వామి ఆర్కె స్వామి లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్స్ (ఐఏఏ), ఐఏఏ ఇండియా చాప్టర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, మద్రాస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్‌కు అధ్యక్షుడు/ఛైర్మన్‌గా పనిచేశారు. శ్రీనివాసన్ కె.స్వామి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవనకాల సాఫల్య అవార్డును అందుకున్నారు. ఇటీవలే ఐపీఓలోకి.. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్ సంస్థ ఆర్కే స్వామి లిమిటెడ్ ఇటీవలే ఐపీఓగా మార్కెట్లోకి రావాలని నిర్ణయించింది. దాంతో నిన్నటితో షేర్ల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ముగిసింది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.270-288గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.423.56 కోట్లు సమీకరించనుంది. రూ.173 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. రూ.250.56 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉంచారు. రిటైల్ మదుపర్లు కనీసం రూ.14,400తో 50 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 12న మార్కెట్ లిస్ట్ అవ్వనుంది. ఇదీ చదవండి: ఫార్చూన్ 500 లీడర్లలో మహిళలు అంతంతే .. ప్రముఖ కంపెనీలకు ఆర్కే స్వామి లిమిటెడ్ క్రియేటివ్ మీడియా, డేటా అనలిటిక్స్, మార్కెట్ రీసెర్చ్ వంటి సేవలను అందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో తమ క్లయింట్లకు దాదాపు 818 ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. 2.37 మిలియన్ల ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి. -
ఘనంగా ఏఐఐ వార్షికోత్సవ వేడుకలు.. ఇద్దరు భారతీయల అరుదైన ఘనత
అమెరికా న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషన్ అడ్వటైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన శ్రీనివాసన్ స్వామీ, రమేష్ నారాయణ్‌లకు ఐఏఏ అసోసియేషన్ ‘నార్త్ స్టార్’ అవార్డులతో ఘనంగా సత్కరించింది. 2014లో ఐఐఏ గ్లోబుల్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాసన్ స్వామి ప్రశంసలందుకున్నారు. 2014 లండన్‌లో జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్‌లో స్వామి, నారాయణ్‌లు గ్లోబుల్ చాంపియన్లుగా గుర్తింపు పొందారు. కాగా, నారాయణ్ ఐఏఏ గ్లోబల్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా, దాని ఏపీఏసీ రీజీయన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వారిద్దరూ ఐఏఏ భారత బోర్డ్ మాజీ అధ్యక్షులు సేవలందించారు. అడ్వటైజింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై శ్రీనివాసన్ స్వామి,రమేష్ నారాయణ్‌లను పరిశ్రమ వర్గాల ప్రతినిధుల అభినందనలు తెలుపుతున్నారు. -
ఒకదాన్ని మించి మరొకటి.. ఔరా అనిపించే వాహనాలు - ఓ లుక్కేసుకోండి!
ఆధునిక ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే అనేక కొత్త ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పుడు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈవెంట్లో అనేక కొత్త కార్లు దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి ఆదివారం వరకు (సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు) జరిగే IAA మొబిలిటీ 2023 ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు, ఔత్సాహికులు, ఆవిష్కర్తలను ఒక చోటుకి చేరుస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద మొబిలిటీ షోలలో ఒకటైన ది మ్యూనిచ్ మోటార్ షో కోసం ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో ఫ్యూయెల్ కార్లకంటే కూడా ఎలక్ట్రిక్ కార్లకు ఎక్కువ ఆదరణ ఉండనుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ కార్లుగా రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, టెస్లా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, బీవైడీ (BYD), అవత్ర్ (Avatr) (చైనా కంపెనీ) తమ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరిగింది. బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి. అయితే ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ కంపెనీలు ఎలక్త్రుయిక్ కార్లను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కంపెనీ కార్లు కూడా ఎలక్ట్రిక్ అవతార్‌లో కనిపించనున్నాయి. -
ప్రతిష్టాత్మక 'ఐఏఏ' అవార్డు విజేతలు వీరే..
ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) తన ప్రతిష్టాత్మకమైన IndAA అవార్డుల ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 1న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ఏబీపీ నెట్వర్క్ అండ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కో-పార్ట్నర్గా ఉండగా.. నెట్వర్క్18 & జియో సినిమా అసోసియేట్ పార్ట్నర్గా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో 15 క్రియేటివ్ ఏజెన్సీలు 18 ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కేటగిరీలు.. ఒక ప్రత్యేక కేటగిరీలో అవార్డులు పొందాయి. అవార్డులలో 102 క్యాంపెయిన్స్ షార్ట్‌లిస్ట్ చేయగా.. వీటిలో డిజైన్ ప్రకారం, ప్రతి విభాగంలో ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. క్లోజ్ కాంటెస్ట్ విషయంలో మాత్రం జ్యూరీ చాలా చర్చల తర్వాత ఉమ్మడి విజేతలను ప్రకటించింది. క్రియేటివ్ ఏజెన్సీలలో లియో బర్నెట్, ముల్లెన్‌లోవ్ లింటాస్ గ్రూప్, ఒగిల్వీ ఆ కేటగిరీలో ఒక్కొక్కటి మూడు IndIAA అవార్డులను గెలుచుకున్నారు. కాగా బీబీడీవో, డీడీబీ ముద్ర అండ్ టీబీడబ్ల్యుఏ రెండు అవార్డులను గెలుచుకున్నాయి. గ్రే గ్రూప్, కెహత్ కబీరా పిక్చర్స్, మెక్కాన్ వరల్డ్‌గ్రూప్, పబ్లిసిస్ వరల్డ్‌వైడ్, రీడిఫ్యూజన్, ఎస్జీ మీడియా, టాలెంటెడ్, ది స్క్రిప్ట్ రూమ్, ది వోంబ్, టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ వంటి ఇతర క్రియేటీవ్ ఏజెన్సీలు & క్రియేటర్లు IndAA అవార్డును గెలుచుకున్నాయి. ఇక ఫుడ్ అండ్ బెవెరగె (పానీయాలు) & పర్సనల్ కేర్ కేటగిరి HUL బ్రాండ్లు విజేతలుగా నిలిచాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్‌లో గెలుపొందగా, HDFC మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో గెలిచింది. ఈ సందర్భంగా జ్యూరీ ఛైర్మన్ అండ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, నెస్లే ఇండియా 'సురేష్ నారాయణ్' మాడ్లాడుతూ.. జ్యూరీ ఛైర్మన్‌గా నా ఐదవ సంవత్సరంలో ఇక్కడ సన్నిహితంగా పరిచయం చేసుకున్నాను. దేశంలోని గొప్ప క్రియేటివ్ మైండ్స్ కలిగిన కొందరిలో ఒకడిగా ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా 'జ్యూరీ చైర్ కా శంబోధన్' అనే పేరుతో ఒక చిన్న కవితతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, IAA ఇండియా అవార్డ్స్ ఛైర్మన్ అభిషేక్ కర్నాని కూడా మాట్లాడారు. బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను ఏఐఐ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'లక్ష్మీదేవి కంటే ముందు సరస్వతీ దేవి వచ్చిందని తన తండ్రి చెప్పినట్లు వెల్లడించాడు. -
ఈ కారులో ఏది అనుకుంటే అదే జరుగుతుంది..!
మ్యునీచ్: 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా మనందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా సంచలన విజయాన్ని నమోదుచేసింది. అవతార్ సినిమా ఒక విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు కనువిందుచూసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాలను గమనించే ఉంటాం. ఇదే తరహాలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కారును రూపొందించింది. చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..! మెర్సిడెజ్ ఈ కారులో స్టీరింగ్‌ను అమర్చలేదు. కేవలం హ్యూమన్ మైండ్ ద్వారా నియంత్రించవచ్చును. మెర్సిడెజ్ జెంజ్ విజన్ ఎవీటీర్ న్యూవెర్షన్‌ను జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఐఏఏ మొబిలీటీ 2021 షోలో మెర్సిడెజ్ ప్రదర్శనకు ఉంచింది. కారు లోపలి బయటి భాగాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్న మాదిరిగా ఉంటాయి. ఈ కారులో ఎలాంటి స్టీరింగ్ ఉండదు. బీసీఐ టెక్నాలజీ సహయంతో కారును నియంత్రించవచ్చును. బీసీఐ టెక్నాలజీ అనగా మీరు కారులో రేడియో స్టేషన్‌ను మార్చడం, లేదా కార్ లోపలి లైట్స్కోసం ఎలాంటి బటన్స్‌ను స్విచ్ చేయకుండా మైండ్‌లో వాటి గురించి ఆలోచించడంతోనే స్విచ్ఆన్, ఆఫ్ చేయవచ్చును. బీసీఐ సిస్టమ్ పనిచేయడం కోసం కంపెనీ తయారుచేసిన ప్రత్యేకమైన హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్ సహాయంతో కారును నియత్రించవచ్చును. ఈ కారును డిస్నీ సంస్ధ సహకారంతో మెర్సిడెజ్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ కారు కాన్సెప్ట్‌ను అవతార్ సినిమా నుంచి మెర్సిడెజ్ ప్రేరణ పొందింది. IN PICS | Mercedes-Benz Vision AVTR concept can read your mind The automaker has created this concept car in collaboration with @Disney and it takes inspiration from the movie popular sci-fi movie, #Avatar. @IAAmobility Details: https://t.co/svdJLFDUts pic.twitter.com/dd6QWN4D7X — HT Auto (@HTAutotweets) September 7, 2021 చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! -
BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..!
మ్యునీచ్: జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి వచ్చే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్, లో స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌లను బీఎమ్‌డబ్ల్యూ ఐఏఏ-2021 మొబిలిటీ షోలో టీజ్ చేసింది. ఈ షోలో భాగంగా బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ సీఈ-02 ఎలక్ట్రిక్ బైక్‌ను, బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ ఏఎమ్బీవై ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..! రేంజ్లో రారాజు..! బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ తెలిస్తే ఔరా అనాల్సిందే..! ఎలక్ట్రిక్ వాహన రంగంలో బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్ సంచలానాన్ని నమోదు చేయనుంది. బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్లో అధిక శక్తి గల మోటార్, అత్యధిక సామర్థ్యం ఉన్న 2000Wh బ్యాటరీని ఏర్పాటుచేసింది. బ్యాటరీ ఏర్పాటుచేయడంతో ఒక్క సారి చార్జ్ చేస్తే నార్మల్ పవర్ మోడ్‌లో ఈ సైకిల్ సుమారు 300 కిమీ దూరం మేర ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ-సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్ యాప్నుపయోగించి కూడా ఆపరేట్ చేయవచ్చును. ఈ సైకిల్ కనిష్టంగా గంటకు 25 వేగంతో, గరిష్టంగా 60 కిమీ వేగంతో ప్రయాణించనుంది. ఈ బైక్‌లో సరికొత్త జియోఫెన్సింగ్ మోడ్‌ను ఏర్పాటుచేశారు. ఈ మోడ్‌తో బైక్ ఆటోమోటిక్గా స్పీడ్‌ను నియంత్రిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ఈ సైకిళ్లను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు బీఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..! -
టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..!
మ్యునీచ్: ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు టెస్లా. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టెస్లా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ, ఏకఛత్రాధిపత్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లను టెస్లా ఏలుతుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమైయ్యాయి. చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..! తాజాగా జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఆటో మొబిలీటీ షోలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్ బెంజ్ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారును ఐఏఏ మొబిలిటీ 2021 షోలో మెర్సిడిజ్ ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా కంపెనీకి చెందిన టెస్లా ఎస్ మోడల్ కారుకు పోటీగా నిలవనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2022 సంవత్సరంలో ఈ కారు కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. మెర్సిడిజ్ ఈక్యూఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు ఒక్క ఛార్జ్‌తో సుమారు 660 కిమీ ప్రయాణించవచ్చునని కంపెనీ వెల్లడించింది. ఈ కారులో 90kWh బ్యాటరీ అమర్చారు. డీసీ చార్జింగ్ కెపాసిటీలో భాగంగా 170kW బ్యాటరీని ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 430 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించనుంది. మార్కెట్లోకి రెండు వేరియంట్ల రూపంలో ఈ కారు రిలీజ్ కానుందని కంపెనీ పేర్కొంది. చదవండి: భారత్‌లో సొంత షోరూమ్స్.. ఆన్లైన్ ద్వారా ఆ ఫీట్ సొంతం అయ్యేనా? -
బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..!
మ్యునీచ్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షో (ఐఏఏ మొబిలిటీ-2021)లో ఆవిష్కరించింది. బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తన కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ సీఈ 02 కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది. బీఎమ్‌డబ్ల్యూ ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని రానున్న రోజుల్లో మార్కెట్లోకి ఈ బైక్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుల వెల్లడించారు. జర్మనీలో జరుగుతున్న ఐఏఏ మొబిలిటీ-2021 షోలో ఈ బైక్ ఆకర్షణగా నిలిచింది. పట్టణ నాగరికతకు ఈ బైక్ సూట్ అవుతోందని బీఎమ్‌డబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బరువు 120 కిలోలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌కు 11కిలోవాట్ మోటార్‌ను కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌లో 90 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఈ బైక్ గరిష్టంగా 90కి.మీ వేగంతో ప్రయాణించనుంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బైక్ కాన్సెప్ట్ చూడడానికి రెండు చక్రాలపై స్కేట్‌బోర్డ్ కలిగిన బైక్‌గా పోల్చవచ్చునని బీఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది. సీటింగ్ పోజిషన్‌ను ఫ్లెక్సిబుల్‌గా ఏర్పాటుచేసింది. దీంతో సీటింగ్ సౌకర్యవంతంగా ఉండనుంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బైక్ స్క్వేర్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో ఈ బైక్ ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. హ్యాండిల్‌కు చిన్న కలర్ డిస్ప్లే స్క్రీన్‌ను ఏర్పాటుచేసింది. ఈ బైక్‌లో సింగిల్ సైడెడ్ స్వింగార్మ్‌ను, డిస్క్ బ్రేక్‌తో 15 అంగుళాల టైర్లను కలిగి ఉంది. -
భవిష్యత్తు ఏఐ ప్రకటనలదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్స్.. ఇదీ సింపుల్‌గా అడ్వర్టయిజింగ్ మాధ్యమాల వరుస క్రమం! కానీ ఇపుడు ఈ జాబితాలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చేరుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లు ఏఐ ఆధారిత ప్రకటనలపై పరిశోధన చేస్తున్నాయని, కొన్ని సంస్థలు త్వరలోనే దేశంలో మొబైల్ ఆధారిత ఏఐ ప్రకటనల్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించే సంకేతాలున్నాయని ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) చైర్మన్, వరల్డ్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ స్వామి చెప్పారు. ఏఐతో మొబైల్ అడ్వర్టయిజింగ్ మోసాలకు అడ్డుకట్టపడుతుందని.. అందుకే ఈ విభాగం శరవేగంగా ఏఐ వైపు మళ్లుతోందని చెప్పారాయన. కొచ్చిలో జరగనున్న 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్ వివరాలను గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు. ‘‘ఏఐ ప్రకటనలతో వేగం, పారదర్శకతతో పాటు ప్రకటనల కమ్యూనికేషన్‌ను ఎడిట్ చేసుకునే వీలుంటుంది. వీక్షకుల మానసిక స్థితి, ముఖ కవళికలను బట్టి ప్రకటనలను అందించవచ్చు. వయస్సు, లింగ భేదం వంటివి కూడా శోధించి అందుకు తగిన యాడ్స్ వస్తాయి. ఈ ప్రకటనలతో సమయం, డబ్బు వృథా జరగదు’’ అని వివరించారు. రూ.61,878 కోట్లకు ప్రకటనల పరిశ్రమ.. ప్రస్తుతం దేశీయ ప్రకటనల పరిశ్రమ పరిమాణం రూ.61,878 కోట్లుగా ఉందని.. ఇందులో రూ.14 వేల కోట్లు డిజిటల్ మీడియం వాటా అని తెలియజేశారు. ఏటా 10.62 శాతం వృద్ధి రేటుతో 2021 నాటికి ప్రకటనల పరిశ్రమ 82,250 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. మొత్తం పరిశ్రమలో టెలివిజన్, ప్రింట్ వాటా 70 శాతం, డిజిటల్ వాటా 17 శాతం వరకుంటుంది. కొచ్చిలో ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్.. ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌కు తొలిసారిగా మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 20–22 తేదీల్లో కొచ్చిలో జరిగే ఈ సదస్సులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, యూనీలీవర్ సీఈఓ పాల్ పోలెమన్, క్వాల్కామ్ సీఈఓ స్టీవెన్ మోల్లిన్‌కోఫ్, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నిలేకనీ, సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సీఈఓ రాజీవ్ మిశ్రా తదితరులు పాల్గొంటారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఏఏకు ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో చాప్టర్లుండగా, ఇండియాలో 300 మంది సభ్యులున్నారు. -
IAAతో ’సాక్షి’ ప్రత్యేక సెమినార్
-
హైదరాబాద్‌లో లెట్స్ గెట్ రియల్ !
-
'రియల్' రంగంపై ఐఏఏ-సాక్షి సెమినార్
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థ ఇంటర్నేషనల్ అడ్వర్టెయిజింగ్ అసోసియేషన్(ఐఏఏ) సాక్షి మీడియా భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో 'రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ నిర్వహణ' అనే అంశంపై సెమినార్ జరగనుంది. ఈ కార్యక్రమంలోని వేదికపై దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌తోపాటు మీడియా, వాణిజ్య ప్రకటనల రంగంలోని నిపుణలైనవారంతా కొలువుతీరనున్నారు. భావి భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఆవిష్కరించనున్న మార్పుల గురించి చర్చించనున్నారు. ఐఏఏ 1938లో స్థాపించారు. ప్రస్తుతం 76 దేశాల్లో తన సర్వీసులు అందిస్తోంది.