ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థ ఇంటర్నేషనల్ అడ్వర్టెయిజింగ్ అసోసియేషన్(ఐఏఏ) సాక్షి మీడియా భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్లో 'రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ నిర్వహణ' అనే అంశంపై సెమినార్ జరగనుంది.
ఈ కార్యక్రమంలోని వేదికపై దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్తోపాటు మీడియా, వాణిజ్య ప్రకటనల రంగంలోని నిపుణలైనవారంతా కొలువుతీరనున్నారు. భావి భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఆవిష్కరించనున్న మార్పుల గురించి చర్చించనున్నారు. ఐఏఏ 1938లో స్థాపించారు. ప్రస్తుతం 76 దేశాల్లో తన సర్వీసులు అందిస్తోంది.