ఆధునిక ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే అనేక కొత్త ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పుడు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో అనేక కొత్త కార్లు దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ రోజు నుంచి ఆదివారం వరకు (సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు) జరిగే IAA మొబిలిటీ 2023 ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు, ఔత్సాహికులు, ఆవిష్కర్తలను ఒక చోటుకి చేరుస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద మొబిలిటీ షోలలో ఒకటైన ది మ్యూనిచ్ మోటార్ షో కోసం ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
రానున్న రోజుల్లో ఫ్యూయెల్ కార్లకంటే కూడా ఎలక్ట్రిక్ కార్లకు ఎక్కువ ఆదరణ ఉండనుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ కార్లుగా రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, టెస్లా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, బీవైడీ (BYD), అవత్ర్ (Avatr) (చైనా కంపెనీ) తమ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరిగింది. బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి. అయితే ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ కంపెనీలు ఎలక్త్రుయిక్ కార్లను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కంపెనీ కార్లు కూడా ఎలక్ట్రిక్ అవతార్‌లో కనిపించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment