Motor Show
-
ఒకదాన్ని మించి మరొకటి.. ఔరా అనిపించే వాహనాలు - ఓ లుక్కేసుకోండి!
ఆధునిక ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే అనేక కొత్త ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పుడు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈవెంట్లో అనేక కొత్త కార్లు దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి ఆదివారం వరకు (సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు) జరిగే IAA మొబిలిటీ 2023 ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు, ఔత్సాహికులు, ఆవిష్కర్తలను ఒక చోటుకి చేరుస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద మొబిలిటీ షోలలో ఒకటైన ది మ్యూనిచ్ మోటార్ షో కోసం ఎంతోమంది వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో ఫ్యూయెల్ కార్లకంటే కూడా ఎలక్ట్రిక్ కార్లకు ఎక్కువ ఆదరణ ఉండనుంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ కార్లుగా రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, టెస్లా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్, బీవైడీ (BYD), అవత్ర్ (Avatr) (చైనా కంపెనీ) తమ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరిగింది. బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి. అయితే ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్ కంపెనీలు ఎలక్త్రుయిక్ కార్లను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కంపెనీ కార్లు కూడా ఎలక్ట్రిక్ అవతార్‌లో కనిపించనున్నాయి. -
తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవే..
-
ఎలక్ట్రిక్ వాహన రంగానికి పూర్తి ప్రోత్సాహం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఈ–మొబిలిటీ వీక్‌లో భాగంగా ఈ–మోటార్ షోను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 24/7 విద్యుత్‌ను అందించే సామర్థ్యం, ప్రగతిశీల ‘ఈవీ’వినియోగ పాలసీలతో దేశంలోనే అత్యంత విద్యుదీకరించిన రాష్ట్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సెల్ మాన్యుఫాక్చరింగ్, సెల్ కాంపోనెంట్ తయారీ, బ్యాటరీ మారి్పడి స్టేషన్లు, 2–వీలర్, 3–వీలర్, బస్సుల్లో ఈవీ తయారీ...ఇలా విద్యుత్ వాహన రంగానికి సంబంధించి తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీల అభివృద్ధిలో నగరం అగ్రగామిగా ఉందని, రానున్న రోజుల్లో ఈ–మోటార్ షో ఆటోమొబైల్ కంపెనీలకు మార్గదర్శక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మోటార్ షోను ఆద్యంతం ఆసక్తిగా తిలకించిన ఆయన హాప్ ఓఎక్స్ఓ సిటీ బైక్ సహా పలు ఈవీ వాహనాలను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శన 3 రోజులపాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
హైటెక్స్‌లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
అట్టహాసంగా ఆటో ఎక్స్పో 2018 ప్రీ ఈవెంట్
సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఆటోఎక్స్‌పో-ది మోటా ర్ షో ప్రీ ఓపెన్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 9-14వ తేదీవరకు జరిగే 14వ ఆటో ఎక్స్‌పోలో నేడు(బుధవారం), రేపు మీడియాకు, కంపెనీలకు ప్రత్యక షో నిర్వహిస్తున్నారు. గ్రేటర్ నోయిడా వేదికగా ఈ ఎక్స్పో ప్రారంభం కానున్న సందర్భంగా పలు కంపెనీల వాహనాల ప్రదర్శన సందడి చేసింది. ముఖ్యంగా మోస్ట్ ఎవైటెడ్ ఆటో ఎక్స్ పో హ్యుందాయ్, మారుతిసుజుకి, హీరో మోటో కార్ప్, అలాగే ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్స్ ఏప్రిలియా, పియాజ్జియో , కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌తో సందడి చేశాయి. ఇంకా ఫోక్స్ వ్యాగన్, రాయల్ ఎన్ఫీల్డ్ సహా బజాజ్ ఆటో, నిస్సాన్ ఇండియా కంపనీలు తమ సరికొత్త వాహనాలతో హల్చల్ చేసేందుకు రడీ అయిపోయాయి. ఈ సందర్భంగా భారతీయ మార్కెట్లో 2020 నాటికి ఒక ఎలక్ట్రిక్ వాహనంతో సహా తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా బుధవారం ప్రకటించింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వాహనాల పండుగ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద ఆటో ఎక్స్పో ‘2018 మోటార్ షో’ ఫిబ్రవరి 7 నుంచి (9 నుంచి సందర్శకులకు అనుమతి) ప్రారంభమవుతోంది. గ్రేటర్ నోయిడా వేదికగా ఫిబ్రవరి 14 వరకు జరుగుతుంది. 25–30 కొత్త మోడళ్లు ఈ ప్రదర్శనలో తళుక్కుమంటాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్), ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలిరోజున మీడియా సమక్షంలో కొత్త మోడళ్ల ఆవిష్కరణ చేపడుతున్నట్టు సియామ్ ట్రేడ్ ఫెయిర్ గ్రూప్ చైర్మన్ అరుణ్ మల్హోత్రా చెప్పారు. 20 దేశాల నుంచి 1,200 పైచిలుకు కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను దీన్లో ప్రదర్శిస్తాయి. వీటిలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలు 20 దాకా ఉంటాయని, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేశామని మల్హోత్రా తెలిపారు. అమ్మకాలకు ఫైనాన్స్ దన్ను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు, 35 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్టు అరుణ్ మల్హోత్రా తెలిపారు. ‘చిన్న పట్టణాల నుంచి అధిక వృద్ధి నమోదవుతోంది. మారుమూల ప్రాంతాల్లో కూడా విరివిగా ఫైనాన్స్ లభ్యత వాహన పరిశ్రమను నడిపిస్తోంది. 100 శాతం వాణిజ్య వాహనాలు, 80 శాతం ప్యాసింజర్, 45 శాతం దాకా ద్విచక్ర వాహనాలు ఫైనాన్స్ ద్వారానే కస్టమర్ల చేతుల్లోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చే విషయంలో దాదాపు అన్ని కంపెనీలు సీరియస్‌గా నిమగ్నమయ్యాయి’ అని వివరించారు. పన్నులన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చాయనుకోవడానికి వీల్లేదని అన్నారు. రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ ఇంకా అమలవుతున్నాయని, ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయని గుర్తు చేశారు. కాగా, రోజుకు లక్ష మందికిపైగా ఎక్స్పో సందర్శనకు వస్తారని భావిస్తున్నట్టు సియామ్ డైరెక్టర్ దేబశిష్ మజుందార్ తెలిపారు. -
రంగు రంగుల కార్లు..