75 ఏళ్లకు పైగా చరిత్ర.. 76 దేశాల్లో ప్రస్థానం.. 56 చాప్టర్లతో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన సదస్సుకు సిద్ధమైంది. శనివారం బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో ‘స్థిరాస్తి రంగం- మార్కెటింగ్, కమ్యూనికేషన్’ అనే అంశంపై జరిగే ఈ సదస్సుకు సాక్షి మీడియా గ్రూప్ అసోసియేషన్‌గా వ్యవహరిస్తుంది. రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా ప్రసంగించే ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న స్థిరాస్తి రంగం, అడ్వర్టైజింగ్, మీడియా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులూ పాల్గొని ప్రసంగిస్తారు. ‘స్థిరాస్తి రంగం ప్రస్తుత పరిస్థితి- భవిష్యత్తు ప్రణాళికలు’ అనే అంశంపై జాన్స్ లాంగ్ లాసెల్లె (జేఎల్‌ఎల్) ఎండీ సందీప్ పట్నాయక్, ‘మాంద్యంలో మార్కెటింగ్’ అనే అంశంపై సోమాయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ జాకబ్, ‘నేటి జనరేషన్ కోసం డిజిటల్ వినియోగం’ అనే అంశంపై రాజోర్‌ఫిష్ ఇండియా సీఈఓ చారుట్ల రవికుమార్, ‘స్థిరాస్తి రంగంలో మార్కెటింగ్ ప్రాముఖ్యత’ అనే అంశంపై వ్యాస్ గైనట్టి క్రియేటివ్ ప్రై.లి. చైర్‌పర్సన్ ప్రీతీ వ్యాస్‌లు ప్రసంగిస్తారు. అలాగే ‘రెండు రాష్ట్రాలు- భవిష్యత్తు ప్రణాళికలు’ అనే అంశంపై క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ జీ ఆనంద్‌రెడ్డి, ట్రెడా ప్రెసిడెంట్ పీ దశరథ్‌రెడ్డి, అప్రెడా ప్రెసిడెంట్ జీ హరిబాబు, నమన్ గ్రూప్ నీతా పటేల్, సోనాల్ సేత్‌లు బృంద చర్చ చేస్తారు. ఈ కార్యక్రమానికి సాక్షి అడ్వటైజింగ్ డెరైక్టర్ కేఆర్పీ రెడ్డి, ఐఏఏ ఇండియా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ (డెవలప్‌మెంట్) శ్రీనివాసన్ కే స్వామిలు ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ సదస్సుకు నిర్మాణ సంస్థల యజమానులు, డెవలపర్లు మాత్రమే ఆహ్వానితులు.
Published Sat, Jul 25 2015 8:38 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement