మ్యునీచ్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షో (ఐఏఏ మొబిలిటీ-2021)లో ఆవిష్కరించింది. బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తన కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ సీఈ 02 కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది. బీఎమ్‌డబ్ల్యూ ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని రానున్న రోజుల్లో మార్కెట్‌లోకి ఈ బైక్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుల వెల్లడించారు. జర్మనీలో జరుగుతున్న ఐఏఏ మొబిలిటీ-2021 షోలో ఈ బైక్ ఆకర్షణగా నిలిచింది.
పట్టణ నాగరికతకు ఈ బైక్ సూట్ అవుతోందని బీఎమ్‌డబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బరువు 120 కిలోలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌కు 11కిలోవాట్ మోటార్‌ను కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌లో 90 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఈ బైక్ గరిష్టంగా 90కి.మీ వేగంతో ప్రయాణించనుంది.
బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బైక్ కాన్సెప్ట్ చూడడానికి రెండు చక్రాలపై స్కేట్‌బోర్డ్ కలిగిన బైక్‌గా పోల్చవచ్చునని బీఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది. సీటింగ్ పోజిషన్‌ను ఫ్లెక్సిబుల్‌గా ఏర్పాటుచేసింది. దీంతో సీటింగ్ సౌకర్యవంతంగా ఉండనుంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బైక్ స్క్వేర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌తో ఈ బైక్ ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. హ్యాండిల్‌కు చిన్న కలర్ డిస్‌ప్లే స్క్రీన్‌ను ఏర్పాటుచేసింది. ఈ బైక్‌లో సింగిల్ సైడెడ్ స్వింగార్మ్‌ను, డిస్క్ బ్రేక్‌తో 15 అంగుళాల టైర్లను కలిగి ఉంది.
బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..!
Published Mon, Sep 6 2021 7:05 PM | Last Updated on Mon, Sep 6 2021 10:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment