భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఊపందుకుంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా పలు భారత స్టార్టప్స్ కూడా భారీగా ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఒబెన్ ఎలక్ట్రిక్(Oben Electric) భారత మార్కెట్లలోకి రోర్(Rorr) అనే ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది.
స్పోర్టీ లుక్స్‌తో..!
ఒబెన్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ పూర్తిగా స్పోర్టీ లుక్‌తో రానుంది. ఈ బైక్‌ను పూర్తిగా భారత్‌లోనే తయారు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఒబెన్ ఎలక్ట్రిక్ రోర్ బైక్ ఆకర్షనీయమైన లుక్‌తో రానుంది. స్ప్లిట్-స్టైల్ సీట్లు, పిలియన్ గ్రాబ్ రైల్, హై-సెట్ హ్యాండిల్‌బార్లు, వృత్తాకార హెడ్‌లైట్, యారోహెడ్ షేప్ మిర్రర్స్‌తో, స్పోర్టీగా కన్పించనుంది. పూర్తిగా బ్లాక్ అవుట్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో రానుంది. బైక్ ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపున మోనో-షాక్ యూనిట్స్‌తో రానున్నాయి.
ఫీచర్స్‌లో కమాల్..!
ఒబెన్ ఎలక్ట్రిక్ రోర్ బైక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి మద్దతును ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ రానుంది. దీనిలో మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉండనుంది. హావోక్, సిటీ, ఈకో మోడ్స్ వస్తాయి.
రేంజ్ విషయానికి వస్తే..!
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ ప్రకటించింది. IP67-రేటెడ్ 4.4kWh బ్యాటరీ ప్యాక్‌తో అనుసంధానించబడిన 10kW ఎలక్ట్రిక్ మోటారు రానుంది. గరిష్ట వేగం గంటకు 100కిమీ. ఈ బైక్ 0 నుంచి 40 కిమీ వేగాన్ని కేవలం మూడు సెకన్లలో అందుకుంటుంది.
ధర ఏంతంటే..!
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ .99,999 గా ఉంది. ఆయా రాష్ట్రాల ఫేమ్ 2 పథకంలో భాగంగా సబ్సీడి రానుంది. ఈ బైక్‌ను రూ. 999 చెల్లించి మార్చి 18న ప్రిబుక్ చేసుకోవచ్చును. డెలివరీలు జూలైలో ప్రారంభమవుతాయి.
చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులుకు షాకింగ్ న్యూస్..! ఆ కారు ఇప్పుడు మరింత ప్రియం
Comments
Please login to add a commentAdd a comment