
Komaki Ranger Electric Cruiser Motorcycle Launch Details Revealed: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకువస్తున్నాయి. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు దేశీయ స్టార్టప్స్ కూడా తీవ్రమైన పోటీనిస్తున్నాయి. ఆయా స్టార్టప్స్ ముఖ్యంగా రేంజ్‌పై, ఛార్జింగ్ సమయంపై ఫోకస్ పెట్టాయి.
ఇప్పటివరకు భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా వాహనదారులకు అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లే కాకుండా ఇతర బైక్ మోడల్స్‌పై కూడా పలు కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను కొమాకి ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిమీ ప్రయాణం..!
ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్స్, హై స్పీడ్ స్కూటర్స్ , ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను జరుపుతోంది. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ ‘ కొమాకీ రేంజర్’ను వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కొమాకి రేంజర్ క్రూజర్ బైక్ టీజర్‌ను కంపెనీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ టీజర్‌లో పేర్కొంది. కంపెనీ చెప్పినట్లుగా కొమాకీ రేంజర్ క్రూజర్ బైక్ 250 కిమీ రేంజ్ ఇస్తే ఎలక్ట్రిక్ బైక్లలో ఒక సంచలనంగా నిలిచే అవకాశం ఉంది.
ధర ఎంతంటే..!
కొమాకీ రేంజర్ క్రూజర్ బైక్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఈ బైక్ ధర ఉంటుందని కంపెనీ పేర్కొంది. నిపుణుల అంచనా మేరకు ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్ ధర దాదాపు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ఉండనున్నట్లు తెలుస్తోంది.
కొమాకి రేంజర్ ఫీచర్స్ అంచనా..!
కొమాకి రేంజర్ క్రూజర్ బైక్‌లో ముఖ్యమైన ఫీచర్లుగా క్రూయిజ్ కంట్రోల్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, బ్లూటూత్ సిస్టమ్ , అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. కొమాకి రేంజర్‌లో 4-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీంతో 250 కిమీల మేర రేంజ్‌ను అందిస్తోందని కంపెనీ చెప్తుతోంది. 5000-వాట్ల మోటారుతో పనిచేయనుంది.
చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్లలో సంచలనం..! రేంజ్ ఎక్కువే..రేటు తక్కువే..!
Comments
Please login to add a commentAdd a comment