మలేషియా నగరంలోని ఐకానిక్ షా ఆలం స్టేడియం చరిత్రలో కలిసి పోయింది. 80వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చి వేసింది. ఈకూల్చివేతకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా షేర్ చేసింది. అంతే ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఒకప్పుడు 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న ఈ స్టేడియం 30 ఏళ్ల నాటిది. 2020లో నిర్మాణ పరంగా సరిగ్గా లేదని ప్రకటించారు. దీని స్థానంలో 45వేల మంది సామర్థ్యంతో మలేషియా ప్రభుత్వం కొత్త, ఆధునిక స్టేడియంను నిర్మించాలని యోచిస్తోంది.
Así derribaron el techo del Shah Alam Stadium de Malasia 🇲🇾
Recordemos que este estadio esta en proceso de remodelación pic.twitter.com/lOBZayr7bE— Manytops Stadiums (@Manytops) September 19, 2024
ఈ స్టేడియం నిర్మాణం 1990 జనవరి 1న ప్రారంభం కాగా అధికారికంగా 1994, జూలై 16, ప్రారంభించారు. ఇది జాతీయ జట్టుకు హోమ్ స్టేడియంగా ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment