
అమెరికా తాజాగా అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ ఒక సెకనుకు చేసే లెక్కలు ఎన్నో తెలుసా? రెండు లక్షల, లక్షల కోట్లు! క్లుప్తంగా చెప్పుకుంటే 200 పెటాఫ్లాప్స్. సమ్మిట్ అని పేరు పెట్టుకున్న ఈ కొత్త సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా రికార్డులకు ఎక్కింది. అమెరికాకు చెందిన ఓక్‌రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ (ఓఆర్‌ఎన్‌ఎల్) 2012లో 27 పెటాఫ్లాప్స్‌తో తయారుచేసిన టైటాన్ సూపర్ కంప్యూటర్ కంటే ఇది ఎనిమిది రెట్లు ఎక్కువ శక్తిమంతమైనదన్నమాట.
మొత్తం 4608 సర్వర్లను అనుసంధానించడం ద్వారా తయారైన సమ్మిట్ సూపర్ కంప్యూటర్ భౌతిక శాస్త్రంతో పాటు బయో కెమిస్ట్రీ, మెట్రాలజీ, ఇంజినీరింగ్, కృత్రిమ మేధ వంటి అనేక రంగాల్లో అపరిస్కృత సమస్యలకు సమాధానాలు చెప్పగలదని అంచనా. ప్రతి సర్వర్‌లోనూ ఐబీఎం పవర్ 9 ప్రాసెసర్లు ఉంటాయి. వీటితోపాటు ఎన్‌విడియా కంపెనీ తయారుచేసిన టెస్లా వీ100 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment