COUNT
-
శతక నీతి – సుమతి: వాడు దుందుభిలా ఉన్నాడే!
‘ఏం తినాలనుకుంటున్నావో అవి తినేసెయ్.. ఏది నీకిష్టమో అది ఇప్పుడే చేసేస్కో... ఎవరెవరితో ఏవేం మాట్లాడాలనుకుంటున్నావో అది ఇవ్వాళే మాట్లాడేసుకో... ఈ రాత్రికి హాయిగా నిద్రపో... రేప్పొద్దున యుద్ధానికి రా.. ఎందుకంటే మళ్ళీ ఇంటికెళ్ళవు..’ ...పొగరు మాటలు ఇవి.. రామాయణంలో కనబడతారు.. వాలి, రావణాసురుడు. వాళ్ళిద్దరి ప్రవృత్తి ఒక్కలాగే ఉంటుంది. ప్రతిరోజూ ఎవరో ఒకరి దగ్గరకి పోవడం, నువ్వు యుద్ధానికి రావాలని రెచ్చగొడుతూ ఇలా మాట్లాడుతుంటారు. వాలి దగ్గరకు వెళ్ళి దుందుభి మాట్లాడిన మాటలివి. వాలి ‘ఎవడ్రా అది’ అని బయటకు వచ్చాడు. ఫలితం– దుందుభి చచ్చిపోయాడు. ఇలాటి వాళ్ళు ఇప్పుడూ మనకు కనిపిస్తూంటారు. వీళ్ళను లోకులు దుందుభితో పోలుస్తుంటారు. వదరి మాట్లాడడం..ఎందుకలా ? అందుకే బద్దెనగారు సుమతీ శతకంలో..‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ !’ అంటారు. రామాయణం అదే చెబుతుంది. మన పురాణాలు, నీతి శాస్త్రాలూ అవే చెబుతాయి. అలా ప్రవర్తించకు. జీవితంలో అటువంటి అలవాట్లు చేసుకోకు. రావణాసురుడు కూడా ఇలాగే .. సముద్రుడి దగ్గరకు వెళ్ళి బెదిరించాడు. యమధర్మరాజును కూడా వదిలిపెట్టలేదు. కొందరు వీరి దాష్టీకానికి భయపడి పారిపోతే మరికొందరు వీరిని ఓడిస్తుంటారు..ఒకప్పుడు కార్తవీర్యార్జునుడి చేతిలో ఇలాగే ఓడిపోయాడు. అయినా బుద్ధిరాదు. సిగ్గుండదు, మారరు. అలా అతిశయంతో ప్రవర్తించినందుకు చిట్టచివరకు ఏమయింది ... రావణుడు ఒక్కడే పోలేదు, బంధుమిత్రకళత్రాదులందరూ పోయారు, లంకాపట్టణంలో ఉన్న రాక్షసులందరూ పోయారు. .ధర్మం వైపునిలబడ్డ విభీషణుడు తప్ప. ఒకప్పుడు ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సభకు వెళ్ళినా ఒక మాట అంటుండేవాడు...నాకు తెలిసినన్ని అంకెలు, సంఖ్యలు ఎవరికీ తెలియవు. ఎంతవరకయినా లెక్కపెట్టగలను... అని. ఒకసారి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు.. ఒడ్డున ఇసుక బాగా ఉంటుంది కదా... అక్కడ కూర్చుని చేత్తో గుప్పెడు ఇసుక తీసుకొన్నాడు. ఉన్నట్లుండి.. తత్త్వం బోధపడింది. నేను నిజంగా ఇక్కడ ఉన్న ఇసుక రేణువులన్నింటినీ లెక్కపెట్టి చెప్పగలిగే అంకెలు, సంఖ్యలు నాకు తెలుసా.... ఎదురుగా ఉండే అలలు ఎగిసిపడుతుంటే నీటిబిందువులను చూసాడు... వీటిని లెక్కపెట్టి చెప్పగలిగే సంఖ్య నాకు తెలుసా.. ఇలా ఆలోచిస్తుంటే.. నేను ఎంత పెద్ద సంఖ్యయినా లెక్కపెట్టగలను అనుకున్నాను. కానీ కాదు. నాకు తెలిసినదేపాటి? వాటిని సృష్టించినవాడు గొప్ప... అని చేతులెత్తి నమస్కరించుకున్నాడు. ఇక ఆ పై ఎప్పడూ ఇటువంటి అతిశయోక్తి మాటలు మాట్లాడలేదు. ఇతరులకంటే మనకు ఏవయినా కొన్ని విషయాలు కానీ వాటిలో నైపుణ్యాలు కానీ ఎక్కువ తెలిసి ఉండడం తప్పుకాదు. కించిత్ గర్వ కారణం కూడా. కానీ నాకే అన్నీ తెలుసు, నేనే సర్వజ్ఞుణ్ణి అని వదరడం మాత్ర తప్పు. మనం ఎంతటి గొప్పవారమయినా మనకంటే గొప్పవారు కూడా ఉంటారనే ఎరుక ఉండాలి. అప్పుడు వినయం దానంతటే అదే వస్తుంది. శంకర భగవత్పాదులవంటి మహాపురుషుడు ఒక చోట...‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథిత్ కృపయా పాలయ విభో’’ అంటారు. శంకరా, నేను పశువుతో సమానం– అల్పజ్ఞుణ్ణి. నీవు పశుపతివి.. అంటాడు. అంతటివాడు అంత వినయం ప్రదర్శిస్తే అరాకొరా తెలిసిన మనం ఎలా ప్రవర్తించాలి? -
సెకనుకు రెండు లక్షల, లక్షల కోట్ల లెక్కలు!
అమెరికా తాజాగా అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ ఒక సెకనుకు చేసే లెక్కలు ఎన్నో తెలుసా? రెండు లక్షల, లక్షల కోట్లు! క్లుప్తంగా చెప్పుకుంటే 200 పెటాఫ్లాప్స్. సమ్మిట్ అని పేరు పెట్టుకున్న ఈ కొత్త సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా రికార్డులకు ఎక్కింది. అమెరికాకు చెందిన ఓక్రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ (ఓఆర్ఎన్ఎల్) 2012లో 27 పెటాఫ్లాప్స్తో తయారుచేసిన టైటాన్ సూపర్ కంప్యూటర్ కంటే ఇది ఎనిమిది రెట్లు ఎక్కువ శక్తిమంతమైనదన్నమాట. మొత్తం 4608 సర్వర్లను అనుసంధానించడం ద్వారా తయారైన సమ్మిట్ సూపర్ కంప్యూటర్ భౌతిక శాస్త్రంతో పాటు బయో కెమిస్ట్రీ, మెట్రాలజీ, ఇంజినీరింగ్, కృత్రిమ మేధ వంటి అనేక రంగాల్లో అపరిస్కృత సమస్యలకు సమాధానాలు చెప్పగలదని అంచనా. ప్రతి సర్వర్లోనూ ఐబీఎం పవర్ 9 ప్రాసెసర్లు ఉంటాయి. వీటితోపాటు ఎన్విడియా కంపెనీ తయారుచేసిన టెస్లా వీ100 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంటుంది. -
ఈ పెన్ పదాలను లెక్కిస్తుంది..
సాక్షి, శ్రీనగర్ : కంప్యూటర్లో, మొబైల్ ఫోన్లలో మనం ఎన్ని పదాలు టైప్ చేశామో తెలుస్తుంది.. కానీ పేపర్‌పై మాత్రం ఎన్ని పదాలు రాశామో తెలుసుకోవడం కష్టమే.. కానీ ఓ తొమ్మిదేళ్ల బాలుడు తయారుచేసిన కౌంటింగ్ పెన్ దీనికి పరిష్కారం చూపింది. రాసే పెన్నుతోనే ఎన్ని పదాలు రాస్తున్నామో తెలిసుకునేలా దీనిని రూపొందించాడు. ఈ పెన్నుని తయారుచేసిన జమ్మూకాశ్మీర్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ ఖాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ పెన్ ద్వారా ఎన్ని పదాలు రాస్తున్నామో వాటి సంఖ్య పెన్ను పైభాగంలో గల చిన్న ఎల్సీడీ స్ర్కీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్‌కు కూడా మెసేజ్ వస్తుంది. ‘పరీక్షలో తక్కువ పదాలు రాసినందుకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఎంతో కుంగిపోయాను. ఆ తర్వాత పరీక్షలో టైమ్ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై దృష్టి సాధించాను. ఆ ఆలోచనల్లో నుంచి తయారయిందే ఈ కౌంటింగ్ పెన్’ అని అహ్మద్ తెలిపాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఈ పెన్నుని ప్రదర్శించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అహ్మద్‌ను ప్రశంసించడంతో పాటు రివార్డును అందజేశారు. నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ కౌంటింగ్ పెన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. మే నుంచి ఈ పెన్ను మార్కెట్లోకి రానుంది. -
ఇంత వేగంగా ఎప్పుడైనా లెక్కపెట్టారా?
బీజింగ్: నోట్ల కట్టలు లెక్కపెట్టడానికి కౌంటింగ్ మెషిన్లు వాడుతుంటారు. మెషీన్ అందుబాటులో లేకపోతే పెద్ద మొత్తాన్ని లెక్కగట్టడానికి గంటలు గంటలు టైం వృథా చేస్తారు. కానీ చైనాలోని షాంగ్డాంగ్కి చెందిన ప్రైవేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఓ యువతి డబ్బులను కౌంటింగ్ మెషిన్ కన్నా వేగంగా లెక్కపెడుతోంది. చైనా కరెన్సీ(యువాన్)లను 550 నోట్ల వరకు సెకన్లలోనే లెక్కపెడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను బ్యాంక్‌లో క్యాషియర్‌గా కాకుండా కౌంటింగ్ మెషిన్‌గా పిలుస్తున్నారట. బ్యాంక్‌కి వచ్చే వినియోగదారులు కూడా త్వరగా తమ పనైపోవాలని ఆ యువతి వద్దకే వెళుతుంటారట. -
శ్రీవారి హుండీల లెక్కింపులో కొత్త ఆదేశాలు
ద్వారకా తిరుమల : శ్రీవారి దేవస్థానంలో బుధవారం నిర్వహించాలి్సన హుండీల లెక్కింపు కొత్త ఆదేశాల కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. దేవస్థానంలో పనిచేసే రెగ్యులర్ అటెండర్లు, డ్రైవర్లు, ఎన్‌ఎంఆర్‌లు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని హుండీల లెక్కింపునకు అనుమతించడం లేదని ఆలయ అధికారులు సర్క్యులర్ జారీచేశారు. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఈ సర్క్యులర్‌ను నోటీసు బోర్డులో ఉంచారు. దీంతో దిగువస్థాయి సిబ్బంది కొరత కారణంగా హుండీల లెక్కింపు నిలిచిపోయింది. చినవెంకన్న ఆలయంలో ప్రతి 15–20 రోజులకోసారి జరిగే హుండీల లెక్కింపులో రెగ్యులర్ సిబ్బంది 65 మందితో పాటు, ఎన్ఎంఆర్, ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులు దాదాపు 100 మంది పాల్గొంటారు. దిగువస్థాయి సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో పలు ప్రాంతాల్లో ఉన్న హుండీల్లోని సొమ్మును బయటకు తీసి, లెక్కింపు ప్రాంతానికి తరలిస్తారు. అక్కడ మిగిలిన సిబ్బంది, అధికారులు లెక్కిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ శ్రమిస్తేనే ఈ లెక్కింపు పూర్తవుతుంది. అయితే బుధవారం హుండీల లెక్కింపు జరిపేందుకు ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇంతలో ఎగువస్థాయి సిబ్బంది, అధికారులతో మాత్రమే లెక్కింపు జరపమన్న ఆదేశాలు జారీ అయ్యాయి. సొమ్ము బయటకు తీసేవారు లేక హుండీల లెక్కింపు జరిపేందుకు సుమారు 30 మంది అధికారులు, ఎగువస్థాయి సిబ్బంది ఉదయం లెక్కింపు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే హుండీల్లోని సొమ్ము బయటకు తీసే వారు లేక, తీసినా సకాలంలో లెక్కింపు పూర్తవదన్న సందేహంతో అధికారులు లెక్కింపును నిలిపివేశారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో జరిగే హుండీల లెక్కింపునకు అనుమతించని దిగువస్థాయి సిబ్బందిని, ఏ పర్యవేక్షణా లేని, ఆదాయాలు వచ్చే ప్రాంతాల్లో విధులు ఎలా కేటాయిస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరింత కట్టుదిట్టమైన భద్రతల నడుమ లెక్కింపు జరపాల్సింది పోయి, ఇలా దిగువస్థాయి సిబ్బందికి లెక్కింపులో మినహాయింపు ఇవ్వడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.