ఇంత వేగంగా ఎప్పుడైనా లెక్కపెట్టారా? | Chinese girl counts currencey notes more than mission speed | Sakshi
Sakshi News home page

ఇంత వేగంగా ఎప్పుడైనా లెక్కపెట్టారా?

Published Wed, Jul 12 2017 8:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

ఇంత వేగంగా ఎప్పుడైనా లెక్కపెట్టారా?

ఇంత వేగంగా ఎప్పుడైనా లెక్కపెట్టారా?

బీజింగ్‌: నోట్ల కట్టలు లెక్కపెట్టడానికి కౌంటింగ్‌ మెషిన్లు వాడుతుంటారు. మెషీన్‌ అందుబాటులో లేకపోతే పెద్ద మొత్తాన్ని లెక్కగట్టడానికి గంటలు గంటలు టైం వృథా చేస్తారు. కానీ చైనాలోని షాంగ్‌డాంగ్‌కి చెందిన ప్రైవేట్‌ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఓ యువతి డబ్బులను కౌంటింగ్‌ మెషిన్‌ కన్నా వేగంగా లెక్కపెడుతోంది.

చైనా కరెన్సీ(యువాన్‌)లను 550 నోట్ల వరకు సెకన్లలోనే లెక్కపెడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఆమెను బ్యాంక్‌లో క్యాషియర్‌గా కాకుండా కౌంటింగ్‌ మెషిన్‌గా పిలుస్తున్నారట. బ్యాంక్‌కి వచ్చే వినియోగదారులు కూడా త్వరగా తమ పనైపోవాలని ఆ యువతి వద్దకే వెళుతుంటారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement