ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో అజిత్ పవార్ కలిసిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ వరుసగా రెండోరోజు శరద్ పవార్‌తో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అజిత్ మాట్లాడుతూ.. కేవలం అశీస్సులు తీసుకోవడానికే శరద్ పవార్‌ను కలిశానని అజిత్ పవార్ చెప్పారు.
#WATCH | NCP president Sharad Pawar arrives at Mumbai's YB Chavan Centre where Maharashtra Deputy CM Ajit Pawar and NCP MLAs of his faction are present to meet him. pic.twitter.com/hrx8S2mVTR
— ANI (@ANI) July 17, 2023
ఏక్‌నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మంత్రి పదవులు స్వీకరించిన అభ్యర్థులతో కలిసి నిన్ననే శరద్ పవార్‌ను కలిశారు. కాగా.. నిన్న ఆదివారం అయినందున కొంత మంది రాలేకపోయారని నేడు సమావేశం అనంతరం మాట్లాడారు. శరద్ పవార్ తమ అభ్యర్థనలను మౌనంగా విన్నారని, ఏమీ మాట్లాడలేదని అజిత్ పవార్ చెప్పారు.
నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశం జరిగింది. అయితే.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే ఉంటామని తీర్మాణం చేయాల్సి ఉంది. ఆ తీర్మాణాన్ని స్పీకర్‌కు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ మరోసారి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీలో ఎన్డీయే నిర్వహించనున్న సమావేశానికి అజిత్ పవార్ రేపు వెళ్లనున్నారు.
ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేతలు ఆదివారం ముంబైలో శరద్ పవార్‌ను కలిశారు. అయితే, శరద్ పవార్‌ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని కోరినట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: NCP Leadership Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పవార్ రియాక్షన్?
Comments
Please login to add a commentAdd a comment