
జూన్ 30న ఒక సెకను ఎక్స్‌ట్రా!
సాధారణంగా రోజుకు 24 గంటలు. కానీ ఈ నెల 30 వ తేదీన మాత్రం రోజుకు 24 గంటల ఒక సెకను.
లండన్: సాధారణంగా రోజుకు 24 గంటలు. కానీ ఈ నెల 30 వ తేదీన మాత్రం రోజుకు 24 గంటల ఒక సెకను. అంటే మొత్తంగా ఆ రోజు 86,400 సెకన్లకు బదులు 86,401 సెకన్లు ఉంటాయి. ఆ రోజు(జూన్ 30)కు ఒక లీప్ సెకనును కలుపుతున్నట్లు పారిస్ అబ్జర్వేటరీ ప్రకటించింది. స్థిరంగా ఉండే ఆటమిక్ టైమ్‌కు భూస్వయం ప్రదక్షిణ సమయం అనుసంధానమయ్యేందుకు వీలుగా లీప్ సెకనును కలుపుతుంటారు. గతంలో 2012లో ఇలా లీప్ సెకనును కలిపారు.
భూమి తన చుట్టూ తాను తిరిగే సమయం ప్రతీరోజు సెకనులో 2 వేల వంతు తగ్గుతూ ఉంటుంది. దీన్ని ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ సర్వీస్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అవసరమైనపుడు సమయాన్ని సరిచేసేందుకు యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైమ్‌కు లీప్ సెక నును కలుపుతూ ఉంటుంది.