
దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి వ్యాక్సిన్ వేసుకుని బహుమతిగా ఇవ్వాలని బీజేపీ పిలుపునివ్వగా.. యాదృచ్చికమో ఏమో గానీ అదే రోజు మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. రెండో డోసు శుక్రవారం వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ‘రెండో వ్యాక్సిన్ పూర్తి’ చెబుతూ రెండు ఫొటోలను కూడా పంచుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 2.25 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక చర్యలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అయితే అది కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ప్రధాని జన్మదినాన కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం.
చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం
చదవండి: ఈటలకు మార్మోగిన చప్పట్లు: అమిత్ షా సభలో స్పెషల్ అట్రాక్షన్
Second jab done ✔️ #VaccinationUpdate pic.twitter.com/hfMVOZEV3T
— KTR (@KTRTRS) September 17, 2021