న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి దేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందువల్ల మళ్లీ ఆ మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా ముందస్తు చర్యగా మరోసారి సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ దిశగా జూన్ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాదు ఇంకా మెదటి, రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవల్సిన వారందరికీ వ్యాక్సిన్‌లు వేయడమే కాకుండా అందరూ వ్యాక్సిన్‌లు తీసుకునేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
"ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్ డోస్‌లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్‌లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0' ప్రధాన లక్ష్యాలని తెలిపింది. వ్యాక్సిన్ డ్యూ-లిస్ట్‌ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆసుపత్రులలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికి వ్యాక్సిన్ డోస్‌లు అందేలే సమీక్షించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రకియను సమర్ధవంతంగా నిర్వహించేలా కమ్యూనికేషన్ వ్యూహాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది.
అలాగే కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఫస్ట్ ఎక్స్‌పైరీ ఫస్ట్ అవుట్ సూత్రం ఆధారంగా గడువు ముగిసిపోనున్న బ్యాలెన్స్ వ్యాక్సిన్ మోతాదులను త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వినియోగించిలే క్రియాశీలక పరివేక్షణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్‌కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేశామని చెప్పారు.
(చదవండి: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ)
Comments
Please login to add a commentAdd a comment