dose
-
చీర అందాలతో గ్లామర్ డోస్ పెంచిన మౌనీరాయ్ (ఫోటోలు)
-
బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్‌లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్- కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్-వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు. ఓమిక్రాన్‌లోని ఈ కొత్త సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్.1 సబ్‌వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు. కాగా కోవిడ్-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది. ఇది కూడా చదవండి: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ! -
రాహుల్‌గాంధీ దోసె..ఎన్నికల క్లాసు!
ఇటీవల రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన రాహుల్‌గాంధీ దోసెలేశాడు. అలా ఆయన దోసెలేస్తూ ఉండగా..అంకితభావంతో క్రమశిక్షణతో మెలిగే ఓ కార్యకర్తకు ఆ చర్య ద్వారా అందిన సందేశమిది... ‘‘పరిశీలనగా చూడాలేగానీ..ఎన్నికల ఉపదేశాలెన్నో ఉన్నాయి దోసెలో’’అన్నాడు రాహుల్‌గాంధీ గిన్నెడు పిండిని పెనమ్మీద పోస్తూ. ‘‘దోసెల్లో ఎన్నికల క్లాసులా?!’’ ఆశ్చర్యపోయారు రాష్ట్ర నేతలూ, కార్యకర్తలు. ‘‘కాదా మరి..ఎన్నికల వాతావరణం వేడెక్కిందంటూ జర్నలిస్టులు తరచూ అంటుంటారు. ఎందుకనీ?..ఎందుకంటే వేడెక్కిన పెనం మీద సర్రుమంటూ నీళ్లు జల్లగానే ‘సుయ్యి’మంటుంది కదా. ఎన్నికల వాతావరణం కూడా అలాగే వేడెక్కుతుందన్నమాట’’ ‘‘ఇక... పిండి కలపడమూ, నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికా ఒక్కలాంటివే. ఎన్నికల తయారీకవి కసరత్తుల్లాంటివన్నమాట. ఇకమరి మన దోసెపెనం అన్నది నియోజకవర్గమనుకుందాం. పోసిన పిండి పోసిందగ్గరే ఉండకూడదు. అభ్యర్థన్నవాడు ఒకేచోట అలాగే ఉండిపోకుండా.. నియోజకవర్గ నలుమూలలా నాలుగు దిక్కులకు తిరుగుతూ, విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. పెనం మూలమూలలకూ విస్తరించే పిండి ఇచ్చే సందేశమిదే’’ పెనమ్మీద పోసిన పిండిని అన్నివైపులకూ గుండ్రంగా విస్తరింపజేస్తూ వివరించాడు. ‘‘రవ్వదోసెలోని రంధ్రాల్లా అభ్యర్థి వ్యక్తిగత జీవితం కూడా అవతలకీ ఇవతలకీ కనిపించేటంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇక మసాలాదోసె.... మధ్యనున్న మసాలాని అన్నివైపుల్నుంచీ కవర్ చేసినట్టుగానే..మన సొంత కార్యకర్తల ప్రయోజనాల్ని అన్నివైపులా కవర్ చేసుకుంటూ, కాపాడుకోవాలన్న స్ఫూర్తినిస్తుంది మసాలాదోసె’’ ‘‘దోసె పోసిన కాసేపటికి సలాటంతో చకచకా నూనె జల్లినట్టు చేయడమే మన ఈ డబ్బులూ, సారా పంచడమన్నది. ఇక పోసినది పోసినట్టుగా అట్టు పెనానికంటుకుపోకుండా దోసె కింద కస కసా, కర కరామంటూ సరాటంతో సరసరలాడించడమే ఓటరింటికి మాటిమాటికీ పోయి, మన గుర్తును గుర్తు చేసి రావడం’’ ‘‘ఓటమి అన్నది ఒక్కోసారి మాడిపోయే మసాలాదోసె లాంటిది. రుచి, పచీ ఉండదు. పెనమ్మీద మాడిన పెరసట్టంటే గ్రహణం పట్టిన సూర్యుడి లాంటిది. గ్రహణం ఎల్లకాలమూ ఉండదు. ఇవ్వాళ ఓడిన అభ్యర్థి..అట్టు తిరగేసినట్టుగా... ఆవలితట్టున అంటే... రెండోవైపున తెల్లటి చంద్రుడిలా మెరుస్తూ గెలవచ్చు. దోసెకిరువైపులా ఉండే కలరుమార్పుల్లాంటివే గెలుపూ, ఓటమి అనుకోవాలి’’ ‘‘ఇక సర్వింగులో కూడా ఓ సందేశముండాలి..’’ అంటుండగానే చుట్టూ మూగి చూస్తున్న ప్రజల్లోంచి ఎవరో గబుక్కున అరిచారు. ‘‘అవును..కొందరు నేతలు ‘కోన్’ షేపులో..అంటే టోపీ రూపంలో సర్వ్ చేస్తుంటారు. గెలిచాక అచ్చం ఓటరు నెత్తిన టోపీ పెట్టినట్టుగానే..’’ అంటూ అరుస్తూ ఆ కోణంగి కొంటెగా..చుట్టూ ఉన్న కార్యకర్తలు పట్టుకునేలోపే తుర్రుమంటూ పరుగందుకున్నాడు. -
కోవిడ్ వ్యాక్సిన్ @ 200 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేసిన డోసుల సంఖ్య 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 199.71 కోట్ల డోసుల టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 20,044 కరోనా కేసులు నిర్థారణయ్యాయి. దీంతో, మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయని పేర్కొంది. అదే సమయంలో, మరో 56 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,25,660కు పెరిగినట్లు తెలిపింది. -
రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' కరోనా వ్యాక్సిన్ ప్రచారం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి దేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అందువల్ల మళ్లీ ఆ మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా ముందస్తు చర్యగా మరోసారి సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ దిశగా జూన్ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాదు ఇంకా మెదటి, రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవల్సిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడమే కాకుండా అందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. "ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్ డోస్‌లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0' ప్రధాన లక్ష్యాలని తెలిపింది. వ్యాక్సిన్ డ్యూ-లిస్ట్‌ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆసుపత్రులలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికి వ్యాక్సిన్ డోస్‌లు అందేలే సమీక్షించాలని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రకియను సమర్ధవంతంగా నిర్వహించేలా కమ్యూనికేషన్ వ్యూహాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్ సూత్రం ఆధారంగా గడువు ముగిసిపోనున్న బ్యాలెన్స్ వ్యాక్సిన్ మోతాదులను త్వరితగతిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వినియోగించిలే క్రియాశీలక పరివేక్షణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్‌కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేశామని చెప్పారు. (చదవండి: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ) -
Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్రం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్నవాళ్లకు బుధవారం(మార్చి 16వ తేదీ) నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 12-14 ఏళ్ల మధ్య పిల్లలతోపాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవీయా ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు. बच्चे सुरक्षित तो देश सुरक्षित! मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है। साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे। मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ। — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022 కొత్త కేసులు.. 27 మరణాలే! మన దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 675 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 4,377 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. వీరిలో 4.24 కోట్ల మంది రికవర్ అయ్యారు. భారత్‌లో Corona Deaths ఇప్పటి వరకు 5,15,877గా నమోదు అయ్యింది. -
టీకా సిత్రాలు.. ఆందోళనలో ప్రజలు!
దౌల్తాబాద్‌కు చెందిన అనురాధ కరోనా నివారణకు కొద్ది రోజుల క్రితమే తొలిడోస్‌ను తీసుకున్నారు. అయితే రెండో డోస్ కూడా తీసుకున్నట్లు ఆమె భర్త సెల్‌కు మెసేజ్ రావడంతో అవాక్కయ్యారు. మరో ఘటనలో.. దౌల్తాబాద్‌కు చెందిన సత్యనారాయణ మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్‌కు వైద్యసిబ్బంది దగ్గరకు వెళ్ళగా మీరు తీసుకున్నారు కదా అని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. నా సెల్‌కు మెసేజ్ రాలేదు కదా అంటే సమాధానం లేదు. సాక్షి,దౌల్తాబాద్(హైదరాబాద్): కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే దివ్యౌషధమని, ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసు కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకడుగు వేసిన ప్రజలు రెండో వేవ్ ఉధృతం కావడంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించింది కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో మొదటిడోస్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. రెండో డోస్‌లోనే.. మొదటి డోస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యసిబ్బంది రెండో డోస్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్లు ప్రజల సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో వారంతా కంగారు పడుతున్నారు. టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఆతృతనా..? మరేమైనా కారణంతోనా..? తెలియదు కానీ మెసేజ్‌లు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగడంతోనే ఆన్లైన్లో అంకెల గారడీ ప్రదర్శించేందుకే అన్ని విధాలా కసరత్తు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. 9 ఉపకేంద్రాల పరిధిలో.. మండలంలో 39,065 మందిని వ్యాక్సిన్‌కు అర్హులుగా గుర్తించి వందశాతం లక్ష్యాన్ని ఇటీవలే అధిగమించారు. రెండో డోస్‌కు మండలంలోని 9 ఉపకేంద్రాల పరిధిలో ఏఎన్ఎంలు, వైద్యసిబ్బంది రెండోడోస్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు 15,551 మందికి రెండో డోస్ వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది సిబ్బంది తొలిడోస్ వేసుకున్న వారికి ఫోన్‌చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.రెండోడోస్ వేసుకున్నారా..?ఆన్లైన్లో నమోదు చేయమంటారా..? అంటూ అడుగుతున్నారు. ఈ క్రమంలో రెండో టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్‌వేవ్ -
కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిషీల్డ్ కరోనా టీకాను బూస్టర్ డోసుగానూ అనుమతించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. రెండు డోస్‌లతోపాటు మూడో(బూస్టర్) డోస్‌గానూ పంపిణీ చేసేంత స్థాయిలో భారత్‌లో టీకా నిల్వలు ఉన్నాయని కోవిషీల్డ్ తయారీసంస్థ సీరమ్ ఆ దరఖాస్తులో పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు భారత్‌లోనూ కమ్ముకుంటున్న ఈ తరుణంలో బూస్టర్ డోస్‌కు దేశంలో డిమాండ్ పెరిగిందని సీరమ్ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌కు వైద్య, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఇప్పటికే బూస్టర్ డోస్‌గా ఆమోదించిందని డీసీజీఐకు పంపిన దరఖాస్తులో సీరమ్ ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ పేర్కొన్నారు. -
టీకా రెండో డోస్‌పై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ లభ్యత సంతృప్తికరంగా ఉన్నందున, మొదటి డోస్ టీకా వేయించుకున్న వారంతా రెండో డోస్ తీసుకునేలా కృషి చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వేసిన డోసుల సంఖ్య 100 కోట్లకు చేరువవుతున్న సమయంలో ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ‘కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోని వారి సంఖ్య గణనీయంగా ఉన్నందున, వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. చాలా రాష్ట్రాల్లో టీకా లభ్యత అవసరాలకు సరిపోను ఉండగా రెండో డోస్ కోసం లబ్ధిదారులు వేచి చూడాల్సిన పరిస్థితులు లేవు. ప్రభుత్వం కూడా అవసరమైన డోసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేసి, రాష్ట్రాలు తమ టీకా లక్ష్యాలను సులువుగా సాధించాలి’అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ఏడాదిగా అమల్లో ఉన్న నిబంధనలపై తాజాగా సూచనలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆయన కోరారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ మందకొడిగా సాగుతున్న జిల్లాలను గుర్తించడంతోపాటు అక్కడ ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, అదనంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. చదవండి: వేలాదిగా కశ్మీర్‌ను వీడుతున్న వలసకూలీలు -
దేశ వ్యాప్తంగా 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల వేడుక
సాక్షి, చంద్రగిరి (చిత్తూరు జిల్లా)/గార (శ్రీకాకుళం జిల్లా): చిత్తూరు జిల్లాలో చారిత్మ్రక చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయల కోటలోని రాణి మహల్, శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలి హుండం బౌద్ధ స్థూపాల్లోని కాల చక్రం (అశోకచక్రం)లు గురువారం రాత్రి త్రివర్ణ శోభను సంతరించుకున్నాయి. గురువారం నాటికి దేశ వ్యాప్తంగా 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పురావస్తు కట్టడాల వద్ద ప్రత్యేక కార్య క్రమాలను చేపట్టింది. మొత్తం 100 పురావస్తు కట్టడాల్లో ఈ వేడుకలను నిర్వహించగా, రాష్ట్రంలో ఐదు చోట్ల ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు శాలిహుండం బౌద్ధ స్థూపాల్లోశని కాలచక్రం త్రివర్ణ పతాక కాంతులతో కళకళలాడింది. అలాగే, చంద్రగిరి రాయలవారి కోట రాణిమ హల్‌పై త్రివర్ణ పతాక వెలు గులు రెప రెపలాడాయి. సుదీర్ఘ కాలం తర్వాత లైటింగ్ షో నిర్వహిం చడం తో కోట సందర్శకులతో కిటకి టలా డింది. -
సెకండ్ డోస్‌లో వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: పండుగలు, శుభకార్యాల పేరుతో జనం సాధారణ జీవనంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్ వెళ్లిపోయిందన్న భ్రమలో ఉండిపోయారు. దీంతో కరోనా జాగ్రత్తలను చాలామంది పక్కనపెట్టేశారు. మాస్క్‌లను ధరించడానికి అయిష్టత చూపుతున్నారు. భౌతికదూరం మరిచిపోయారు. కరోనా థర్డ్‌వేవ్‌పై హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్నిచోట్ల సాగదీత ధోరణిలో కొనసాగుతోంది. మొదటి డోస్ వేసుకున్నవారితో పోలిస్తే, రెండో డోస్ వేసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారు. నారాయణపేటలో సెకండ్ డోస్ 14 శాతమే... తెలంగాణలో ఈ ఏడాది జనవరి 16 నుంచి ఈ నెల 7 వరకు జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 70 శాతం మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 110 శాతం ( ఇతర రాష్ట్రాలవారితో కలిపి) జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 91 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81 శాతం మొదటి డోస్ టీకా పొందారు. కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత తక్కువగా 45 శాతం మంది మొదటి డోస్ టీకా తీసుకున్నారు. ఇంత తక్కువ శాతం మొదటి డోస్ టీకా వేశారంటే అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమవుతుందని అంటున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 46 శాతం, నాగర్‌కర్నూలు 50 శాతం మంది అర్హులు టీకా పొందినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలావుంటే సెకండ్ డోస్ తీసుకున్నవారు కేవలం 38 శాతమే ఉన్నారు. సెకండ్ డోస్ తీసుకున్నవారు హైదరాబాద్‌లో 51శాతం ఉండగా, నారాయణపేట జిల్లాలో అత్యంత తక్కువగా14 శాతమే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 18 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 19 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. చదవండి: బీసీ కులాలవారీగా జనగణన -
మోదీ బర్త్ డే నాడు మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. రెండో డోసు శుక్రవారం వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ‘రెండో వ్యాక్సిన్ పూర్తి’ చెబుతూ రెండు ఫొటోలను కూడా పంచుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 2.25 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక చర్యలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అయితే అది కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ప్రధాని జన్మదినాన కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చదవండి: ఈటలకు మార్మోగిన చప్పట్లు: అమిత్ షా సభలో స్పెషల్ అట్రాక్షన్ Second jab done ✔️ #VaccinationUpdate pic.twitter.com/hfMVOZEV3T — KTR (@KTRTRS) September 17, 2021 -
Covid-19 Vaccine: 53 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 53 కోట్లు దాటింది. ఇప్పటివరకు 60,88,437 శిబిరాల ద్వారా మొత్తం 53,61,89,903 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కాగా గత 24 గంటలలో 63,80,937 వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించారు. మరోవైపు కరోనా బారి నుంచి కోలుకున్నవారి శాతం (రికవరీ రేటు) 97.45 %కు చేరుకుంది. దేశంలో కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3.13 కోట్ల మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కాగా గత 24 గంటలలో 35,743 మంది కరోనా బాధితులు రికవర్ అయ్యారు. 38,667 కొత్త కేసులు 24 గంటలలో దేశవ్యాప్తంగా 38,667 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 48 రోజులుగా ప్రతీ రోజు కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. ప్రస్తుత దేశవ్యాప్తంగా 3,87,673 మంది చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 22,29,798 కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా, ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 49.17 కోట్లు దాటింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 1.73%గా ఉంది. వరుసగా 19 రోజులుగా 3% లోపు పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అయితే 68 రోజులుగా దేశవ్యాప్త పాజిటివిటీ రేటు 5% లోపే ఉంది. చదవండి : కూలిన అగ్నిమాపక విమానం, 8 మంది దుర్మరణం -
కోవిషీల్డ్ రెండో డోస్ 12–16 వారాల మధ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరులకు అందజేస్తున్న కోవిషీల్డ్ కోవిడ్ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. రెండో డోసు తీసుకోవడానికి ప్రస్తుతం 6–8 వారాలున్న వ్యవధిని ఇకపై 12–16 వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చేసిన సిఫారసుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు టీకాల మధ్య కాల పరిమితిని పెంచితే మరింతగా ప్రయోజనాలు ఉన్నట్లు బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైన నేపథ్యంలో ఎన్టీఏజీఐ కొత్తగా ఈ సిఫార్సు చేసింది. మొదటి టీకా తీసుకున్నాక ఆరు వారాలలోపు రెండో టీకా తీసుకుంటే వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 55.1 శాతం ఉండగా, రెండో డోస్‌కు 12 వారాలకంటే ఆలస్యంగా తీసుకుంటే టీకా సామర్థ్యం ఏకంగా 81.3 శాతానికి పెరిగినట్లు బ్రిటన్ అధ్యయనంలో తేలింది. మరోవైపు, భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ రెండు టీకాల మధ్య వ్యవధిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తమ వద్ద కోవిడ్ టీకాల కొరత చాలా ఎక్కువగా ఉందని చాలా రాష్ట్రాలు కేంద్రప్రభుత్వానికి విన్నవించుకున్నవేళ కోవిషీల్డ్ టీకా డోస్‌ల మధ్య అంతరాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో టీకా డోస్‌ల కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం తెల్సిందే. కోవిషీల్డ్ టీకాల డోస్‌ల మధ్య వ్యవధిని పెంచడం ఇది రెండోసారి. 28 రోజుల వ్యవధిని 6–8 వారాలుగా మారుస్తూ మార్చి నెలలో నిర్ణయించారు. ఎన్టీఏజీఐ చేసిన సిఫార్సులను నీతి ఆయోగ్ సభ్యుడైన డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కోవిడ్–19(ఎన్ఈజీవీఏసీ) అంగీకరించిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిషీల్డ్ డోసుల మధ్య కాలవ్యవధిని 12 వారా లు మించి పెంచితే మంచిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పేర్కొందని, ఇదే విధానాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయని వీకే పాల్ చెప్పారు. ఎన్టీఏజీఐ చేసిన సిఫార్సులు ఇవీ.. ► కోవిషీల్డ్ కోవిడ్ రెండు డోసుల మధ్య కాల వ్యవధిని 12–16 వారాలకు పెంచుకోవచ్చు ► కోవిషీల్డ్, కోవాగ్జిన్ కోవిడ్ టీకాల్లో గర్భిణులు తమకు నచ్చిన టీకాలను ఎంచుకోవచ్చు ► కోవాగ్జిన్ రెండు టీకాల మధ్య కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు ► నిర్ధారణ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు పూర్తిగా కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే టీకాను తీసుకోవాలి ► కోవిడ్ టీకా తీసుకునేముందు లబ్దిదారులకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయాలన్న ప్రతిపాదనను ఎన్టీఏజీఐ తిరస్కరించింది ► గర్భిణులకు తరచుగా జరిగే డాక్టర్ చెకప్‌ల సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలతోపాటు సైడ్ ఎఫెక్ట్లపైనా వారికి అవగాహన కలిగించాలి ► టీకా తీసుకుంటే అత్యంత అరుదుగా రక్తం గడ్డ కట్టడం, బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చనే వివరాలతో కూడిన అవగాహనను గర్భిణులకు కల్పించాలి ► ప్రసవించాక పాలిచ్చే తల్లులు ఎప్పుడైనా సరే టీకా తీసుకోవచ్చు ► టీకా మొదటి డోస్ తీసుకున్నాక పరీక్షలో పాజిటివ్‌గా తేలితే పూర్తిగా కోలుకున్నాక 4–8 వారాల తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి ► బయటి వ్యక్తుల నుంచి యాంటీ బాడీలు, ప్లాస్మాను పొందాక కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి మూడు నెలల వరకు కోవిడ్ టీకాను తీసుకోకూడదు. ► మొదటి డోస్ తీసుకున్నాక అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స అవసరమైన వారు, ఐసీయూ చికిత్స అవసరమైన వారు కనీసం 4–8 వారాలు ఆగిన తర్వాతే రెండో డోస్ టీకా తీసుకోవాలి. -
మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. వ్యాక్సిన్ ఎపుడు తీసుకోవాలి!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవడానికి సంబంధించి పలు అనుమానాలున్న తరుణంలో నిపుణుల కమిటీ కీలక సలహాలిచ్చింది. కరోనా నుంచి కోలుకున్నవారు ఆరు నెలలకు వ్యాక్సిన్ తీసుకోరాదని నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలకు పెంచాలని కేంద్రానికి జాతీయ సాంకేతిక సలహా బృందం కీలక సూచనలు చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ సిఫారసులు చేసినట్టు తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా వినియోగిస్తోన్న మరో టీకా కోవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కోవాగ్జిన్ డోసుల్లో మార్పులేదని స్పష్టం చేసింది. కోవీషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని గతంలోనే కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. కరోనా టీకా డోసుల మధ్య వ్యవధిని 28 రోజుల నుంచి 6-8వారాలకు పెంచుతూ మార్చిలో నిర్ణయం తీసుకుంది. గర్భిణి స్త్రీలు తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో నిర్ణయించుకోవచ్చని తాజాగా కమిటీ సూచించింది. డెలివరీ తర్వాత, పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ తీసు కోవచ్చునని పేర్కొంది. టీకా మొదటి మోతాదు తీసుకున్న తరువాత కోవిడ్ పాజిటివ్ వస్తే ..రెండవ డోసు తీసుకునేందుకు కోలుకున్న తరువాత నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలని ప్యానెల్ సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే, మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా ప్లాస్మా తీసుకున్న కోవిడ్ బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల వరకు టీకాను వాయిదా వేయాలి. హాస్పిటలైజేషన్ లేదా ఐసీయూలో చికిత్స లాంటి ఇతర తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా తదుపరి టీకా తీసుకునే ముందు నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం, కోవిడ్ సంక్రమణ నుండి కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఈ టీకా తీసుకోవాలి. చదవండి : కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా రెండు రోజులుగా ఆకలితో.. అమ్మ, సోదరుడి శవాల పక్కనే -
నర్సు నిర్లక్ష్యం: ఫోన్ మాట్లాడుతూ రెండు సార్లు వ్యాక్సిన్
లక్నో: కరోనా వ్యాక్సిన్ వేయడంలో అలసత్వం వద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా కింది స్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ ఓ మహిళలకు రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది. తప్పు చేసిందే గాక ఆమె దబాయింపుకు పాల్పడడం గమనార్హం. దీంతో టీకా వేసుకున్న మహిళ ఆందోళన చెందుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకుంది. కాన్పూర్ దేహత్ జిల్లా అక్బర్పూర్ ప్రాంతానికి చెందిన మహిళ కమలేశ్ కుమారి (50) కరోనా టీకా వేసుకునేందుకు మర్హౌలీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఏఎన్ఎం విధులు నిర్వహిస్తోంది. టీకాలు వేస్తున్న సందర్భంలో అర్చన ఫోన్లో మాట్లాడుతోంది. ఆ విధంగా ఫోన్లో మాట్లాడుతూనే ఆమెకు ఒకసారి టీకా వేసింది. అనంతరం ఆ ఫోన్లోనే మునిగి మరొకసారి కూడా వ్యాక్సిన్ వేసింది. దీంతో అర్చన తీరుపై కమలేశ్‌కుమారికి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకేసారి రెండు టీకాలు వేయడంపై నిలదీసింది. అయితే అర్చన తప్పు చేసిందే గాక ఆమెనే దబాయించి తిట్టి పోసింది. వెంటనే ఈ విషయాన్ని కమలేశ్ కుమారి తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రెండు టీకాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై వైద్య అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కలెక్టర్, వైద్య ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. విధుల్లో నిర్లక్క్ష్యం వహించిన అర్చనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఒకేసారి రెండు టీకాలు ఇవ్వడంతో తనకేమన్నా అవుతుందేమోనని కమలేశ్ కుమారి ఆందోళన చెందుతున్నారు. -
ఓటేస్తే దోసె, కాఫీ ఉచితం!
సాక్షి, బెంగళూరు: ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి బెంగళూరులోని ఓ హోటల్ భిన్నమైన ఆఫర్ ఇచ్చింది. తొలిసారి ఓటు వేసేవారికి దోసె, మిగతా వారికి ఫిల్టర్ కాఫీ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణరాజ్ ఈ వినూత్న ఆలోచన చేశారు. దీంతో ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు ఉన్న వేళ్లను చూపించి ప్రజలు ఉచితంగా దోసె, కాఫీలను ఆరగించారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు వీలైనంత త్వరగా ఓటు హక్కు వినియోగించాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. -
మనసు దోసేశాడు!
షూటింగ్ స్పాట్లో దర్శకుడు చెప్పినట్టు నటించే సూర్య.. షూటింగులకు సెలవు రోజైన ఆదివారం ఇంట్లో భార్య జ్యోతిక చెప్పినట్టు చేశారు. సినిమాలో నటిస్తారు కానీ, ఇంట్లో నటించలేదు. తన ప్రేమను వ్యక్తం చేశారు. శ్రీమతి దర్శకత్వ పర్యవేక్షణలో గరిటె తిప్పారు సూర్య. కిచెన్‌లోకి వెళ్లి శ్రీమతికి ఓ దోసేసి.. ప్రేమగా ఆమె మనసు దోచేశారు. ఇంతకీ, సడన్‌గా సూర్య ఎందుకు దోసెలు వేశారు అనే సందేహం వచ్చిందా? అసలు విషయం ఏంటంటే... ఇటీవల జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మగళిర్ మట్టుమ్’ ట్రైలర్ విడుదలైంది. అందులో ఇంట్లో అందరి కోసం లెక్కకు మించిన దోసెలు వేసే అమ్మ లేదా శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా? అనే పాయింట్ లేవదీశారు. అంతే... ‘ప్రేమతో మీ ఇంట్లో మహిళలకు ఓ దోసె వేయండి’ అంటూ దోసె ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. ఐస్ బకెట్ తరహాలో అన్నమాట. ఒకరు దోసెలు వేసిన తర్వాత స్నేహితులకు ఛాలెంజ్ విసురుతారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను దోసె వేసిన తర్వాత హీరో మాధవన్, దర్శకుడు వెంకట్ ప్రభు, సంగీత దర్శకులు హ్యారీస్ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్‌లకు సూర్య సవాల్ విసిరారు. ‘సింగం సార్... దోసె రౌండ్‌గా లేకున్నా ఓకేనా? లేదంటే మా అమ్మ దగ్గర నేర్చుకుంటా’ అని దేవిశ్రీ రిప్లై ఇచ్చారు. -
మరణించాకా.. మందులిచ్చారు
• ముదిగొండ పీహెచ్సీ సిబ్బంది నిర్వాకం • సకాలంలో బాధితులకు అందని డోస్‌లు • కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ • మృత్యువాత పడుతున్న టీబీ వ్యాధిగ్రస్తులు ముదిగొండ : ముదిగొండ మండల కేంద్రానికి చెందిన టీబీ వ్యాధిగ్రస్తుడు తుపాకుల చిరంజీవి గత ఏడాది అక్టోబర్ 12న మృతి చెందాడు. మృతి చెందిన రోజు నుంచి అదే నెలలో 17వ తారీకు వరకు ఆయనకు మందులు పంపిణీ చేసినట్లు స్థానిక పీహెచ్సీ రికార్డులో నమోదు చేశారు. గుర్తించిన ప్రాథమిక ఆరోగ్యవైద్యాధికారిణి కార్డుపై సంతకం చేయలేదు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. మండలంలోని ముదిగొండ, పెద్దమండవ, మాదాపురం, చిరుమర్రి, పమ్మి గ్రామాల్లో టీబీ వ్యాధి గ్రస్తులు ఇటీవల ఐదుగురు మృతి చెందారు. సకాలంలో మందులు ఇవ్వకపోవడం వల్లే వారు మృతి చెందారని పలువురు ఆరోపిస్తున్నారు. విడతల వారీగా అందని మందులు ముదిగొండ మండలంలో ఏ గ్రామంలో చూసినా పదుల సంఖ్యలో టీబీ వ్యాధి గ్రస్తులున్నారు. ఈ ఏడాది కేవలం ఇప్పటి వరకు 75 మందినే గుర్తించి వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు రికార్డులున్నాయి. వారికి కూడా విడతల వారీగా డోస్‌లు అందడంలేదు. బయట కొనలేకపోవడంతో వ్యాధి ముదిరి మృత్యవాత పడుతున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది. బాధితులకు ప్రత్యేకంగా కిట్లు ఏర్పాటు చేసి మందుల వాడకాన్ని అందులో నమోదు చేస్తారు. ఒకవేళ బాధితుడు మృతి చెందితే ఆ కిట్‌ను డీఎంహెచ్ఓ ఆఫీస్‌కు పంపాలి. పీహెచ్సీ పర్యవేక్షణలో ఇదంత జరుగుతుంది. కానీ ముదిగొండ పీహెచ్సీ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి కూడా మందులు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి, ఆ మందులను అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ మందులు ఖరీదైనవి. మార్కెట్లో అంత సులభంగా దొరకవు. కేంద్ర ప్రభుత్వం వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఇస్తున్న మందులను పీహెచ్సీ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. మృతి చెందినవారి కిట్లను తిరిగి డీఎంహెచ్ఓ ఆఫీస్‌కు పంపడం లేదు. మెరుగుపడని పరిస్థితి కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో బాధితుల పరిస్థితి మెరుగుపడడం లేదు. డోస్‌లు పడకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. టీబీ వ్యాధి సోకిన వారికి పరీక్షలు చేయించి వ్యాధిని బట్టి విడతల వారీగా మందులు పంపిణీ చేయాలి. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పీహెచ్సీ స్థాయిలో అమలు కావడం లేదు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తాం సిబ్బంది పని తీరుపై వారి రూట్లలో మందులు పంపిణీ కార్డులు పరిశీలించాం. సమాచారం పూర్తిగా లేదు. మృతి చెందిన తరువాత కూడా ఐదు రోజులు మందులు పంపిణీ చేసినట్లు రికార్డులో నమోదు చేశారు. ఆ రికార్డుపై నేను సంతకం చేయలేదు. పరిశీలించి డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ ఇందిర, ప్రాథమిక ఆరోగ్యవైద్యాధికారిణి -
344 ఔషధాలపై ఆరోగ్యశాఖ నిషేధం!
దేశవ్యాప్తంగా చలామణి అవుతున్న 344 కాంబినేషన్ ఔషధాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. వీటిలో ముఖ్యంగా కోరెక్స్, ఫెన్సిడిల్ వంటి దగ్గు మందుల వాడకంతో అనేక నష్టాలు కలుగుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాంబినేషన్ ఔషధాలు మెదడుకు హాని చేస్తుండటమే నిషేధానికి ప్రముఖ కారణంగా తెలుస్తోంది. ఆరోగ్యశాఖ నిషేధం విధించిన 344 డ్రగ్స్ పై గతంలోనే ప్రతిపాదనలు తెచ్చింది. అయితే అప్పట్నుంచీ పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఆమోదించారు. ప్రముఖ సైంటిస్టుల పరిశోధనల్లో ఆయా ఔషధాలు హాని కలిగించేవిగా నిర్థారించారని.. దీంతో వెంటనే వాటిపై నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిషేధించిన ఔషధాలను తయారుచేస్తున్న 344 పైగా కంపెనీలకు షోకాజ్ నోటీసులను కూడ జారీ చేసింది. నిపుణుల సలహాల మేరకు తదితర సమాచారాన్ని అందిచనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధం అనేక పరీక్షల అనంతరం అమల్లోకి తెచ్చామని తెలిపారు. కాంబినేషన్ డ్రగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో ఉత్పత్తిచేసి మార్కెట్లో ప్రవేశ పెడుతున్న కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం 2014 లో దృష్టి సారించింది. సుమారు ఆరువేల సమ్మేళనాలను సమీక్షించేందుకు అప్పట్లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నిర్థారణ మేరకు ఆయా ఔషధాలపై ప్రస్తుతం నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. నిపుణుల కమిటి సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం... ఆయా ఔషధాల ఉత్పత్తి, అమ్మకాలతోపాటు పంపిణీపైనా నిషేధం విధించింది. కాంబినేషన్ డ్రగ్స్ తో దేశ ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తాజా నోటిఫికేషన్లో వెల్లడించింది. ముఖ్యంగా మార్కెట్లో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న క్లోఫెనిరామిన్ మలీట్, కొడైన్ లు కలిగిన కోరెక్స్ దగ్గుమందు బ్రాండ్ ను వెంటనే బ్యాన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనలకు స్పందించిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ ఫిజర్.. తమ ఉత్పత్తుల్లోని కోరెక్స్ పంపిణీతో పాటు ఉత్పత్తిని నిలిపివేసినట్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు తెలిపింది.