త్రివర్ణ రంగులతో కాంతులీనుతున్న రాయలవారి కోటలోని రాణిమహల్
సాక్షి, చంద్రగిరి (చిత్తూరు జిల్లా)/గార (శ్రీకాకుళం జిల్లా): చిత్తూరు జిల్లాలో చారిత్మ్రక చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయల కోటలోని రాణి మహల్, శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలి హుండం బౌద్ధ స్థూపాల్లోని కాల చక్రం (అశోకచక్రం)లు గురువారం రాత్రి త్రివర్ణ శోభను సంతరించుకున్నాయి. గురువారం నాటికి దేశ వ్యాప్తంగా 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పురావస్తు కట్టడాల వద్ద ప్రత్యేక కార్య క్రమాలను చేపట్టింది.
మొత్తం 100 పురావస్తు కట్టడాల్లో ఈ వేడుకలను నిర్వహించగా, రాష్ట్రంలో ఐదు చోట్ల ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు శాలిహుండం బౌద్ధ స్థూపాల్లోశని కాలచక్రం త్రివర్ణ పతాక కాంతులతో కళకళలాడింది. అలాగే, చంద్రగిరి రాయలవారి కోట రాణిమ హల్‌పై త్రివర్ణ పతాక వెలు గులు రెప రెపలాడాయి. సుదీర్ఘ కాలం తర్వాత లైటింగ్ షో నిర్వహిం చడం తో కోట సందర్శకులతో కిటకి టలా డింది.
Comments
Please login to add a commentAdd a comment