srikakulam town
-
ఆటో నుంచి రూ.500 నోట్ల వర్షం
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరాయి. రోడ్డు మీద జలజలా రాలిపడ్డాయి. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మడపాం టోల్గేట్ వద్ద ఒక ఆటోలో నుంచి రూ.500 నోట్లు కిందకు పడ్డాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది ఆటోడ్రైవర్‌ను కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో టోల్గేట్ సిబ్బంది రోడ్డుపై పడిన నోట్లను తీసుకున్నారు. పోలీసులకు విషయం తెలియడంతో నరసన్నపేట ఎస్ఐ సింహాచలం టోల్గేట్ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వస్తున్న పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. టోల్గేట్ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది. ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఒక్క టోల్‌గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం తహసీల్దార్ కోర్టుకు పంపుతామని, ఎవరైనా క్లెయిమ్ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఉత్తరాంధ్ర చిన్నారులకు బాల పురస్కారాలు
శ్రీకాకుళం (పాత బస్టాండ్)/దొండపర్తి (విశాఖ దక్షిణ)/న్యూఢిల్లీ/: ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు చిన్నారులు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’లను అందుకున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో మాట్లాడిన ప్రధాని మోదీ, అనంతరం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ పురస్కారాన్ని అందుకుంది. హిమప్రియకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. 2018లో జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో ధైర్యసాహసాలు చూపినందుకు హిమప్రియను ఈ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ.. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సిక్కోలు బాలికకు పురస్కారం దక్కడం గర్వకారణమన్నారు. పురస్కార గ్రహీత హిమప్రియ మాట్లాడుతూ సైనిక కుటుంబంలో జన్మించినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తన తండ్రే తనకు ఆదర్శమని తెలిపింది. నాడు ఏం జరిగిందంటే.. హిమప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీ ఉద్యోగి. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం జమ్మూ కశ్మీర్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌లో నివాసం ఉండేది. 2018 ఫిబ్రవరి 10వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌పై వేకువజామున ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో హిమప్రియ తల్లితో పాటు ఇంట్లోనే ఉంది. తండ్రి 60 కిలోమీటర్ల దూరంలో విధి నిర్వహణలో ఉన్నారు. నాలుగైదు గంటలపాటు ఉగ్రవాదులు తూటాలు కురిపిస్తూ ఉండగా.. హిమప్రియ సాహసం చేసి ఉగ్రవాదులతో పోరాడింది. దాడిలో ఆమెతోపాటు ఆమె తల్లికి కూడా గాయమైనా.. వెరవకుండా ఉగ్రమూకలకు ఎదురెళ్లి క్వార్టర్స్‌లోని మరికొంత మందిని కాపాడింది. అమేయ, వీర్‌కాశ్యప్‌లకు పురస్కారాల ప్రదానం విశాఖకు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి అమేయ, నేవల్ స్కూల్ విద్యార్థి వీర్‌కాశ్యప్ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2021’ అందుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున సోమవారం వీటిని అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అమేయను ప్రధాని మోదీ ప్రశంసించారు. వీరంతా ఢిల్లీలోని రాజ్‌పథ్‌పై జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు. -
దేశ వ్యాప్తంగా 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల వేడుక
సాక్షి, చంద్రగిరి (చిత్తూరు జిల్లా)/గార (శ్రీకాకుళం జిల్లా): చిత్తూరు జిల్లాలో చారిత్మ్రక చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయల కోటలోని రాణి మహల్, శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలి హుండం బౌద్ధ స్థూపాల్లోని కాల చక్రం (అశోకచక్రం)లు గురువారం రాత్రి త్రివర్ణ శోభను సంతరించుకున్నాయి. గురువారం నాటికి దేశ వ్యాప్తంగా 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పురావస్తు కట్టడాల వద్ద ప్రత్యేక కార్య క్రమాలను చేపట్టింది. మొత్తం 100 పురావస్తు కట్టడాల్లో ఈ వేడుకలను నిర్వహించగా, రాష్ట్రంలో ఐదు చోట్ల ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు శాలిహుండం బౌద్ధ స్థూపాల్లోశని కాలచక్రం త్రివర్ణ పతాక కాంతులతో కళకళలాడింది. అలాగే, చంద్రగిరి రాయలవారి కోట రాణిమ హల్‌పై త్రివర్ణ పతాక వెలు గులు రెప రెపలాడాయి. సుదీర్ఘ కాలం తర్వాత లైటింగ్ షో నిర్వహిం చడం తో కోట సందర్శకులతో కిటకి టలా డింది. -
కంటైన్మెంట్ జోన్‌గా శ్రీకాకుళం నగరం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు. అలాగే శ్రీకాకుళం నగరం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మంగళవారం నుంచే ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. జిల్లాలోని మొత్తం కేసుల్లో ముప్పై శాతం కేసులు శ్రీకాకుళం నగరంలోనే నమోదు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న 14 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకునే దిశలో చర్యలు చేపడుతోంది. తొలి విడతలో కూడా పోలీసు శాఖ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసింది. గడిచిన రెండు రోజులుగా రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కరోనా తీవ్రత ఉన్న నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలపై దృష్టి సారించి రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. జిల్లా ఎస్పీ నుంచి ఏఎస్పీలు, డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ గస్తీని పరిశీలిస్తున్నారు. మాసు్కలు లేకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. మాసు్క లు లేకుండా ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం రాత్రి, ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ నగరంలోని ప్రధాన కూడళ్లలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం నుంచి మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. చదవండి: అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు! -
కంటైన్మెంట్ జోన్‌గా శ్రీకాకుళం నగరం
-
శ్రీకాకుళం చేరుకున్న వలస కార్మికులు, వారందరినీ...
సాక్షి, శ్రీకాకుళం: చెన్నై నుంచి బయలుదేరిన వలస కార్మికుల శ్రామిక్ రైలు శ్రీకాకుళం చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో చెన్నైలో చిక్కుకుపోయిన 889 మంది జిల్లా వాసులు ఈ రైలు ద్వారా శ్రీకాకుళానికి చేరుకున్నారు. వీరిలో 685 మంది మత్స్యకారులు ఉండగా 204 మంది వలస కూలీలు ఉన్నారు. వలస కూలీలందరిని అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. చెన్నై నుంచి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా 30 బస్సులను ఏర్పాటు చేశారు. (కర్నూలు ప్రజలకు భారీ ఊరట) మే 1 నుంచి వలస కూలీలను వారి వారి స్వగ్రామలకు తరలించడానికి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వందేమాతరం మిషన్ ద్వారా విదేశాల్లో ఉన్న వారిని కూడా భారతదేశానికి తీసుకువస్తోన్నారు. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య 70,756 నమోదు కాగా 22, 454 మంది కోలుకున్నారు. ఆంధ్రపదేశ్‌లో ఇప్పటి వరకు 2018 కేసులు నమోదు కాగా, 975 మంది కోలుకున్నారు. (ఆన్లైన్లో బుకింగ్‌కు సిద్ధం) -
గాంధీ అడుగుపెట్టిన గడ్డ
సాక్షి, ఆముదాలవలస : అహింసా మార్గం లో ఉద్యమాలు చేసి తెల్లదొరలను ఎదురించి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు గాంధీ. అంతటి గొప్ప వ్యక్తి ఆమదాలవలస మండలం దూసి గ్రామం సమీపంలో గల దూసి రైల్వేస్టేషన్లో అడుగుపెట్టి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రజలను ఉద్యమాల్లో భాగస్వామ్యం చేసి రైలులో ప్రయాణించారు. దీనిలో భాగంగా దూసి రైల్వేస్టేషన్లో దిగి సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించారు. అలనాటి గుర్తులు ఇంకనూ ఆ స్టేషన్లో ఉన్నాయి. బ్రిటీష్ పరిపాలను ఏ విధంగా తిప్పికొట్టాలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్యమం తీరును వివరించారు. అనంతరం రైల్వేస్టేషన్ ఆవరణలోనే గాంధీజీ మర్రి మొక్కను నాటారు. అప్పుడు నాటిన మొక్క వృక్షమై రెండు ఎకరాల స్థలంలో ఆవరించి ఉంది. 77 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వృక్షం గాంధీజీ నాటినట్లు స్థానికులు చెబుతున్నారు. దూసి రైల్వేస్టేషన్లో గాంధీజీ అడుగుపెట్టినందున అప్పట్లో గాంధీ రైల్వేస్టేషన్‌గా పేరు పెట్టాలని అనుకున్నారు. ఏళ్లు గడిచినా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం!
నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా... నది ఏదైనా మాఫియా దోపిడీ ఇసుకే! టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక విధానం’ సామాన్యుల కంటే పచ్చ తమ్ముళ్లకే ఎక్కువ ఉపయోగపడింది. ఇదే ముసుగులో ఎక్కడికక్కడ ఇసుక ర్యాంపులను తెరిచి మాఫియా ఇసుకను అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటించేసింది. రూ.కోట్లలో కాసులను కళ్ల చూసిన అనుభవంతో ఇప్పుడు ఎంతకైనా తెగిస్తోంది. ఒకవైపు వారం రోజులుగా అధికార యంత్రాంగం దాడులు చేస్తున్నా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడట్లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదుల జిల్లాగా పేరొందిన సిక్కోలు ఇసుకకు విశాఖపట్నం, విజయనగరం మా ర్కెట్లలో మంచి డిమాండు ఉంది. కానీ ఇప్పుడు జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక ర్యాంపులకు అనుమతులు లేవు. విశాఖలో గృహనిర్మాణ అవసరాలతోపాటు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల కోసం కొన్ని ఇసుక ర్యాంపులకు జిల్లా కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్ కమిటీ నుంచి అనుమతులు ఇచ్చేవారు. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయిన్లతో ఛిద్రం చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అందులో లొసుగులను ఆసరాగా చేసుకొని స్థానికంగా కొంతమంది టీడీపీ నాయకుల అండదండలతో మాఫియా నదులను చెరబట్టింది. నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఇసుక డిమాండును బట్టి రీచ్‌ల వద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది. విశాఖ, విజయనగరం మార్కెట్లకు పెద్ద పెద్ద లారీల్లో తరలించి రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకూ విక్రయిస్తోంది. రూ.కోట్లకు పడగలెత్తిన ఇసుకాసురులు ఈ అక్రమ రవాణాను వదులుకోలేకపోతున్నారు. అధికార యంత్రాంగం దాడులు చేస్తున్నా ఆగట్లేదు. నదుల వెంబడి పగలంతా పోగులు వేయించి, రాత్రి అయ్యేసరికి పొక్లెయిన్లతో లారీలకు లోడు చేయిస్తున్నారు. ఏదెలా ఉన్నా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ఇసుక అక్రమ వ్యాపారంపై జిల్లా ఉన్నతాధికారులు కన్నేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇసుకాసురుల ఆగడాలకు ఆనవాళ్లు... అక్రమ ఇసుక వ్యాపారానికి ఆమదాలవలస మండలం ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. నాగావళి పరివాహక ప్రాంతంలో ఎక్కడ చూసినా అక్రమ ఇసుక ర్యాంపులే దర్శనమిస్తున్నాయి. మండలంలో ఇసుక ర్యాంపులు గుర్తించటంలో అ«ధికారుల కంటే అక్రమ ఇసుక వ్యాపారులు ఒకడుగు ముందున్నారనే చెప్పాలి. మండలం పరిధిలో దూసిపేట, కొత్తవలస, గోపీనగర్, నిమ్మతొర్లాడ, తొగరాం, జీకేవలస, కొరపాం, ముద్దాడపేట, చెవ్వాకులపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్రమ ఇసుక ర్యాంపుల నుంచి నిత్యం ట్రాక్టర్లు ద్వారా అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగుతోంది. ప్రధానంగా మండలంలోని గోపీనగర్, కొత్తవలస, పాతూరు, నిమ్మతొర్లాడ, చిట్టివలస తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటుచేసి కొందరు ఇసుక వ్యాపారులు లారీలు ద్వారా విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పొందూరు మండలంలో టీడీపీ నాయకుల ఇసుక దందా కొనసాగుతోంది. వందల కొద్దీ ట్రాక్టర్లలో నది నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు. గండ్రేడు, బెలమాం గ్రామాల గుండా ప్రవహిస్తున్న నాగావళి నదిలో ఇసుకను పొందూరు మీదుగా రాజాం, చిలకపాలెం వైపు రవాణా చేస్తున్నారు. కింతలి మీదుగా శ్రీకాకుళం, నరసన్నపేట వైపు తరలిస్తున్నారు. అధికారులకు మాత్రం పట్టనట్టే ఉన్నారు. తుంగపేట, నర్సాపురం సమీపంలో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇసుకను అధిక ధరకు విక్రయిస్తున్నారు. సరుబుజ్జిలి మండలంలోని పెద్దసవలాపురం, యరగాం గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బాహుదా నదీ పరివాహక ప్రాంతమైన బొడ్డబడ, కొళిగాం, పాయితారీ, అరకబద్ర, హరిపురం, బిర్లంగి, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం, ఈదుపురం, కేశుపురం, డొంకూరు, లక్ష్మీపురం ప్రాంతాల్లో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఇసుకాసురులు యధేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం పరిధిలో నాగావళి నది నుంచి ఇసుక తరలింపు యధేచ్చగా కొనసాగుతోంది. పాలకొండ మండల పరిధిలో అన్నవరం, అంపిలి, గోపాలపురం, మంగళాపురం గ్రామాల మీదుగా, వీరఘట్టం మండలం తలవరం, పనసనందివాడ, ఎంవీ పురం, బిటివాడ, పాలమెట్ట, విక్రామ్పురం, కడకెల్ల గ్రామాలు నాగావళి నదిని ఆనుకుని ఉండటంతో ఈ ప్రాంతాల మీదుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్లు అడ్డూఅదుపు లేకుండా సంచరిస్తున్నాయి. ఇటీవల వీరఘట్టం మండలంలోని తలవరం సమీపంలో ఓ యువకుడు ఇసుక ట్రాక్టర్ కిందపడి దుర్మరణం పాలయ్యాడు. మరో యువతి తీవ్ర గాయాలపాలైయ్యింది. అలాగే బిటివాడ అక్రమ ర్యాంపులో ఇసుక ఎత్తుతున్న కూలీ ప్రమాదవశాత్తూ మరణించాడు. ఇసుక అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం తయారైంది. రేగిడి, తునివాడ, బొడ్డవలస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుకపోగులు వేస్తున్నారు. లారీలకు ఎత్తి రాజాం మీదుగా ఇతర ప్రాంతాలకు పట్టపగలే తరలిస్తున్నారు. వంగర మండలంలో సువర్ణముఖి, వేగావతి నదులతో పాటు నాగావళి నదీతీర ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా ఇప్పుడూ జరుగుతోంది. సంతకవిటి మండలం మేడమర్తి, తమరాం, పోడలి సమీప ప్రాంతాల వద్ద నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ నదిలో ట్రాక్టర్లతో ఇసుకను తవ్వి పలు గ్రామాల వద్ద ప్రధాన రహదారి పక్కనే నిల్వగా ఉంచుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ ఇసుకను విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు పంచాయతీల పరిధిలో నాగావళి నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. తమ్మినాయుడుపేట, పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట, బింగిపేట పాతపొన్నాడ వంటి రీచ్‌లపై 24 గంటలు పర్యవేక్షణ బృందాల నిఘా ఉంది. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగటం లేదు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించి జాతీయ రహదారికి ఆనుకొని చిలకపాలెం, అల్లినగరం, ఎస్ఎస్ఆర్ పురం వంటి ప్రాంతాల్లో పోగులు వేస్తున్నారు. పోగులు వేసి రాత్రి వేళల్లో లారీల్లో విశాఖపట్నం ఇసుక తరలిస్తున్నారు. సజావుగా ఇసుక తరలిపోతోంది. నిఘా బృందాలు సైతం మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నరసన్నపేట నియోజకవర్గం పరిధిలోని జలుమూరు, పోలాకి, నరసన్నపేట నదీతీర గ్రామాల్లో ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోంది. ప్రధానంగా నరసన్నపేట రూరల్ మండలం కోమర్తి, లుకలాం, ముద్దాడపేట, గెడ్డవానిపేట రేవుల నుంచి ట్రాక్టర్లతో రోడ్డు పక్కన పోగులు వేసి రాత్రి వేళల్లో విశాఖపట్నం తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మండపాం, బుచ్చిపేట, చేనులవలస రేవుల నుంచి లారీలతో తరలిస్తున్నారు. అలాగే జలుమూరు మండలం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అనుమతులు పేరిట కొంత ఇసుక రోడ్డుకు వెళ్లగా రాత్రివేళల్లో మాత్రం విశాఖకు టీడీపీ నాయకులు తరలిస్తున్నారు. పోలాకి మండలంలోని మబగాం, వనిత మండలం గ్రామాల్లో అధికార టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని భైరి, కరజాడ, రోణంకి పరిసర ప్రాంతాల్లో ఇటీవల సీజ్చేసిన ఇసుకను స్వా«ధీనం చేసుకునేందుకు బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్ లిమిటెక్ సంస్థ ముందుకొచ్చింది. ఇటీవలే పొన్నాంలో అధికారిక ర్యాంపు ప్రారంభించినప్పటికీ దాని అనుమతులు మించి భారీ యంత్రాలతో ఇసుకను తోడెయ్యడంతో ఆయా గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదులు మేరకు వెంటనే ఆ ర్యాంప్‌ను బంద్ చేయించారు. సీజ్ చేసిన ఇసుకను కేవలం ప్రభుత్వ పనులకంటూ జిల్లా యంత్రాంగానికి లేఖలు రాసినప్పటికీ తరువాత విశాఖ అవసరాలు పేరిట ఒక్కో లోడు రూ.12 వేలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలంలో వంశధార నది టీడీపీ నేతలకు కామధేనువుగా మారింది. కుంటిభద్రలో రైతులు పంట పొలాల్లో వేసిన ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకువచ్చిన ఓ టీడీపీ నేత పొలాల్లో ఇసుక తవ్వకాలు చేయకుండా వంశధార నదిలో అక్రమంగా తవ్వకాలు చేస్తూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నాడు. పొన్నుటూరులో ఆలయం నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహించి లబ్దిపొందుతున్నారు. పెనుగోటివాడ, వీరనారాయణపురం, మాతల, కుద్దిగాం, నివగాంతో పాటు పలు గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. -
అరకు పార్లమెంట్‌కు ఐదు నామినేషన్లు
సాక్షి, పాడేరు: అరకు పార్లమెంట్ స్థానానికి 5వ రోజు శుక్రవారం ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి డి.కె బాలాజీకి అందజేశారు. టీడీపీ అభ్యర్థి వైరిచర్ల కిశోర్ చంద్రసూర్యనారాయణ దేవ్ నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కోసూరి కాశీవిశ్వనాధ వీరవెంకట సత్యనారాయణ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని, జనసేన అభ్యర్థి వంపూరు గంగులయ్య ఒక సెట్ నామినేషన్‌ను, జనజాగృతి పార్టీ అభ్యర్థి సోమెల సుబ్రహ్మణ్యం ఒక నామినేషన్, ఇండిపెండెంట్‌గా ఒక నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
ఉద్యోగాల విప్లవం తెస్తాం
ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా డోర్ డెలివరీ చేస్తారు. వీళ్లకు ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో గ్రామంలో సేవలందిస్తారు. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వ్యవస్థలను సంస్కరించి రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా తక్షణమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఊరూరా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 10 మంది చొప్పున లక్షా 50 వేల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి నెల నెలా రూ.5000 పారితోషికం ఇస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకే తెచ్చేలా పాలన అందిస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 316వ రోజు శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తెస్తామన్నారు. ఈ సభలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగాల భర్తీకి ఏటా నోటిఫికేషన్లు ‘‘పిల్లల కోసం ఉద్యోగాల విప్లవం మనం తీసుకురాబోతున్నాం. రాష్ట్రం విడిపోయే నాటికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం మన పిల్లలు ఎదురు చూస్తూ.. ప్రిపేర్ కావాలని కోచింగ్ సెంటర్లకు వెళుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఈ పాలనలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు.. జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే జాబు రావాలంటే బాబు పోవాలి అనే పరిస్థితి. మనం అధికారంలోకి రాగానే చేయబోయే మొట్టమొదటి పని ఏమిటంటే.. నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న లక్షా 42 వేల ఉద్యోగాలతో పాటు పదవీ విరమణ ద్వారా ఏర్పడ్డ ఖాళీలు అన్నీ కలుపుకుంటే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలుంటాయి. ఈ రెండు లక్షలు ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇస్తామని ప్రతి ఒక్కరికీ మాట ఇస్తున్నా. ప్రతి సంవత్సరం పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఒక డేట్ ఇచ్చినట్లు అదే మాదిరిగా ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి ఒక తేదీ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తాం. లంచమనేదే లేకుండా చేస్తాం.. ఇవాళ గ్రామాల్లో ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిందే. జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి మాకు పెన్షన్ కావాలంటే వాళ్లు అడిగే మొదటి ప్రశ్న. మీరు ఏ పార్టీ వారు అని. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. గ్రామ సచివాలయాన్ని తీసుకు వస్తాను. ప్రతి గ్రామంలో సేవాగుణం వున్న 10 మంది పిల్లలను అదే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగులుగా నియమిస్తాం. గ్రామ సచివాలయాన్ని తెరిచిన తర్వాత మీకు పెన్షన్ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, వైఎస్సార్ చేయూత కావాలన్నా, ఇళ్లు కవాలన్నా, ఎటువంటి ప్రభుత్వ లబ్ధి కావాలన్నా దరఖాస్తు చేసిన 72 గంటల్లో శాంక్షన్ అయ్యేటట్టు చేస్తాం. మధ్యలో ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాదు. ఏ జన్మభూమి కమిటీ సభ్యుడు ఉండడు. ఏ ఎమ్మెల్యే ఉండడు, ఏ ఎమ్మార్వో ఉండడు, ఏ కలెక్టర్ ఉండడని హామీ ఇస్తున్నా. లంచమనేదే లేకుండా చేస్తాం. ప్రతి గ్రామంలో పది మంది పిల్లలను గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగులుగా నియమించడం ద్వారా లక్షా 50 వేల ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలొచ్చేలా చట్టం ఇవాళ మనం చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా సరిపోని పరిస్థితి. అందుకే ఏపీపీఎస్సీ, గ్రామ సెక్రటేరియట్ ద్వారా కూడా అందరికీ మేలు చేయలేకపోవచ్చు. అందుకే ప్రతి గ్రామంలో పెట్టే గ్రామ సచివలయం సరిగ్గా పని చేసేందుకు గ్రామ సెక్రటేరియట్ ద్వారా ప్రతి ఇంటికి మేలు జరిగేలా చూడటం కోసం అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని వలంటీరుగా నియమించి రూ.5000 జీతం ఇస్తాము. ఉద్యోగం వచ్చే వరకు అదే గ్రామంలో ఉండి సేవ చేసే ఆలోచన ఉన్న వారికి అవకాశం ఇస్తాం. ఇలా వలంటీర్లుగా నియమించే వ్యక్తి 50 ఇళ్లను పర్యవేక్షిస్తూ ప్రతి ఇంటికీ మంచి జరిగేలా చూస్తాడు. గ్రామ సెక్రటేరియట్‌కు – ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం మీరు ఎక్కడికీ పోకుండా నేరుగా మీ ఇంటికే వచ్చేలా చూస్తానని చెబుతున్నా. ఎంత చేసినా ఉద్యోగాల సమస్య తీరదని నాకు తెలుసు. ఇంకో అడుగు ముందుకేస్తాము. ఎక్కడ చూసినా పరిశ్రమలు రావాలని, అవి వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆరాట పడతాం. తపిస్తాం. కానీ పరిస్థితి ఏమిటో తెలుసా? పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మాత్రం మన లోకల్ పిల్లలకు ఇవ్వరు. మన పక్కనే పరిశ్రమలు ఉంటాయి. మన ఇళ్లల్లో ఇంజనీర్లు ఉంటారు. ఉద్యోగాలు మాత్రం ఏ కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల వారికి ఇస్తారు. మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఉండవు. ఈ పరిస్థితిని కూడా పూర్తిగా మారుస్తాం. ఉన్న పరిశ్రమలు, ఏర్పాటు చేయబోయే వాటన్నిటిలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేసేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక చట్టాన్ని తీసుకువస్తాం. ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకువస్తామో అప్పుడే మన పిల్లలు పరిశ్రమలు రావాలని, వాటితో ఉద్యోగాలు వస్తాయని ఆశపడే పరిస్థితి వస్తుంది. ఎవరినీ నమ్మొద్దు.. మనమే బుద్ధి చెబుదాం ఉద్యోగాలు రావడం కోసం ఇన్ని చేసినా కూడా బహుశా అందరినీ సంతృప్తిపరిచే అవకాశం ఉండదేమో. అందుకే ఇంకో అడుగు ముందుకు వేస్తున్నాం. ప్రతి చదువుకునే పిల్లాడికి మరో హామీ ఇస్తున్నా. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఎవరినీ నమ్మొద్దు. బిజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, జనసేనను నమ్మొద్దు. వీళ్లంతా కూడా దగ్గరుండి గత ఎన్నికల్లో మనల్ని మోసం చేసిన వారే. ఒకరు కత్తి ఇస్తే మరొకరు చేతులు, కాళ్లు పట్టుకుంటే ఇంకొకరు కత్తితో వెన్నులో పొడిచే కార్యక్రమం చేశారు. గత ఎన్నికల్లో బిజేపీ ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తానని చెబితే చంద్రబాబు దానికి వత్తాసు పలుకుతూ పది కాదు, 15 ఏళ్లు తీసుకువస్తానని మాట ఇచ్చాడు. ఇదే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి వీరిద్దరికీ పూచీకత్తు నేను.. వీళ్లిద్దరితో నేను పని చేయిస్తానని చెప్పి ఓటు వేయండన్నాడు. నాలుగున్నరేళ్లు అయిపోయింది. ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టకపోయి ఉండింటే అసలు ఈ పరిస్థితి మనకు వచ్చి ఉండేదే కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామనే అంశాన్ని నిజంగా చట్టంలో పెట్టి ఉంటే మనం కోర్టు దాకా వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుని ఉండేవాళ్లం. అలా చేయనందునే ఇవాళ మన బతుకులు ఇలా తగలబడ్డాయి. ఇప్పుడు మరోసారి మనల్ని మోసం చేయడానికి ఈ ఎన్నికల్లో అది చేస్తాం.. ఇది చేస్తామని మీ ముందుకు వస్తారు. వీరిని నమ్మొద్దు. ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాల వెల్లువ ప్రత్యేక హోదా మనకు అవసరం. హోదాతోనే పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా ఉంటే ఆదాయపు పన్ను, జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. అందుకే కొత్త పరిశ్రమలు, కొత్త హోటళ్లు, ఆస్పత్రులు, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే. దేవుడు ఆశ్వీరదించాలి. మీ అందరి చల్లని దీవెనలు కావాలి. ఆలయానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా రావాలని ఒక టెంకాయ కొట్టండి. మంచి మనసుతో చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం మనం పోరాడదాం. దేవుడి దయ, మీ అందరి మద్దతుతో రేపు ప్రత్యేక హోదా మనం తెచ్చుకోగలిగితే ప్రతి జిల్లా ౖఒక హైదరాబాద్‌లా తయారవుతుంది. వీటన్నింటి వల్ల జరగబోయే కాలంలో చదువుకున్న పిల్లలను కొద్దోగొప్పో సంతృప్తి పరచగలమన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు పరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. తోడుగా నిలవండని అభ్యర్థిస్తున్నా. ఇన్ని సీట్లు గెలిపిస్తే బాబు చేసిందేమీ లేదు గడచిన 35 ఏళ్ల రాజకీయాలు చూస్తే సీట్లు, ఓట్లు తీసుకోవడంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీకే నంబర్ వన్. కానీ మన ఖర్మ ఏమిటంటే అభివృద్ధిలో మాత్రం ఈ జిల్లా అన్నిటి కన్నా అట్టడుగు స్థానంలో ఉంది. ఒకసారి మాత్రం 2004లో జిల్లా ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని గెలిపించారు. ఆ తర్వాత నాన్నగారు చేసిన పనులను చూసి వైఎస్సార్‌పై నమ్మకంతో మళ్లీ 2009లో జిల్లాలో పది స్థానాలుంటే 9 స్థానాలు గెలిపించారు. అప్పటి పాలన గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి ఈ వాళ్టికీ ప్రజలు నా వద్దకు వచ్చి చెబుతున్నారంటే ఆ దివంగత నేతకు కొడుకుగా పుట్టడం పూర్వ జన్మసుకృతమని గర్వంగా చెబుతాను. ఇప్పుడు ఇక్కడి ప్రజలు నావద్దకు వచ్చి చెబుతున్న మాటేమిటంటే, అన్నా.. 2014లో 10 స్థానాల్లో ఏడు స్థానాలు చంద్రబాబుకు ఇచ్చామన్నా.. ఇవి సరిపోవని ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందిన మరో ఎమ్మెల్మేను సంతలో పశువును కొన్నట్టుగా కొన్నాడన్నా.. ఇంతమంది ఎమ్మెల్యేను పక్కన బెట్టుకుని చంద్రబాబు మా జిల్లాకు, మా నియోజకవర్గానికి, మా శ్రీకాకుళానికి ఏం చేశారన్నా.. అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ నాడు వైఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని నా దృష్టికి తీసుకు వచ్చారు. వంశధారను బాబు ఏనాడూ పట్టించుకోలేదు ‘వంశధార ప్రాజెక్టుపై ఒడిశా రాష్ట్రంతో 55 ఏళ్లుగా తీరని వివాదం ఉంటే తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నా.. నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే న్యాయపరమైన చిక్కులను తొలగించి వంశధార ప్రాజెక్టుకు 33 కిలోమీటర్లు కాలువలు తవ్వించి సింగిడి, హీరా తదితర మండలాలకు నీరు తెప్పించారు. 2005లో వంశధార ప్రాజెక్టు స్టేజ్ – 2 పనులకు రూ.930 కోట్లు కేటాయించారు. నాన్నగారు బతికుండగానే రూ.700 కోట్లు వెచ్చించి పనులు పరుగులు తీయించారు. మరో రూ.175 కోట్లు చంద్రబాబు సీఎం కాక ముందే కేటాయించారు. మిగిలిపోయిన పనులను చంద్రబాబు పూర్తి చేయకుండా అవినీతి ప్రాజెక్టుగా మార్చేశారు. మిగిలిన రూ.55 కోట్ల పనులను రూ.476 కోట్లకు అంచనాలు పెంచేసి తన బినామీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీకి దోచిపెడుతున్నారన్నా.. రెండున్నర లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును దోపిడీకి గురయ్యేలా చేసి అన్యాయంగా వ్యవహరిస్తున్నా.. వంశధార వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు నేరేడు వద్ద బ్యారేజీ కట్టుకునేందుకు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా..’ అని స్థానికులు చెబుతున్నారు. మహీంద్రతనయ రిజర్వాయర్ పనులు నాలుగున్నరేళ్లుగా అంగుళం కూడా కదలని పరిస్థితి. ప్రజల కోసం ఏదైనా మొదలుపెడితే మధ్యలో ఆపకూడదని నాన్నగారు ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన కుమారుడిగా నేను చెప్పేదేమిటంటే వంశధార ప్రాజెక్టుకు సంబంధించి నేరుడు వద్ద బ్యారేజీ నిర్మించడంతో పాటు మిగిలిన ప్రాజెక్టులు, బ్యారేజీ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను. అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్సార్ వల్లే ‘మేము ఎందరో ముఖ్యమంత్రులను చూశామన్నా.. కానీ నాన్నగారి మాదిరిగా ఎవరూ కూడా మా జిల్లాను పట్టించుకోలేదు. నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక మా జిల్లాలో రిమ్స్ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఇప్పుడు ఇదే రిమ్స్ పరిస్థితి దారుణంగా ఉందన్నా.. 550 పడకల ఆస్పత్రిలో 240 మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే 150 మంది మాత్రమే పని చేస్తున్నారు. సీటీ స్కాన్ రిపేరులో ఉంది. ఎంఆర్ఐ లేనే లేదు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడితే దిక్కు దివానం లేకుండా ఉందన్నా. హాస్టల్స్‌లో మెడికల్ విద్యార్థులు కిక్కిరిసి ఉన్నారు. ఇవాళ ఈ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించే పరిస్థితి దాపురించింది. 80 శాతం ప్రమాణాలను పాటించడం లేదు. పీజీ కోర్సులకు ఎంసీఐ అనుమతి ఇవ్వని పరిస్థితి. ఏదైనా అడిగితే ప్రభుత్వం ఇవ్వలేం, ఇవ్వం అంటోంది. ఇదే జిల్లాలో నాన్నగారు అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈరోజు దాని పరిస్థితి ఎలా ఉందంటే.. 16 విభాగాల్లో 96 మంది అధ్యాపకులకు గాను 12 మంది మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. పోస్టులు మంజూరు చేయరు. స్కాలర్ షిప్‌లు ఇవ్వరు. వసతులు కల్పించరు. ఇంతత దారుణంగా యూనివర్సిటీని నడుపుతుంటే ఈ జిల్లాపై ప్రేమ ఉందని ఎలా చెప్పగలుగుతారన్నా’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా మా శ్రీకాకుళానికి, జిల్లాకు చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చారన్నా. ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదన్నా అని ప్రజలు చెప్పుకొచ్చారు. ఇవి ఎక్కడైనా కనిపించాయా? శ్రీకాకుళంలో స్మార్ట్ సిటీ ఎక్కడైనా కనిపించిందా? రూ.348 కోట్లు ఇచ్చారా? రూపాయి కూడా ఇవ్వలేదు. శ్రీకాకుళంలో భూగర్భ డ్రైనేజీ అన్నాడు. ఎక్కడైనా అది కనిపించిందా? రింగురోడ్డు అన్నాడు. ఎయిర్‌పోర్టు అన్నాడు. ఫుడ్ పార్కు అన్నాడు. ఇవన్నీ ఎక్కడైనా కనిపించాయా? స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, టూరిజం సర్క్యూట్, నాగావళి, వంశధార కరకట్టల నిర్మాణం, కోడి రామ్మూర్తి స్టేడియం.. ఇవన్నీ కనిపించాయా? పేదల సంక్షేమం కోసం గతంలో రెండెకరాల స్థలాన్ని ఇంతకు ముందే కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్న అధ్వాన్నమైన పరిస్థితి. టీటీడీ కల్యాణ మండపం కోసం వైఎస్సార్ భూమి, నిధులు ఇచ్చారు ఇచ్చారు. నాలుగున్నరేళ్లయినా ఆ కల్యాణ మండపం కట్టలేదు. ఏసీ ఇండోర్ ఆడిటోరియంకు గతంలోనే నిధులు ఇచ్చినప్పటికీ ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. చంద్రబాబు వచ్చాక జిల్లాలో 271 ప్రభుత్వ స్కూళ్లు మూతపడితే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఏడు స్కూళ్లు మూతపడ్డాయి. జిల్లాలో 40 హాస్టళ్లను, శ్రీకాకుళం టౌన్లో ఒక ఎస్సీ హాస్టల్‌ను, ఒక బాలికల హాస్టల్, బందరువాని పేట వద్ద ఒక బీసీ హాస్టల్ మూసేశారు. శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ తీరు అధ్వానం. ఈ ట్రిపుల్ ఐటీ పిల్లలను నూజివీడుకు తీసుకుపోయి అక్కడ చదివించే పరిస్థితి. రెండో సంవత్సరానికి సంబంధించిన వెయ్యి మంది విద్యార్థులను నూజివీడు నుంచి ఇక్కడకు తీసుకువచ్చి మూతపడిన ఇంజనీరింగ్ కాలేజీలో 500 మందిని పెట్టారు. మిగిలిన 500 మందిని గతంలో ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి కట్టిన ట్వంటీ ఫస్ట్ గురుకులంలో పెట్టారు. ఇటువంటి వ్యక్తి (చంద్రబాబు) ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడేనా? శవాలపై చిల్లర ఏరుకునే రకం నాన్నగారి హయాంలో శ్రీకాకుళం, చుట్టుపక్కల అక్షరాలా 11 వేల ఇళ్లు కట్టిస్తే, చంద్రబాబు పాలనలో ఇళ్ల పేరు చెప్పి స్కామ్‌లు చేస్తున్నారన్నా అని ప్రజలు అంటున్నారు. రూ.3 లక్షలు చేసే ఫ్లాట్‌ను రూ.7.80 లక్షలుగా పేదలపై భారం మోపుతున్నారు. ఇందులో లక్షన్నర కేంద్రం, లక్షన్నర రాష్ట్రం ఇస్తోంది. మిగతా రూ.4.80 లక్షల అప్పును పేద వాడు 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3వేలు.. రూ.4 వేలు చొప్పున బ్యాంకులకు కట్టాలి. ఎన్నికల వేళ ఇస్తున్న ఆ ఫ్లాట్లను వద్దనకుండా తీసుకోండి. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక జగన్ అనే నేను అ అప్పును మాఫీ చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా.. హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం 192 ఇళ్లు కడితే పచ్చచొక్కాల వారికి మంజూరు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అసలు లబ్థిదారుల జాబితా కూడా బయట పెట్టడం లేదన్నా అని చెబుతున్నారు. నాలుగేళ్లుగా 189 మంది మత్స్యకారులు చనిపోతే చంద్రబాబు ఇస్తానన్న రూ.5 లక్షల నష్టపరిహారం ఒక్కరికీ ఇవ్వలేదని చెప్పారు. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులు నన్ను కలిశారు. ఈ జిల్లాలో 2.8 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రూ.400 కోట్లు డిపాజిట్లు చేశారు. ఆ అగ్రిగోల్డ్ అయినా సరే ఈ కేశవరెడ్డి అయినా సరే.. వీళ్లందరిపై ఎంక్వైరీ సిఐడీ చేస్తోందట. బాబుగారు తక్కువ రేటుకు ఆస్థులు కొట్టేస్తే ఆ ఆస్థులను మినహాయించేలా దర్యాప్తు సాగుతున్న పరిస్థితి. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎస్ఎమ్పురంలో 103 ఎకరాల్లో వైఎస్సార్ హయాంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్లలో ఈ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. తిత్లీ తుపాను బాధితులను గాలికొదిలేసి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఇప్పటికీ కరెంటు సరఫరాను పునరుద్ధరించ లేదు. ఇదే జిల్లా నుంచి విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావు ఏమీ పట్టించుకోని పరిస్థితి. తుపాను వల్ల రూ.3435 కోట్ల నష్టం జరిగితే అందులో కేవలం 15 శాతం అంటే రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చి, గొప్పగా ఇచ్చినట్లు అర్టీసీ బస్సులపై చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విడ్డూరం. ఈయన తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకుంటున్నట్టుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. బాబు బినామీలదే రాజ్యం చంద్రబాబు రాజధాని భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశాడు. అంటే రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా తన బినామీలకు చెప్పి భారీగా భూములు కొనుగోలు చేయించాడు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా బలవంతంగా రైతుల నుంచి భూములు తీసుకుని మిగిలిన భూములను తనకు నచ్చిన వారికి నచ్చిన రేట్లకు నచ్చిన పద్ధతిలో కేటాయిస్తూ కమీషన్లు, వాటాలు దండుకుంటూ మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాజధానికి వచ్చే ఏ మనిషైనా చంద్రబాబు బినామీ హోటల్లోనే బస చేయాలి. ఆయన గారి బినామీ దుకాణాల్లోనే వస్తువులను కొనుగోలు చేయాలి. ఆయన బినామీల బిల్డింగ్‌ల్లోనే ఆఫీసులు పెట్టుకోవాలట. చివరకు నీరు, కరెంటు, టీవీలు ఏ సర్వీసు అయినా కూడా బాబు బినామీలకే కప్పం కట్టి తీసుకోవాలట. పాలు కూడా చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ నుంచే కొని తాగాలట. దానికి తగ్గట్టుగానే సహకార రంగంలోని డైరీలు.. చిత్తూరు, ఒంగోలు సహా అన్నింటినీ వరుసగా మూతపడే పరిస్థితి తీసుకువచ్చాడు. చంద్రబాబు ఒక పథకం ప్రకారం సర్కార్ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాడు. బిల్లులు ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఇంటికి పంపే కార్యక్రమం చేస్తున్నాడు. చంద్రబాబు బినామీలైన నారాయణ, చైతన్య లేకపోతే మరో ప్రైవేటు స్కూళ్లకు పిల్లలు పోయే పరిస్థితిని కల్పిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్గొట్టేందుకు తన బినామీలతో ప్రైవేట్ యూనివర్సిటీలను విచ్చలవిడిగా తీసుకువచ్చే వరకు వెళ్లాడు. ఎక్కడ చూసినా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏజెన్సీలే పెత్తనం చెలాయిస్తున్నాయి. మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు. తుదకు దేవాలయాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులను సైతన ఆయన బినామీలకే కట్టబెడుతున్నాడు. తిరుపతి నుంచి అన్నవరం వరకు ఏడు ప్రధాన దేవాలయాల పారిశుద్ధ్య పనులను చంద్రబాబు తన బినామీ అయిన భాస్కరనాయుడుకు నాలుగు రెట్లు పెంచి కట్టబెట్టి లంచాలు తీసుకున్నాడు. ఇవాళ మనం ఇల్లు కట్టుకోవాలంటే చంద్రబాబు మనుషుల నుంచి మట్టి, ఇసుక కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. కింది నుంచి పైదాకా.. ఎమ్మెల్యే, మంత్రి, చినబాబు, పెదబాబు అందరికీ వాటాలు పోతున్నాయి. ఇలాంటి నాయకుడు అవసరమా? ఆలోచించండి. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేనలను నమ్మొద్దు. వేసే ప్రతి ఓటు కూడా మనమే వేసుకుందాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వేసుకుందాం. 25 మందికి 25 మంది ఎంపీలను మనమే గెలిపించుకుందాం. 25 మంది ఎంపీలు మన దగ్గర ఉంటే ఆ తర్వాత ఎవరు ప్రధాన మంత్రి అవుతారో మనం నిర్ణయిస్తాం. ప్రధాని ఎవరైనా కానీ.. ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే మద్దతిస్తామని చెబుదాం. ఈ హక్కు మన దగ్గర పెట్టుకుని ఈ రాజకీయ పార్టీలకు, నాయకులందరకీ బుద్ది చెబుదాం. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోంది. ప్రభుత్వ రంగాలను చంద్రబాబు తన స్వార్థం కోసం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తున్నాడు. సూటిగా చెప్పాలంటే మన రాజధాని భూముల నుంచి మొదలుపెట్టి తినే భోజనం, చదివే చదువులు, ఆస్పత్రులు, కేబుల్ టీవీలు అన్నీ కూడా చంద్రబాబు తన బినామీలకే అప్పగిస్తున్నాడు. ప్రైవేట్ సంస్థల ముసుగులో చంద్రబాబు దారుణాలు చేస్తున్నాడు. అన్నీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే. అన్నీ ఆయన బినామీ సంస్థలే. మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ చంద్రబాబు దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నాడు. ఎక్స్‌రే యూనిట్ ఉంటే సిబ్బంది ఉండరు. సిబ్బంది ఉంటే ఎక్సరే యూనిట్ ఉండదు. అంబులెన్స్‌లు సరిగా ఉండవు. ఆస్పత్రిలో డాక్టర్లు ఉండరు. మందులు ఉండవు. చివరకు ప్రభుత్వ ఆస్పత్రులంటే పనికి రావు అనే భావన కల్పించేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ భావన కల్పించాక, ఆస్పత్రుల్లోని సేవలను తన బినామీలకు రెండు, మూడు రెట్ల ధరకు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ పోతున్నాడు. వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ శ్రీకాకుళం అర్బన్/సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ కీలక నేత హాజీ అబ్దుల్ ఘనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆయనకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ 30 ఏళ్లుగా టీడీపీకి సేవ చేశానని, గత సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది బాలకృష్ణ కోసం సీటు త్యాగం చేశానన్నారు. అయినప్పటికీ పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళుతోందని నమ్మి పార్టీలో చేరానన్నారు. కె.సురేష్‌కుమార్‌రెడ్డి, ఉపేంద్రరెడ్డి, జగన్, అమరనాథ్‌రెడ్డి, రమేష్‌లు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కాగా, తాను టీడీపీలో కొనసాలేని పరిస్థితిలో పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అబ్దుల్ ఘనీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపారు. వైఎస్సార్ జిల్లా టీడీపీ నేతల చేరిక: వైఎస్సార్ జిల్లా రాజంపేట రాజంపేట మున్సిపాలిటీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, టీడీపీ నేత కటారు సుబ్బిరామిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనతో పాటు మరో 30 మంది టీడీపీ నేతలు పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి శనివారం వచ్చారు. వారందరికీ కండువా వేసి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కుండ్ల రమణారెడ్డి, మాతా రమణ, రాము యాదవ్, కటారు చంద్రశేఖర్‌రెడ్డి, చప్పిడి శంకర్‌రెడ్డి, బి.నరేష్, కటారు అమరనాథ్‌రెడ్డి, జి.సురేష్, కటారు సుబ్బ నరసారెడ్డి, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. -
కార్డు కావాలా... కమిటీనడగండి..
పథకాలు క్షేత్రస్థాయిలో పేదలకు అందుతున్నాయా లేదా? పర్యవేక్షించేందుకు టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను నియమించింది. ప్రభుత్వ యంత్రాంగానికి సహకారం అందించేందుకు ఏర్పాటైన కమిటీలకు ఇప్పుడు ఏకంగా అమలు బాధ్యతలను కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తోంది. చట్టబద్ధత లేని ఈ కమిటీ సభ్యులు తమకు నచ్చినవారికి లబ్ధి చేకూర్చే ప్రక్రియ మొదలు పెట్టారు. తాజాగా ఇస్తున్న రేషన్ కార్డులను సైతం వీరి చేతిలో పెడుతూ ప్రభుత్వం మెమోను జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళంటౌన్/వీరఘట్టంః ఇటీవల జన్మభూమి మూడోవిడత లో కొత్తరేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధపడింది. రెండువిడతల జన్మభూమి కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని చెప్పిన పాలకులు జిల్లాలో వచ్చినదరఖాస్తులన్నింటిని కార్డు కావాలా... కమిటీనడగండి.. జన్మభూమి కమిటీల పరిశీలనకు పంపించాలని ఆదేశించారు. రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 1.01లక్ష మంది రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంతో వాటిని తిరిగి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీ పరిశీలనకు పంపించారు. వాటిని తిరిగి ఆన్లైన్ చేసినపుడు 81,379 దరఖాస్తులు మాత్రమే పూర్తిస్థాయి ఆదారాలతో నమోదయ్యాయి. ఆన్లైన్లో నమోదైన వాటిలో జాయింట్ కలెక్టరు వివేక్‌యాదవ్ 78,188 దరఖాస్తులను పరిశీలించి కార్డు జారీకి అనుమతించారు. కానీ జన్మభూమి కమిటీ అభ్యంతరాల దృష్ట్యా 60,883 కుటుంబాలకు కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన అధికారులు వాటిని సభ్యుల పర్యవేక్షణలో గ్రామసభల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. 38,083 కార్డులకు పోటోలు ముద్రించక పోవడంతో పంపిణీ చేయడానికి అభ్యంతరాలు తలెత్తాయి. మిగిలిన 22,570 కార్డులను గ్రామాల్లో పంపిణీకి సిద్ధమైనా వాటిలో కుటుంబ యజమాని తప్ప మిగిలిన వారిపేర్లు గల్లంతయ్యాయి. దీంతో 4వేల రేషన్‌కార్డులు పంపిణీ చేసి మిగిలినవి జన్మభూమి కమిటీలకు అప్పగించారు. సొమ్ము చేసుకుంటున్న జన్మభూమి కమిటీలు రేషన్ కార్డులు చేతికి రావడంతో ఒక్కోకార్డుకు జన్మభూమి కమిటీ ఒక్కోధర నిర్ణయించి గ్రామాల్లో అక్రమ వసూళ్లకు తెర తీశారు. ప్రస్తుతం అన్ని పథకాలకు రేషన్‌కార్డు,ఆధార్ కార్డు తప్పని సరి. దీంతో జిల్లాలో కార్డులేనివారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 8లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉంటే కొత్తగా మరో లక్షమంది దరఖాస్తు చేసుకున్నారంటే గిరాకీ అర్థమవుతోంది. ఇదే అదనుగా జన్మభూమి కమిటీలు కార్డుకు ధర నిర్ణయించి అమ్ముకుంటున్నారన్న విమర్శలు గ్రామాల్లో వినపిస్తున్నాయి. చట్టబద్దత లేనివారి చేతికి కార్డులెలా ఇస్తారు? -గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖ పర్యవేక్షకునిగా ఉన్న వీఆర్ఓలను, ప్రజాప్రతినిదిగా ఎన్నికైన సర్పంచ్,ఎంపిటిసిలను కాదని కార్డులను జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టడం వివాదాలకు దారితీస్తోంది. ఇటీవల జన్మభూమి గ్రామసభల్లో అనేక చోట్ల కమిటీల జోక్యం వివాదాస్పదమైంది. ఈ విధాలను పక్కనపెట్టిన ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు రేషన్ కార్డులను అప్పగించాలంటూ పౌరసరఫరాశాఖ కమిషనర్ నుంచి మెమో జారీ కావడంతో అటు రెవెన్యూ ఉద్యోగులు, ఇటు ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
'పవర్' చూపించిన రవితేజ అభిమానులు ...
శ్రీకాకుళం: హీరో రవితేజ నటించిన 'పవర్' సినిమా విడుదల నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలోని సూర్యమహాల్ వద్ద ఉద్రికత్త నెలకొంది. పవర్ సినిమా టికెట్లు సూర్యమహాల్ యాజమాన్యం బ్లాక్‌లో విక్రయించారని ఆరోపిస్తూ రవితేజ అభిమానులు సినిమా హాల్‌పై దాడి చేశారు. ఆ దాడికి సినిమా హాల్ యాజమాన్యం అడ్డు తగిలింది. దాంతో రవితేజ అభిమానులకు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ హీరో రవితేజ అభిమానులు సినిమా హాల్ యాజమాన్యం సిబ్బందిపై తమ ప్రతాపాన్ని చూపించారు. రవితేజా అభిమానుల దాడిపై సినిమా హాల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హుటాహుటిన సినిమా హాల్ వద్దకు చేరుకుని... రవితేజ అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. దాంతో స్థానికంగా ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. -
టీడీపీలో వర్గపోరు..!
శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు- కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు వర్గాల మధ్య నలిగిపోతున్నాం...వచ్చే ఐదేళ్లలో టీడీపీకి భవిష్యత్ లేదు... పార్టీ కనుమరుగ వుతుంది... పార్టీని ఆ భగవంతుడే కాపాడాలి... అంటూ పార్టీ పాతపట్నం శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. పార్టీలోని విభేదాలను వెళ్లగక్కాయి. వివరాల్లోకి వెళితే కిమిడి వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్ పాతపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఇది ఇష్టంలేని కింజరాపు వర్గం పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనా యుడుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి, పాతపట్నంలో హల్చల్ చేయాలని కొంత కాలంగా పావులు కదుపుతోంది. దీంతో ఇరువర్గాల మధ్య ముసలం మొదలైంది. కిమిడి, కింజరాపు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఐదుగురు సభ్యుల తో కూడిన సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో ఒక సభ్యుడైన మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు గైర్హాజరయ్యారు. కమిటీ సభ్యులు కొవగాపు, కలిశెట్టిలతో వేర్వేరుగా మాట్లాడారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. వాస్తవంగా జిల్లాలో పార్టీనాయకుల మధ్య సమన్వయం కొరవడితే జిల్లా ఇన్చార్జి బండారు సత్యనారాయణమూర్తి, బొండా ఉమామహేశ్వర రావులు చక్కదిద్దుతారు. దీనికి భిన్నంగా కిమిడి లేకుండా, చంద్రబాబునాయుడుకి తెలియకుండా కింజరాపు వర్గం ఏక పక్షంగా సమావేశం ఏర్పాటుచే సింది. విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఫోన్లో కమిటీ సభ్యులకు చీవాట్లు పెట్టినట్టు సమాచారం. దీంతో చివరకు ఇన్చార్జిగా ఉన్న కొవగాపుతో కలిసి పని చేయాలని కలిశెట్టిని సూచించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని కమిటీ సభ్యుడు చెప్పారు. అందుకే కలిశెట్టి సీరియస్‌గా భయటకు వెళ్లిపోయాడని తెలిపారు. దీనికి భిన్నంగా పాతపట్నం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తదనంతరం నిర్ణయం వెలువడ నుందని కింజరాపు వర్గం బయటకు చెబుతోంది. కాపుసామాజిక వర్గాన్ని కాదంటే... శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న పాతపట్నం నియోజకవర్గం విషయంలో కింజరాపు వర్గం కాలు దువ్వుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ తమని కాదని వేరే వర్గం వైపు మొగ్గు చూపితే టీడీపీకి కాపు సామాజిక వర్గం దూరంగా ఉండడం ఖాయమని, ముఖ్యంగా కింజరాపు వర్గాన్ని రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరికలు ఇటీవల బహిరంగంగా రావడం గమనార్హం.