శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు. అలాగే శ్రీకాకుళం నగరం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మంగళవారం నుంచే ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. జిల్లాలోని మొత్తం కేసుల్లో ముప్పై శాతం కేసులు శ్రీకాకుళం నగరంలోనే నమోదు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న 14 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.
జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకునే దిశలో చర్యలు చేపడుతోంది. తొలి విడతలో కూడా పోలీసు శాఖ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసింది. గడిచిన రెండు రోజులుగా రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కరోనా తీవ్రత ఉన్న నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలపై దృష్టి సారించి రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.
జిల్లా ఎస్పీ నుంచి ఏఎస్పీలు, డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ గస్తీని పరిశీలిస్తున్నారు. మాసు్కలు లేకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. మాసు్క లు లేకుండా ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం రాత్రి, ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ నగరంలోని ప్రధాన కూడళ్లలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం నుంచి మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
చదవండి: అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..
ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు!
Comments
Please login to add a commentAdd a comment