సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 53 కోట్లు దాటింది. ఇప్పటివరకు 60,88,437 శిబిరాల ద్వారా మొత్తం 53,61,89,903 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కాగా గత 24 గంటలలో 63,80,937 వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించారు.
మరోవైపు కరోనా బారి నుంచి కోలుకున్నవారి శాతం (రికవరీ రేటు) 97.45 %కు చేరుకుంది. దేశంలో కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3.13 కోట్ల మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కాగా గత 24 గంటలలో 35,743 మంది కరోనా బాధితులు రికవర్ అయ్యారు.
38,667 కొత్త కేసులు
24 గంటలలో దేశవ్యాప్తంగా 38,667 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 48 రోజులుగా ప్రతీ రోజు కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. ప్రస్తుత దేశవ్యాప్తంగా 3,87,673 మంది చికిత్స పొందుతున్నారు.
అదే సమయంలో కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 22,29,798 కరోనా నిర్ధారణ పరీక్షలు జరపగా, ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 49.17 కోట్లు దాటింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 1.73%గా ఉంది. వరుసగా 19 రోజులుగా 3% లోపు పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అయితే 68 రోజులుగా దేశవ్యాప్త పాజిటివిటీ రేటు 5% లోపే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment