![India set to cross 200 crore mark in Covid vaccine doses - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/17/covid-vaccin.jpg.webp?itok=uHuR2ub6)
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేసిన డోసుల సంఖ్య 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 199.71 కోట్ల డోసుల టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది.
దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 20,044 కరోనా కేసులు నిర్థారణయ్యాయి. దీంతో, మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయని పేర్కొంది. అదే సమయంలో, మరో 56 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,25,660కు పెరిగినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment