
సాక్షి, బెంగళూరు: ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి బెంగళూరులోని ఓ హోటల్ భిన్నమైన ఆఫర్ ఇచ్చింది. తొలిసారి ఓటు వేసేవారికి దోసె, మిగతా వారికి ఫిల్టర్ కాఫీ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణరాజ్ ఈ వినూత్న ఆలోచన చేశారు. దీంతో ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు ఉన్న వేళ్లను చూపించి ప్రజలు ఉచితంగా దోసె, కాఫీలను ఆరగించారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు వీలైనంత త్వరగా ఓటు హక్కు వినియోగించాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.