
బెంగుళూరు : ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఓటు వేయాలంటూ ప్రకటనలతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. నాయకులైతే మరో అడుగు ముందుకేసి ప్రయాణ ఖర్చులిచ్చి మరీ ఓటర్లును రప్పించి ఓటు వేయించుకుంటారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి పెంచడానికి కర్ణాటకలోని ఓ హోటల్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారికి తమ హోటల్లో ఉచితంగా దోశ, ఫిల్టర్ కాఫీని ఇస్తున్నట్లు తెలిపింది. వివరాల...గత కొంతకాలంగా ఎన్నికల్లో బెంగుళూరులోనే తక్కువ ఓటింగ్ నమోదవున్నట్లు ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తక్కువ ఓటింగ్ శాతాన్ని తగ్గించడం కోసం బెంగుళూరులోని నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని క్రిష్ణ రాజ్ ఒక వినూత్న ఆలోచన చేశాడు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి దోశ, మిగితా వారికి ఫిల్టర్ కాఫీ ఉచితంగా ఇస్తామని ప్రకటించాడు. ఓటు వేసి వచ్చిన అనంతరం ఇంక్ మార్క్ ఉన్న తమ వేళ్లను చూపించి ఉచితంగా కాఫీ తాగొచ్చని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment