సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీసీఎస్ మోటార్ తన వాటాదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీవీఎస్ బోర్డు రెండవ తాత్కాలిక డివిడెండ్ రూపంలో షేరుకు 1.40 చొప్పున చెల్లించడానికి ఆమోదించినట్లు తెలిపింది. మార్చి 18 న పని గంటలు ముగిసే సమయానికి ఈ షేర్లను వాటాలను కలిగి ఉన్న వాటాదారులకు మార్చి 20 న లేదా ఆ తరువాత ప్రకటించిన తాత్కాలిక డివిడెండ్ చెల్లించబడుతుందని చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ రోజు (మంగళవారం) జరిగిన సంస్థ డైరెక్టర్ల సమావేశంలో బోర్డు మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రెండవ మధ్యంతర డివిడెండ్‌ను షేరుకు రూ. 1.40 (140 శాతం) చొప్పున ప్రకటించింది. గత నెలలో ఇది ఒక్కో షేరుకు రూ. 2.1 డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment