సాక్షి, న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రంపై పటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పుపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఈ తీర్పును కాంగ్రెస్ సన్మాన పత్రంలా భావిస్తోందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థికమంత్రి 2012లో అవినీతి, మోసపూరిత పాలసీ అని సుప్రీంకోర్టు తేల్చిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అన్ని లైసెన్సులను నిలిపివేసిందన్నారు.
2జీ కేటాయింపులు సక్రమమని కాంగ్రెస్ భావిస్తోంది. తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ సంబర పడుతోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా 2జీ కేటాయింపులు జరిగాయని జైట్లీ విమర్శించారు. యూపీఏ హయాంలో 2007లో కేటాయించిన 2జీ స్పెక్ట్రంమ లైసెన్సులను 2001 రేట్లకనుగుణంగా కేటాయింపులు జరిగాయి, తద్వారా ప్రభుత్వానికి తీరని నష్టం చేకూర్చారన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చార్జిషీట్‌ను తిరిగి పరిశీలించాలని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని , ఆ విశ్వాసం తనకుందని అరుణ జైట్లీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment