
డాక్టర్ దేబేంద్ర, డాక్టర్ ప్రథమ, డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఆర్‌ఎస్‌ఐ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యా ప్తంగా రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న 30 మంది శాస్త్రవేత్తలను కాంస్య పతకాలకు ఎంపిక చేయగా అందులో ఐఐసీటీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌లుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రథమ ఎస్.మైన్‌కర్, డాక్టర్ దేబేంద్ర కె.మహాపాత్ర, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డికి దర్శన్ రంగనాథన్ స్మారక ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. మొహాలీలో ఇటీవల జరిగిన 29వ సీఆర్‌ఎస్‌ఐ జాతీయ సదస్సులో ఈ అవార్డులను అందజేశారు. మెడిసినల్ కెమిస్ట్రీ, కృత్రిమ సేంద్రియ రసాయన శాస్త్రం, కొత్త మందుల ఆవిష్కరణ వంటి రంగాల్లో డాక్టర్ ప్రథమ పరిశోధనలు చేస్తుండగా.. వైద్యానికి కీలకమైన సంక్లిష్టమైన సహజ రసాయనాలు గుర్తించేందుకు డాక్టర్ దేబేంద్ర కృషి చేస్తున్నారు. ఫార్మా రంగంతోపాటు సీఎస్‌ఐఆర్ వ్యవస్థలోనూ అనుభవం గడించిన డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి సేంద్రియ, మెడిసినల్ రసాయన శాస్త్ర రంగాలను మానవ సంక్షేమానికి వర్తించే దిశగా కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment