దేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది
దేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది
Published Sun, Feb 26 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
డీఈఓ తాహెరా సుల్తానా
నంద్యాల: మనదేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. స్థానిక ఎన్జీఓ కాలనీలోని గురురాజ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఆదివారం సైన్స్‌డే ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమెతో పాటు గురురాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ముందున్నామని చెప్పారు. దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు బాల్యం నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలు కావాలని కోరారు. భూగర్భ శాస్త్రవేత్త కేవీ రమణయ్య, రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రామయ్య, సెంథిల్ రాజు, డాక్టర్ మధుసూదనరావులను సన్మానించారు. అనంతరం సైన్స్‌పై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో రాణించిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ సుమతి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల కో డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డి పాల్గొన్నారు.
Advertisement