Ratan Tata received Australia's highest civilian honour; check details - Sakshi
Sakshi News home page

రతన్ టాటాకు మరో అరుదైన పురస్కారం: ఫోటోలు వైరల్‌ 

Published Mon, Apr 24 2023 2:23 PM | Last Updated on Mon, Apr 24 2023 3:03 PM

RatanTata receives highest Australian civil honour details check - Sakshi

సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, టాటాసన్స్ ఛైర్మన్ ఎమెరిటస్  రతన్ టాటాకు అరుదైన పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం రతన్ టాటాను వరించింది.

ఆస్ట్రేలియా-భారత్ ద్వైపాక్షిక సంబంధానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారతదేశంలోని ఆస్ట్రేలియన్ రాయబారి బారీ ఓ' ఫారెల్  ట్విటర్‌లో  షేర్‌ చేశారు.  పారిశ్రామిక దిగ్గజమైన రతన్‌ టాటా  వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలో కూడా  గొప్ప వ్యక్తిగా నిలిచారని ప్రశంసించారు. టాటా సహకారం ఆస్ట్రేలియాలో గణనీయమైన ప్రభావాన్ని తీసుకొచ్చిం దన్నారు. ఆస్ట్రేలియా-భారత్ బంధానికి టాటా సుదీర్ఘ నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా  గౌరవాన్ని ప్రదానం చేయడం ఆనందంగా ఉందని  ట్వీట్‌ చేశారు. 
 
టాటా వపర్‌ సదరన్‌ ఒడిశా డిస్టట్రీబ్యూషన్‌ ఎగ్జిక్యూటివ్ రాహుల్ రంజన్ కూడా లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో సత్కార వేడుక ఫోటోలను చేశారు. బిజినెస్‌లోనూ, ఫిలాంత్రఫీలోనే టాటా చేసిన సేవలు భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్‌​ అయ్యాయన్నారు. అనేక విజయవంతమైన వెంచర్‌ల వెనుక చోదక శక్తిగా రతన్ టాటా ఉన్నారు. ఆయన లీడర్‌ షిప్‌, విజన్‌  ఎంతోమందికి తమ కలల సాకారంలో  గొప్ప స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement