తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్- టీటీఏ సంస్థ అధ్యక్షులు, వాట్స్(WATS), వాటా(WATA), ఇండియన్ కమ్యూనిటీ సెంటర్(Indian Community Center) వ్యవస్థాపకులు, ప్రముఖ ఎన్నారై వంశీరెడ్డి కంచరకుంట్లకు అరుదైన గౌరవం దక్కింది. కమ్యూనిటీ సర్వీస్, వాలంటీర్ లీడర్‌షిప్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకు గాను అమెరికాలో ప్రతిష్టాత్మకమైనా యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ వరించింది.
ఆయన సేవా నిరతిని గుర్తించిన వాట్స్ సంస్థ.. ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ (PVSA), లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను స్వర్ణ పథకంతో సత్కరించింది. సంక్రాంతి, రిపబ్లిక్ డేని పురస్కరించుకుని వాట్స్(WATS) సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో.. సీటెల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment