
రంపచోడవరం భూపతిపాలెం సమీపంలో కొండలను తాకుతూ మురిపిస్తున్న మేఘాలు
ఎత్తయిన పచ్చని కొండలు.. వాటి మధ్య దవళవర్ణ శోభితమైన మేఘాలు తాకుతూ వెళితే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు ఎంతో హాయిగా ఉంటుంది. అటువంటి ఆకర్షణీయమైన దృశ్యాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు వేదికయ్యాయి. ఏజెన్సీలోని ఘాట్ రోడ్లు, రంపచోడవరం సమీపంలోని భూపతిపాలెం ప్రాజెక్టు, సున్నంపాడు, మారేడుమిల్లి వద్ద కొండకొండకూ మధ్య తేలియాడుతూ వెళుతున్న మేఘమాలికలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి.

మారేడుమిల్లి మండలం, సున్నంపాడు వద్ద కొండలను తాకుతూ వెళుతున్న మేఘాలు
Comments
Please login to add a commentAdd a comment