philipines
-
చాక్లెట్ గుట్టలుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..
చాక్లెట్ కొండలు చాక్లెట్ రంగులో కనిపించే ఈ కొండలు ఫిలిప్పీన్స్‌లోని బొహోల్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. భారీ ఎత్తున చాక్లెట్‌ను గుట్టలుగా రాశిపోసినట్లు కనిపించే ఇలాంటి 1776 కొండలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి యాభై కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. బొహోల్ ప్రావిన్స్‌లో ఈ చాక్లెట్ కొండలే ప్రధాన పర్యాటక ఆకర్షణ. వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. యూనెస్కో ఈ కొండలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. వీటిలో రెండు కొండలపై ఇటీవలి కాలంలో టరిస్ట్ రిసార్ట్‌లను ఏర్పాటు చేశారు. గోపురాల్లా తీర్చిదిద్దినట్లు కనిపించే ఈ కొండలు ఒక్కొక్కటి సగటున 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటిలో అతి ఎత్తయిన కొండ 120 మీటర్లు ఉంటుంది. (చదవండి: గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే) -
దారుణం: ఫిలిప్పిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి, 80 ఇళ్లు దగ్ధం
ఫిలిప్పిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జనసంద్రమైన ఓ బస్తీలోని ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పారు. వివరాల ప్రకారం.. మెట్రో మనీలాలోని స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని సమీపంలోని నివాస ప్రాంతంలో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. క్యూజోన్ సిటీ సబర్బ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ కాంపౌండ్‌లో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు మంటలు భారీగా చెలరేగాయి. దీంతో బాధితులు తమ ఇళ్లలో చిక్కుకుపోయారు. ఒకే ఇంట్లో చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. సమాచారం ప్రకారం సుమారు 80 ఇళ్ళు కాలిపోగా, 250 కుటుంబాలు ఈ ప్రమాదం వల్ల తీవ్రంగా నష్టపోయారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేసింది. కాగా ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. చదవండి: తక్కువ అంచనా వేశారు.. రష్యన్ బోట్లను పేల్చేశాం: ఉక్రెయిన్ -
ఘోర దుర్ఘటన.. కూలిన వైమానిక విమానం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వాళ్లలో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 17 మృతదేహాలను గుర్తించినట్లు సిరిలిటో వెల్లడించారు. కాగా, సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించి, వారిని ఆసుప్రతికి తరలించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. కానీ, ఈ ఘటన ప్రమాదమా? లేదంటే ఉగ్ర దాడినా? అనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెప్తున్నారు. కిందటి నెలలో బ్లాక్ హ్యాక్ హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయి.. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
-
గ్రేట్ రైటర్
వాస్తవానికీ కల్పనకూ మధ్యన అంతరాన్ని చెరిపేసిన రచయితగా ఫిలిప్ రాత్‌కు పేరు. బలమైన ఆత్మకథాత్మక పాత్రలు ఆయన రచనల్లో కనబడతాయి. రాజకీయాలపై వ్యంగ్యం, సామాజిక వ్యాఖ్యానం, లైంగికతపై ముసుగులేని ఆలోచనలు చేస్తాడు. జీవితం తాలూకు సిగ్గులేని కల్మషాన్ని వ్యక్తపరుస్తాడు. నాథన్ జుకెర్మాన్ పాత్రే మళ్లీ మళ్లీ అతడి రచనల్లో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ‘నా జీవితపు అసలైన డ్రామా నుంచి ఒక నకిలీ ఆత్మకథని, బూటకపు చరిత్రని, అర్ధ కల్పిత అస్తిత్వాన్ని పుట్టించటమే నా జీవితం’ అంటాడు. ఒక నవలను శ్రద్ధగా చదవాలంటే అది పాఠకుడినుంచి కొన్ని గుణాలు డిమాండ్ చేస్తుందనీ, అవి ఉన్నవాళ్లు చాలా తక్కువమంది అనీ, అందుకే భవిష్యత్తులో చదవడం అనేది కొద్దిమందికే పరిమితం కాబోయే కార్యక్రమమనీ నిరాశ పడతాడు. ‘గుడ్‌బై, కొలంబస్’, ‘ఎమెరికన్ పాస్టరల్’, ‘ద హ్యూమన్ స్టెయిన్’, ‘పోర్ట్‌నోయ్స్ కంప్లెయింట్’, ‘మేరీడ్ ఎ కమ్యూనిస్ట్’, ‘ఎవ్రీమేన్’, ‘వెన్ షి వజ్ గుడ్’, ‘ద ఘోస్ట్ రైటర్’ ఆయన ప్రసిద్ధ నవలల్లో కొన్ని. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు రాత్. అమెరికాలో ఒక యూదుడిగా తన అనుభవాల్ని రాసినప్పటికీ తనను తాను యూదుడు అనుకోవడానికి ఇష్టపడలేదు. అమెరికా పౌరుడిగానే భావించాడు. 1933లో జన్మించిన ఫిలిప్ రాత్ తన ఎనభై అయిదో ఏట గత నెల మే 22న కన్నుముశాడు. -
డ్రగ్స్ కేసులో ‘ఫిలిప్పీన్స్’ మేయర్ హతం
జాంబోంగా (ఫిలిప్పీన్స్): మాదక ద్రవ్యాల కేసులతో సంబంధం ఉన్న ఓ నగర మేయర్‌ను ఫిలిప్పీన్స్ పోలీసులు ఆదివారం కాల్చిచంపారు. మీండానోవ్ ద్వీపంలోని ఒజమిజ్ నగర మేయర్ రెనాల్డో పరోజి నోగ్, ఆయన భార్య, సోదరుడు సహా మొత్తం 13 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. మాదకద్రవ్యాల వ్యాపారు లపై ఫిలిప్పీన్స్ పోలీసులు జరిపిన భారీ దాడుల్లో ఇది ఒకటి. మేయర్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉందని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే గతేడాది బహిరంగంగానే ప్రకటించారు. పరోజినోగ్ లైసెన్సులు లేని ఆయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారం రావడంతో పోలీసులు ఆదివారం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వారెంట్‌తో వెళ్లారు. వెంటనే మేయర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసు లపై కాల్పులు జరి పారు. పోలీసులు కూడా ప్రతికాల్పులు ప్రారంభించడంతో మేయర్ మరణించారు. ఘర్షణలో ఓ పోలీస్ కూడా గాయపడ్డారు. ఒజమిజ్ నగర ఉప మేయర్ అయిన పరోజినోగ్ కూతురిని అరెస్టు చేసిన పోలీ సులు రాజధాని మనీలాకు తరలించారు. అనంతరం పరోజినోగ్ నివాసంతోపాటు మరో మూడు ఇళ్లలో ఆయుధాల కోసం సోదాలు జరిపిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. కొన్ని తుపాకులు, గ్రెనేడ్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల కేసులకు సంబంధించి దుతర్తె అధ్యక్షుడిగా ఉండగా చనిపోయిన మూడో మేయర్ పరోజినోగ్. గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్టైన అల్బ్యురా నగర మేయర్ రోలాండో ఎస్పినోసాను పోలీసులు జైలులోనే కాల్చి చంపారు. అంతకు వారం రోజులముందే మరో మేయర్‌ను, అతని 9 మంది బాడీ గార్డులను కూడా పోలీసులు అంతమొందిం చారు. దేశంలోని చివరి డ్రగ్ సరఫరాదా రుడిని కూడా చంపేంత వరకు నిద్రపోనని దుతర్తే గతంలోనే శపథం చేశారు.