డ్రగ్స్ కేసులో ‘ఫిలిప్పీన్స్’ మేయర్ హతం
జాంబోంగా (ఫిలిప్పీన్స్): మాదక ద్రవ్యాల కేసులతో సంబంధం ఉన్న ఓ నగర మేయర్‌ను ఫిలిప్పీన్స్ పోలీసులు ఆదివారం కాల్చిచంపారు. మీండానోవ్ ద్వీపంలోని ఒజమిజ్ నగర మేయర్ రెనాల్డో పరోజి నోగ్, ఆయన భార్య, సోదరుడు సహా మొత్తం 13 మంది పోలీసుల కాల్పుల్లో మరణించారు. మాదకద్రవ్యాల వ్యాపారు లపై ఫిలిప్పీన్స్ పోలీసులు జరిపిన భారీ దాడుల్లో ఇది ఒకటి. మేయర్‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉందని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తే గతేడాది బహిరంగంగానే ప్రకటించారు. పరోజినోగ్ లైసెన్సులు లేని ఆయుధాలు కలిగి ఉన్నారన్న సమాచారం రావడంతో పోలీసులు ఆదివారం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వారెంట్‌తో వెళ్లారు.
వెంటనే మేయర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసు లపై కాల్పులు జరి పారు. పోలీసులు కూడా ప్రతికాల్పులు ప్రారంభించడంతో మేయర్ మరణించారు. ఘర్షణలో ఓ పోలీస్ కూడా గాయపడ్డారు. ఒజమిజ్ నగర ఉప మేయర్ అయిన పరోజినోగ్ కూతురిని అరెస్టు చేసిన పోలీ సులు రాజధాని మనీలాకు తరలించారు. అనంతరం పరోజినోగ్ నివాసంతోపాటు మరో మూడు ఇళ్లలో ఆయుధాల కోసం సోదాలు జరిపిన పోలీసులు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. కొన్ని తుపాకులు, గ్రెనేడ్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల కేసులకు సంబంధించి దుతర్తె అధ్యక్షుడిగా ఉండగా చనిపోయిన మూడో మేయర్ పరోజినోగ్. గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్టైన అల్‌బ్యురా నగర మేయర్ రోలాండో ఎస్పినోసాను పోలీసులు జైలులోనే కాల్చి చంపారు. అంతకు వారం రోజులముందే మరో మేయర్‌ను, అతని 9 మంది బాడీ గార్డులను కూడా పోలీసులు అంతమొందిం చారు. దేశంలోని చివరి డ్రగ్ సరఫరాదా రుడిని కూడా చంపేంత వరకు నిద్రపోనని దుతర్తే గతంలోనే శపథం చేశారు.