మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వాళ్లలో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 17 మృతదేహాలను గుర్తించినట్లు సిరిలిటో వెల్లడించారు.
కాగా, సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించి, వారిని ఆసుప్రతికి తరలించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
అయితే ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. కానీ, ఈ ఘటన ప్రమాదమా? లేదంటే ఉగ్ర దాడినా? అనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెప్తున్నారు. కిందటి నెలలో బ్లాక్ హ్యాక్ హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయి.. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment