military plane crash
-
ఉజ్బెకిస్తాన్‌లో కూలిన అఫ్గన్ మిలిటరీ విమానం
తాష్కెంట్: అఫ్గనిస్తాన్‌కు చెందిన మిలిటరీ విమానం ఉజ్బెకిస్తాన్‌లో కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్ గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ మేరకు ఉజ్బెకిస్తాన్ రక్షణశాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. అఫ్గనిస్తాన్‌కు సమీపంలో గల సర్జోదార్యో ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. ‘‘అఫ్గనిస్తాన్ సైన్యానికి చెందిన విమానం ఉజ్బెకిస్తాన్‌లో అక్రమంగా ప్రవేశించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది’’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి అంతర్జాతీయ మీడియా(ఏఎఫ్‌పీ)కు వెల్లడించారు. విమానం కూలిపోయిన ఘటన గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. కాగా తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు అఫ్గాన్లు, విదేశీయులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక కొంతమంది సైనికులు సైతం సరిహద్దులు దాటి ఉజ్బెకిస్తాన్‌లో ప్రవేశించారు. వైద్య సహాయం కోసం అక్కడి వారిని అర్థించారు. ఈ నేపథ్యంలో 84 మంది అఫ్గన్ సైనికులను ఉజ్బెకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని తిరిగి అప్పగించే విషయమై అఫ్గన్లతో చర్చలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. చదవండి: Afghanistan: తాలిబన్ల గుప్పిట్లో అఫ్గనిస్తాన్.. చైనా కీలక ప్రకటన -
ఘోర దుర్ఘటన.. కూలిన వైమానిక విమానం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వాళ్లలో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 17 మృతదేహాలను గుర్తించినట్లు సిరిలిటో వెల్లడించారు. కాగా, సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించి, వారిని ఆసుప్రతికి తరలించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. కానీ, ఈ ఘటన ప్రమాదమా? లేదంటే ఉగ్ర దాడినా? అనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెప్తున్నారు. కిందటి నెలలో బ్లాక్ హ్యాక్ హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయి.. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. -
కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం
న్యాపిడా: ఘోర విమాన ప్రమాదం సంభవించి ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12 మంది మృతి చెందిన సంఘటన మయన్మార్‌లో చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో సైనిక విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మఠం శంకుస్థాపన చేసేందుకు విమానం పై ఓ ఎల్విన్ పట్టణానికి వెళ్తోంది. దేశ రాజధాని న్యాపిడా నుంచి గురువారం బయల్దేరిన కొద్దిసేపటికి కుప్పకూలింది. విమానంలో ఆరుగురి మిలిటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. ప్రమాదంలో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే వారిలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. అయితే ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలతో బయటపడినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. 400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన అనంతరం వాతావరణం సహకరించక సిగ్నల్స్ అందలేదు. దీంతో విమానం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో సైనిక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా.. చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
రహదారిపై కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
-
కుప్పకూలిన అమెరికా సైనిక విమానం
వాషింగ్టన్ : జార్జియాలోని ఓ రహదారిపై అమెరికా సైనిక విమానం కుప్పకూలింది. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ విమానం అమెరికా వైమానిక దళంలో సేవలందించింది. ఇక రిటైర్మెంట్ సమయం వచ్చిందని, దాన్ని స్టోర్ రూమ్‌కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం సవాన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 9 మంది మిలటరీ సిబ్బందితో టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ఆ విమానం అగ్నిగుండం వలే నేలపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు విమానం రోడ్డుపై పడిన సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు. సీ-130 రకానికి చెందిన ఈ కార్గో విమానాన్ని ప్రస్తుతం ప్యూటో రికో ఎయిర్ నేషనల్ గార్డ్స్ వినియోగిస్తున్నారు. నేషనల్ గార్డ్స్ ప్రతినిధి పాల్ డాలెన్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన విమానం 50 ఏళ్ల క్రితం నాటిది అయినప్పటికీ, అది ప్రస్తుతం కండీషన్లోనే ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
సైనిక విమానం కూలి 103 మంది మృతి
అల్జీర్స్: అల్జీరియా దేశానికి చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలిపోయింది. 103 మంది మరణించినట్టు సమాచారం. తూర్పు ప్రాంతంలోని ఓయుమ్ ఈ బోవాఘీ ప్రావిన్స్‌లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. మిలటరీ అధికారుల కుటుంబ సభ్యులను తీసుకెళ్తుండగా విమానం ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న 103 మంది మరణించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. దట్టమైన మంచు, అననుకూల వాతావరణం ప్రమాదానికి కారమని భావిస్తున్నారు. ప్రమాద స్థలానికి వైద్య సహాయ బృందాలు చేరుకున్నాయి.