ప్రతీకాత్మక చిత్రం
తాష్కెంట్: అఫ్గనిస్తాన్‌కు చెందిన మిలిటరీ విమానం ఉజ్బెకిస్తాన్‌లో కూలిపోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్ గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ మేరకు ఉజ్బెకిస్తాన్ రక్షణశాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. అఫ్గనిస్తాన్‌కు సమీపంలో గల సర్‌జోదార్యో ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.
‘‘అఫ్గనిస్తాన్ సైన్యానికి చెందిన విమానం ఉజ్బెకిస్తాన్‌లో అక్రమంగా ప్రవేశించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది’’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి అంతర్జాతీయ మీడియా(ఏఎఫ్‌పీ)కు వెల్లడించారు. విమానం కూలిపోయిన ఘటన గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
కాగా తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు అఫ్గాన్లు, విదేశీయులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక కొంతమంది సైనికులు సైతం సరిహద్దులు దాటి ఉజ్బెకిస్తాన్‌లో ప్రవేశించారు. వైద్య సహాయం కోసం అక్కడి వారిని అర్థించారు. ఈ నేపథ్యంలో 84 మంది అఫ్గన్ సైనికులను ఉజ్బెకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారిని తిరిగి అప్పగించే విషయమై అఫ్గన్లతో చర్చలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
చదవండి: Afghanistan: తాలిబన్ల గుప్పిట్లో అఫ్గనిస్తాన్.. చైనా కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment