కుప్పకూలిన అమెరికా సైనిక విమానం | US Military Plane Crash Near Savannah Leaves Nine Died | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన అమెరికా సైనిక విమానం

Published Thu, May 3 2018 12:03 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

US Military Plane Crash Near Savannah Nine Died - Sakshi

జార్జియాలో కుప్పకూలిన అమెరికా సైనిక విమానం

వాషింగ్టన్‌ :  జార్జియాలోని ఓ రహదారిపై అమెరికా సైనిక విమానం కుప్పకూలింది. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ విమానం అమెరికా వైమానిక దళంలో సేవలందించింది. ఇక రిటైర్మెంట్‌ సమయం వచ్చిందని, దాన్ని స్టోర్‌ రూమ్‌కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం సవాన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 9 మంది మిలటరీ సిబ్బందితో టేకాఫ్‌ అయిన విమానం కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ఆ విమానం అగ్నిగుండం వలే నేలపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు విమానం రోడ్డుపై పడిన సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు. సీ-130 రకానికి చెందిన ఈ కార్గో విమానాన్ని ప్రస్తుతం ప్యూటో రికో ఎయిర్‌ నేషనల్‌ గార్డ్స్‌ వినియోగిస్తున్నారు.

నేషనల్‌ గార్డ్స్‌ ప్రతినిధి పాల్‌ డాలెన్‌ మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన విమానం 50 ఏళ్ల క్రితం నాటిది అయినప్పటికీ, అది ప్రస్తుతం కండీషన్‌లోనే ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement