యునెస్కో జాబితాలో కొత్తగా 21 ప్రదేశాలు | New sites inscribed on UNESCO World Heritage list | Sakshi
Sakshi News home page

యునెస్కో జాబితాలో కొత్తగా 21 ప్రదేశాలు

Published Thu, Jul 13 2017 5:22 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

యునెస్కో జాబితాలో కొత్తగా 21 ప్రదేశాలు

యునెస్కో జాబితాలో కొత్తగా 21 ప్రదేశాలు

క్రాకౌ( పోలాండ్) :
పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 41వ సమావేశంలో ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో మరిన్ని ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో కొత్తగా 21 చారిత్రక ప్రాంతాలకు చోటు దక్కింది. భారత్ నుంచి గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్‌ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్‌ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్‌ ఈ గౌరవాన్ని అందుకుంది. భారత దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి నగరంగా అహ్మదాబాద్‌ నిలిచింది.

పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న జపాన్‌లోని ఒకినోషిమాకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరచుకొన్నట్టు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్ దీవుల్లోని టవుటపువాటీ అనే పాలినేషియన్ ట్రయాంగిల్ కూడా ఉంది. అలాగే యూకేలో లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగోవార్ప్ కూడా ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు యునెస్కొ గుర్తింపు పొందిన చారిత్రక ప్రదేశాల జాబితా 1073కి చేరింది.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 
యునెస్కో గుర్తింపు పొందిన కొత్త ప్రాంతాలు..
ది సాంబార్ ప్రీ కుక్ టెంపుల్ జోన్(కంబోడియా)
  పవిత్ర ఒకినోషిమా ద్వీపం (జపాన్)
1250-1517 మధ్యకాలంలో నిర్మించిన హెబ్రోన్(అల్-ఖలీల్ ఓల్డ్ సిటీ, పాలస్తినా)
ది లేక్ డ్రిస్ట్రిక్ట్( ఇంగ్లండ్)
క్రొయోషియా, ఇటలీ, మాంటీనీగ్రోల్లోని వెనేషియన్ వర్క్స్ ఆఫ్ డిఫెన్స్
లాస్ అలెర్సస్ నేషనల్ పార్క్, పటగోనియా
ది సిటీ ఆఫ్ యాజ్డ్, ఇరాన్
అఫ్రోడిసియాస్, టర్కీ
ది తరనోస్కీ గోరీ మైన్, పోలాండ్
కేవ్స్ ఆఫ్ ది స్వాబియాన్ జురా, జర్మనీ
క్వింగై హో క్సిల్, చైనా
కులాంగ్సూ, చైనా
అస్మరా, ఆఫ్రికా
వలోంగో వార్ఫ్, బ్రెజిల్
బాంజా కోంగో, అంగోలా
టపుటపూవాటీ, పాలినేషియా
మంగోలియా, రష్యాలోని డావురియా ప్రకృతి దృశ్యాలు
గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ నగరం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement