
యునెస్కో ప్రతి యేటా వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను, అక్కడి కళారూ΄ాలను గుర్తించి మనముందుకు తీసుకువస్తుంది. ఈ యేడాది అత్యంత ప్రాచీనమైన వివిధ రుచికరమైన వంటకాల జాబితాను తీసుకొచ్చింది. వాటిలో...
అరబిక్ కాఫీ
అరబ్ ప్రపంచంలో కాఫీ తయారీ, దానిని అతిథులకు అందజేసే విధానం అత్యద్భుతంగా ఉంటుందట. ఈ విధానం కూడా వారి తరతరాల భాగస్వామ్యం ఉందని, దీనిని యునెస్కో జాబితాలో చేర్చింది.
జపాన్ వారి సాకె
రైస్‌వైన్‌గా గుర్తింపు పొందిన సాకె ను స్థానిక సాంస్కృతిక వేడుకలలో సేవిస్తారు. దీని తయారీ వెనక తరాలుగా వస్తున్న కుటుంబాల శ్రమ ఉంటుంది.
మలేషియన్ బ్రేక్‌ఫాస్ట్
వంటకాల రుచి గురించి చెప్పుకోవాలంటే ఉదయం అల్పాహారంగా మలేషియా ‘నాసి లెమక్, రోటీ కనాయ్’ని ఈ దేశపు హిస్టరీగా చెప్పుకోవచ్చు. వందల ఏళ్ల ఈ ఆహార తయారీ ఫార్ములా వారికి మాత్రమే తెలుసు.
కొరియా జంగ్
కొరియా వంటకాలలో జంగ్ అనే వంటకం తయారీ, రుచి, దానిని నిల్వ చేసే పద్ధతలు శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్నాయి.
అజెర్‌బైజాని బ్రెడ్
మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల బ్రెడ్స్ చూసి ఉంటాయి. కానీ, అజెర్‌బైజాని బ్రెడ్ తయారీలో వారి సంస్కృతి పరమైన ప్రభావం ఎంతో ఉందంటున్నారు. ఈ బ్రెడ్ తయారీలో వాడే పదార్థాలు, తయారీలో తరాల వారసత్వం ఉందని జాబితాలో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment