యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ తయారీ చేరింది. చైనాలో టీ అనేది ప్రజల రోజువారీ జీవితంలో అల్లుకుపోయిన పానీయం, టీ తో అక్కడి ప్రజలకు లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
బీజింగ్ టీ మ్యూజియంలో ఉత్తర– దక్షిణ రాజవంశాల (క్రీ.పూ. 386– క్రీ.పూ. 589) నాటి 100కి పైగా టీ–సంబంధిత కళాఖండాల సేకరణ ఉంది. ఇక్కడి కాలిగ్రఫీ, పెయింటింగ్‌లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్‌లు, టీల నమూనాలు ఉన్నాయి, ఇవి చైనా గొప్ప టీ సంస్కృతి, సమగ్ర, క్రమబద్ధమైన సేకరణను అందిస్తాయి.
టీ సంస్కృతిని ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ టీ సంస్కృతికి కేంద్రంగా ఈ మ్యూజియం సంవత్సరాలుగా టీ–సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు సాంప్రదాయ సాంçస్కృతిక విద్యా కార్యక్రమాలను, చైనాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతి అనుభవాలను అందిస్తుంది.. ‘టీ తయారీ కోసం చైనీస్ ప్రజలు సృష్టించిన అనేక మార్గాలు, వస్తువులను చూసి విదేశీ రాయబారులు ఆశ్చర్యపోతారు. తూర్పు తీసుకువచ్చిన టీ ఆకుతో ఇక్కడి ప్రజలు రకాల రకాల టీ లను ఎలా సృష్టిస్తారో తెలియజేస్తుంది.
వారసత్వ జాబితాలో..
టీ సంస్కృతికి పుట్టినిల్లుగా చైనీస్ టీ చరిత్రను క్రీ.పూ హాన్ రాజవంశాల నుండి గుర్తించవచ్చు, చైనాలో సాంప్రదాయ టీ ప్రాసెసింగ్ పద్ధతులు, అనుబంధ సామాజిక పద్ధతులు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. చైనీయుల దైనందిన జీవితంలో టీ సర్వవ్యాప్తి చెందుతుంది, ఎందుకంటే కుటుంబాలు, కార్యాలయాలు, టీ హౌస్‌లు, రెస్టారెంట్లు, దేవాలయాలలో వేడి వేడి తేనీటిని అందిస్తారు. వివాహాలు, సమూహాలుగా జరిగే వేడుకలలో కూడా ముఖ్యమైన భాగం అని యునెస్కో తెలిపింది. వాస్తవానికి ‘తు‘ అని పిలిచే టీ, పురాతన చైనీస్ ఔషధ పుస్తకాలలో విరుగుడుగా ఉపయోగించబడటానికి కనుక్కున్నట్టు రాయబడి ఉంది.
ముఖ్యమైన టీ సంగతులు...
టీ తాగే ధోరణి ప్రారంభమైనప్పుడు టాంగ్ రాజవంశం (క్రీ.పూ.618– క్రీ.పూ.907) నుండి టీ ని విశ్వవ్యాప్తంగా ‘చా‘ అని పిలిచారు.
1987లో పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయంలోని భూగర్భ ప్యాలెస్ నుండి తొలి, అత్యున్నత స్థాయి టాంగ్ ఇంపీరియల్ టీ సెట్‌ను కనుగొన్నారు. 8వ శతాబ్దంలో టాంగ్ పండితుడు లు యు రచించిన క్లాసిక్ ఆఫ్ టీ, టీ– సంబంధిత అభ్యాసాల గురించి క్రమపద్ధతిలో వివరించిన మొదటి గ్రంథం.
సాంగ్ రాజవంశం (960–1279)లో ప్రజలలో ప్రజాదరణ పొదింది: మ్యూజియంలోని కుడ్యచిత్రం టీ పోటీలో పాల్గొనడానికి ప్రజలు తమ సొంత టీ, టీ సెట్‌లను తీసుకువచ్చిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది.
మ్యూజియంలో అతి ముఖ్యమైనది ‘గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ‘, దీనిని ‘రెన్ టౌ చా‘ (తల ఆకారపు టీ) అని కూడా పిలుస్తారు. ఇది ఒక శతాబ్దానికి పైగా భద్రపరచబడిన అరుదైన, వయస్సు గల ప్యూర్ టీ. దీని ఆకారం గుమ్మడికాయ, బంగారు రంగును ΄ోలి ఉంటుంది కాబట్టి దీనికి గోల్డెన్ మెలోన్ టీ అని పేరు పెట్టారు.
ఆకుపచ్చ, పసుపు, ముదురు, తెలుపు, బ్లాక్ .. టీలతోపాటు యువ తరం కొత్త మార్గాలతో సంప్రదాయాన్ని స్వీకరించింది. వారు స్థానిక టీ ఆకులను బేస్‌గా ఉపయోగిస్తారు. టీని తాజా పాలు, బెర్రీ, పీచెస్ వంటి పండ్లతో కలిపి కొత్త టీ డ్రింక్స్‌ను తయారు చేస్తారు.
(చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..)
Comments
Please login to add a commentAdd a comment