Are You Drinking More Coffee And Tea A Day Must Know These Shocking Health Benefits: ప్రతి రోజూ రెండు కప్పుల టీ, అలాగే రెండు కప్పుల కాఫీ తాగేవారికి మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరుపు రావడం అన్నది... అలా తాగని వారితో పోల్చినప్పుడు దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు డాక్టర్ యువాన్ ఝాంగ్, అతని బృందం. ఒక్కరూ ఇద్దరూ కాదు... దాదాపు అయిదు లక్షల మందిపై పదేళ్ల పాటు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు.
చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా కాఫీ, టీ తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) మాత్రమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ జర్నల్ ‘ప్లాస్ మెడిసిన్’ (PLoS Medicine)లో ప్రచురితమయ్యాయి.
అయితే ఇలా కాఫీ, టీల మీద పరిశోధనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివే చాలా సాగాయి. దాంతో ఈ ఫలితాల మీద కొంత ఎదురుదాడి కూడా జరుగుతోంది. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ఇలాంటి పరిశోధనలు గతంలోనూ జరిగిన మాట వాస్తవమేననీ, అయితే మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే దోహద పడి ఉండకపోవచ్చనీ, ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేకపోలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో మరికొందరు సైతం ఈ పరిశోధన ఫలితాల వెల్లడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుండే మాట వాస్తవమే. అయినప్పటికీ వాటిని పరిమితికి మించి తీసుకుంటూ ఉంటే కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53%మందికి డిమెన్షియా వస్తుందని తేలిన ఫలితాలను వారు ఉటంకిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘రెండంటే రెండే’’ అన్న పరిమితికి కట్టుబడాలంటూ గట్టిగా చెబుతున్నారు.
చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!!
Comments
Please login to add a commentAdd a comment