న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశి్చమ బెంగాల్‌లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. యునెస్కో ఆదివారం ‘ఎక్స్’లో ఈ మేరకు ప్రకటించింది. ‘వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కినందుకు శాంతినికేతన్‌కు అభినందనలు’అని పేర్కొంది. బీర్భమ్ జిల్లాలోని ఈ చారిత్రక నిర్మాణానికి వారసత్వ గుర్తింపు కోసం భారత్ ఎప్పటినుంచో కృషి చేస్తోంది.
ఈ విశ్వవిద్యాలయ నగరి పశి్చమ కోల్‌కతాకు 160 కి.మీ.ల దూరంలో ఉంది. గీతాంజలి కర్త, విశ్వ కవి రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మొదట్లో ఒక ఆశ్రమంగా ప్రారంభించారు. కులమతాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. శాంతినికేతన్ ప్రాంగణంలో చిన్న విద్యా సంస్థగా రవీంద్రుని ఆధ్వర్యంలో మొదలైన విశ్వభారతి నేడు దేశంలో అతి పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎదిగింది. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, సంగీతం, అగ్రికల్చరల్ సైన్స్, రూరల్ రీ కన్సŠట్రక్షన్ వంటి వాటిలో ఎన్నెన్నో కోర్సులు అందిస్తోంది. దివంగత ప్రధాని ఇందిరా గాం«దీ, మరో నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ వంటి మహామహులు ఎందరో ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే.
Comments
Please login to add a commentAdd a comment