ravindranarth tagore
-
ప్రపంచ వారసత్వ జాబితాలోకి శాంతినికేతన్
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశి్చమ బెంగాల్‌లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. యునెస్కో ఆదివారం ‘ఎక్స్’లో ఈ మేరకు ప్రకటించింది. ‘వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కినందుకు శాంతినికేతన్‌కు అభినందనలు’అని పేర్కొంది. బీర్భమ్ జిల్లాలోని ఈ చారిత్రక నిర్మాణానికి వారసత్వ గుర్తింపు కోసం భారత్ ఎప్పటినుంచో కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయ నగరి పశి్చమ కోల్‌కతాకు 160 కి.మీ.ల దూరంలో ఉంది. గీతాంజలి కర్త, విశ్వ కవి రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మొదట్లో ఒక ఆశ్రమంగా ప్రారంభించారు. కులమతాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. శాంతినికేతన్ ప్రాంగణంలో చిన్న విద్యా సంస్థగా రవీంద్రుని ఆధ్వర్యంలో మొదలైన విశ్వభారతి నేడు దేశంలో అతి పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎదిగింది. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, సంగీతం, అగ్రికల్చరల్ సైన్స్, రూరల్ రీ కన్సŠట్రక్షన్ వంటి వాటిలో ఎన్నెన్నో కోర్సులు అందిస్తోంది. దివంగత ప్రధాని ఇందిరా గాం«దీ, మరో నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ వంటి మహామహులు ఎందరో ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే. -
పుస్తకం చల్లగుండ
కోల్‌కతా పేరు వినగానే ప్రధానంగా రెండు విషయాలు మన మదిలో మెదులుతాయి. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన మిష్టి దోయి అనే తీపి వంటకం, రెండవది రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు. కోల్‌కతా లో మిష్టిదోయితో పాటు బెంగాలీల రుచికరమైన పదార్థాలు అమ్మే ఓ షాప్ ముందు ఇటీవల ఠాగూరు పుస్తకాలతో పాటు మరికొన్ని పుస్తకాలున్న ఓ పాత ప్రిజ్ లాంటి అల్మరా మన చూపుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కాళిదాస్ హర్దాస్, కుంకుమ్లు దంపతులు. కోల్‌కతాలోని పాటులీలో వీరిద్దరూ ఇటీవల స్ట్రీట్ లైబ్రరీని ప్రారంభించారు. తమ పాత ఫ్రిజ్‌ను పుస్తకాల అల్మరాగా మార్చారు. తినుబండారాలు అమ్మే షాప్ ఓనర్‌తో మాట్లాడి, ఆ షాపు బయట ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ ఫ్రిజ్ బుక్ లైబ్రరీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలలో పుస్తకపఠన అలవాటును పెంచడానికే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు. ‘మేం పుస్తకాలను ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆ ప్రేమను విస్తృతం చేయడం ద్వారా అంతగా సంతోషాన్ని పొందుతున్నాం’ అని చెప్పిన ఈ ఇద్దరూ షాప్ యజమానితో కలసి కోల్‌కతాలోని పాటులీలో ఉచిత వీధి గ్రంథాలయాన్ని తెరిచారు. షాప్ యజమాని తారాపోద్ కహార్ ను సంప్రదించి, అతని షాప్ ముందు ‘కొంత స్థలాన్ని పుస్తకాలు ఉంచడానికి ఉపయోగించవచ్చా’ అని అడిగారు. కహార్ వెంటనే వీరి ప్రతిపాదనను అంగీకరించాడు. దీంతో ఆ దుకాణం బయట పెద్దలు, యువకులు చదవడానికి వీలుగా పుస్తకాలతో నిండిన ఫ్రిజ్ అల్మరాను ఏర్పాటు చేశారు. సందేశాల ఫ్రిజ్ల్మరా! పాఠకులు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక నెల తర్వాత తిరిగి ఇవ్వమనే సందేశాన్ని ఫ్రిజ్‌కు పక్కన రాసి ఉంచారు. ఎవరైనా తమకు నచ్చిన, చదివిన పుస్తకాలను కూడా ఈ ఫ్రిజ్ బుక్ లైబరీ లో ఉంచచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ బుక్ లైబ్రరీ గురించి తెలుసుకున్న ప్రజలు ఈ చొరవను ఇష్టపడ్డారు. ఇలాంటి లైబ్రరీలను మిగతా వారూ ప్రారంభించాలని, తామూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
మనకున్న అతిపెద్ద బలం అదే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగానే ఆత్మనిర్భర్ భారత్ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్య గొప్పదనాన్ని గుర్తించిన వారి స్ఫూర్తితో మరింత శక్తివంతమైన, తెలివైన జాతిని నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర సంగ్రామ కాలంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శనంలో విశ్వభారతి యూనివర్సిటీ రూపుదిద్దుకుందని, ఆనాడే ఆత్మనిర్భర్ భారత్‌కు బీజం పడిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ శతవసంతోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జ్ఞాన సముపార్జనకై విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు. విశ్వభారతి, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా ఇస్లామియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ వంటి ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ప్రస్తుతకాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యనభ్యసిస్తున్నారు. జాతిని మరింత శక్తివంతం చేసేందుకు మనం దానిని ఉపయోగించాల్సి ఉంటుంది. స్వాత్రంత్యం కోసం పోరాడిన ఎంతో మంది మహానుభావులు జాతి కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు. వారి కారణంగానే నేడు మనం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు.(చదవండి: ‘వారిని దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’ ) ఇక తన స్వరాష్ట్రం గుజరాత్‌తో రవీంద్రనాథ్ ఠాగూర్‌కు అనుబంధం ఉందన్న ప్రధాని మోదీ.. ‘‘ గురుదేవ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతాను. తన పెద్దన్నయ్యకు గుజరాత్లో పోస్టింగ్ వచ్చిన కారణంగా ఆయనను చూసేందుకు అనేకసార్లు అక్కడికి వెళ్లారు. అంతేకాదు గుజరాతీలో ఆయన రెండు పద్యాలు కూడా రాశారు. భిన్న సంస్కృతులకు నెలవైన భారత్ గొప్పదనాన్ని, సుహృద్భావంతో కలిసి మెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే నేను ఈ ప్రస్తావన తీసుకువచ్చాను. భిన్న భాషలు, ఆహారపుటలవాట్లు, వేషధారణ కలిగి ఉన్నప్పటికీ అంతా ఐకమత్యంగా ఉండటమే మనకున్న అతిపెద్ద బలం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్‌కు నిదర్శనం’’ అని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఠాగూర్ వదినమ్మే ఆధునిక చీరకట్టుకు ఆద్యురాలు అని పేర్కొన్నారు. కాగా బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఔట్‌సైడర్లు అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భిన్నత్వంలో ఏకత్వ భావన గురించి ప్రస్తావించడం గమనార్హం. ఇక ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన బెంగాల్ మంత్రి బ్రత్యా బోస్.. ‘‘ప్రధాని మోదీ చెప్పినట్లుగా గుజరాత్లో పనిచేసింది ఠాగూర్ పెద్దన్నయ్య కాదు. అలాగే ఆయన భార్య పేరు జ్ఞానదనందిని. ఆమె చీరకట్టు గురించి ప్రచారంలో ఉన్నవన్నీ కల్పితాలు మాత్రమే. అదే విధంగా విశ్వభారతి యూనివర్సిటీని జాతీయత అంశంతో ముడిపెట్టారు. మతాన్ని అడ్డుపెట్టుకుని జాతీయత గురించి మాట్లాడమని ఠాగూర్ ఎప్పుడూ చెప్పలేదు’’ అని విమర్శలు గుప్పించారు. -
మళ్లీ మొదటికి..
– గోపాలమిత్రల తొలగింపుపై పశుశాఖ జేడీ విచారణ అనంతపురం అగ్రికల్చర్ : పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ–డీఎల్‌డీఏ)లో పనిచేస్తున్న గోపాలమిత్రల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గత జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తమ డిమాండ్ల సాధన కోసం గోపాలమిత్రలు నెలల తరబడి సమ్మెకు వెళ్లడం, విధులకు హాజరు కావాలని డీఎల్‌డీఏ అధికారులు గడువులు విధించడం, ఏకంగా డీఎల్‌డీఏ సీఈఓ డాక్టర్ కొండలరావు రంగంలోకి దిగడం, ఆయనతోనే సమ్మెలో ఉన్న గోపాలమిత్రలు గొడవ పడటం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సమ్మెలో ఉన్న గోపాలమిత్రలలో పలువురు విధుల్లో చేరారు. 60 మంది వరకు చేరకపోవడంతో సీఈఓ కొండలరావు ఆదేశాల మేరకు చైర్మన్ రాధాకృష్ణయ్య, జిల్లా ఈఓ తిరుపాలరెడ్డి విధుల నుంచి వారిని తొలగించారు. ఆ తర్వాత వారి స్థానాలలో కొత్తగా 50 మంది గోపాలమిత్రల నియామకం చేపట్టారు. అందులో ఇప్పటివరకు 30 మంది వరకు విధుల్లో చేరినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సమస్య ముగిసిపోయిందని భావించి ఊపీరిపీల్చుకున్న డీఎల్‌డీఏ అధికారులకు మళ్లీ కథ మొదటికి రావడం జరిగింది. డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తే తమను విధులను తొలగించారని పలువురు గోపాలమిత్రలు మంత్రులు, అధికార, విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ తదితరుల దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేయించినట్లు సమాచారం. అలాగే కోర్టుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అకారణంగా తమను తొలగించి, డబ్బులు తీసుకుని కొత్తవారిని నియమించారనే ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్, జేడీఏహెచ్, డీఎల్‌డీఏ ఈవో, చైర్మన్‌పై ఒత్తిళ్లు రావడంతో ఈ అంశంపై పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. తీర్మానం మేరకు తొలగింపు తమపై అవినీతి ఆరోపణలు చేయడం దారుణమని డీఎల్‌డీఏ చైర్మన్ రాధాక్రిష్ణయ్య, ఈఓ తిరుపాలరెడ్డి కొట్టిపారేశారు. అలా అయితే 50 మందిని నియమించగా ఇప్పటివరకు 30 మంది మాత్రమే విధుల్లో చేరారని చెబుతున్నారు. డబ్బులకు అమ్ముకున్నారు సరైన జీతం లేక ఉద్యోగ భద్రత కరువై ఇబ్బందులు పడుతున్న గోపాలమిత్రల డిమాండ్లు పరిష్కరించాలని అడిగినందున తమను తొలగించి కొత్త వారి నియామకాల్లో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారని గోపాలమిత్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వెంకటేష్ ఆరోపించారు. న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విచారణ చేపట్టాం ఈ అంశంపై కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు పశుశాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ తెలిపారు. కదిరి, అనంతపురం డివిజన్లలో గత రెండు రోజులుగా పలువురు తొలగించిన గోపాలమిత్రలను కలిసినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా కలెక్టర్‌కు నివేదిస్తానన్నారు.