మోదీ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు  | Bandi Sanjay Comments On World Heritage Inscription to Ramappa Temple | Sakshi
Sakshi News home page

మోదీ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు 

Published Tue, Jul 27 2021 8:10 AM | Last Updated on Tue, Jul 27 2021 8:11 AM

Bandi Sanjay Comments On World Heritage Inscription to Ramappa Temple - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సం పద హోదా రావడానికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నా రు. ఇందుకు రాష్ట్ర ప్రజల తరపున మోదీకి అభినందనలు తెలిపారు. భారత వారసత్వ సంపదకు ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్న ప్రధాని తపన వల్లే ఈ హోదా లభించిందన్నారు. దీనికోసం కృషిచేసిన కేంద్రమంత్రులు అమిత్‌ షా, కిషన్‌ రెడ్డిలకు కూడా సంజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు 2019లో దాఖలు కాగా, అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్‌)’తొమ్మిది లోపాల ను ఎత్తిచూపిందని గుర్తుచేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement