World Heritage site
-
ఆ సమాధి పై ఎరుపు రంగుతో రాసిన హెచ్చరిక... తెరిచారో అంతే...
ఈజిప్ట్, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాల్లో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు జరిపి పరిశోధనలు చేస్తుంటారు. మమ్మీలుగా పిలిచే పురాతన సమాధులను తెరిచి నాటి పూర్వీకులు ఎలా ఉండేవారు, ఎలా చనిపోయారు, ఏం ఉపయోగించేవారు వంటి విషయాలను వెల్లడించేవారు. అంతేకాదు ఆ సమాధి ఎన్నాళ్ల క్రితం నాటిది కూడా లెక్కగట్టి చెబుతారు. ఇలాంటి ఆసక్తకరమైన విషయాలు వెలికితీసే క్రమంలో ఇక్కడొక దేశంలో కనుగొన్న సమాధి చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సమాధిపై ఉండే హెచ్చరిక చూస్తే కచ్చితంగా వామ్మో! అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే...ఇజ్రాయెల్‌లో గలీలీలోని యూదుల బీట్ షీయారిమ్ శ్మశానవాటికలో ఒక పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 65 ఏళ్ల క్రితం యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కనుగొన్న తొలి సమాధి ఇదేనని శాస్తవేత్తల అభిప్రాయం. ఆ సమాధిపై ఎరుపు రంగుతో ఒక హెచ్చరిక హిబ్రూ లిపిలో ఉంది. ఈ సమాధి తెరిచే సాహసం చేస్తే శపించబడతారనేరది ఆ హెచ్చరిక సారాంశం. ఈ సమాధి 18 వేల ఏళ్ల నాటిదని అన్నారు. మతం మార్చుకున్న జాకబ్ అనే యూదు వ్యక్తిదని చెబుతున్నారు. పైగా ఆ హెచ్చరికలో మీరు తెరవకూడాని వస్తువులు అంటూ వాటి వివరాలు కూడా ఉన్నాయి. ఈ సమాధిపై ఉన్న శాసనం చివరి రోపమన్ లేదా బైజాంటైన్ కాలానికి చెందినదని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇజ్రాయెల్ అంటే గతం, వర్తమానం, భవిష్యత్తుల సమాహారం అని ఒకరు, తెరవకూడని విషయాలు యూదులకు సరిహద్దులు అంటూ మరోకరు రకరకాలగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. Things you shouldn't open: - Pandora's Box - An umbrella indoors - Ancient graves An 1,800 year old grave marker for a Jewish man named Jacob the Convert was recently discovered in the Galilee. The marker included an inscription warning people against opening the grave. pic.twitter.com/9JHyBBH3aI — Israel ישראל (@Israel) June 8, 2022 (చదవండి: పాపం పెద్దాయన.. అది నేరమా? మండిపడుతున్న నెటిజన్లు) -
‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ గుర్తింపునిస్తూ యునెస్కో ప్రకటించిన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో నిర్ణీత దూరం వరకు ఎటువంటి కట్టడాలకు అనుమతి ఇవ్వరాదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆలయ శిల్పకళకు, పర్యావరణానికి విఘాతం కలగకుండా ఆలయం చుట్టూ కొంత ప్రాంతాన్ని నిర్మాణ నిషిద్ధ (బఫర్‌జోన్) ప్రాంతంగా ప్రకటించాలని ఆదేశించింది. అంతర్జాతీయ పర్యాటకుల బసకు వీలుగా చేపట్టే నిర్మాణాలు ఆలయానికి దూరంగా ఉండాలని తేల్చిచెప్పింది. నగరంలోని చారిత్రక కుతుబ్‌షాహీ టూంబ్స్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ తయారైందని, రామప్ప ఆలయ పరిసరాలు అలా మారకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. యునెస్కో నిర్ధేశించిన మేరకు శాశ్వత గుర్తింపు లభించేందుకు అవసరమైన పనులను సకాలంలో పూర్తిచేయాలని, అందుకు మైలురాళ్లు నిర్ధేశించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పత్రికల్లో వచ్చిన కథనాలను గతంలో ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి యునెస్కో నిర్దేశించిన మేరకు పనులు పూర్తిచేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. 2022 డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలి యునెస్కో నిర్ధేశించిన మేరకు పనులన్నింటినీ ఈ ఏడాది డిసెంబర్‌లోగా కాకుండా 2022 డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని వరల్డ్ హెరిటేజ్ కమిటీ సూచించిందని కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులతో కూడా కమిటీ వచ్చే వారంలో సమావేశమై.. బఫర్ జోన్‌ను ప్రకటించే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల సమావేశం నిర్వహించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం రానున్న నాలుగు వారాల్లో తీసుకున్న చర్యలను వివరిస్తూ తాజా నివేదికను సెప్టెంబర్ 29లోగా సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
మోదీ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సం పద హోదా రావడానికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నా రు. ఇందుకు రాష్ట్ర ప్రజల తరపున మోదీకి అభినందనలు తెలిపారు. భారత వారసత్వ సంపదకు ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్న ప్రధాని తపన వల్లే ఈ హోదా లభించిందన్నారు. దీనికోసం కృషిచేసిన కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలకు కూడా సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు 2019లో దాఖలు కాగా, అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్)’తొమ్మిది లోపాల ను ఎత్తిచూపిందని గుర్తుచేశారు. -
రామప్పకు విశ్వఖ్యాతి
‘వారసత్వ హోదా’ ప్రయోజనాలు ఎన్నో.. ►ఆలయం యునెస్కో అధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ►రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. ►యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు/కట్టడాలను చూసేం దుకు విదేశీ పర్యాటకులు లక్షల్లో వస్తారు. ఇక ముందు రామప్పకూ పోటెత్తిన అవకాశం ఉంటుంది. ►యునెస్కో ప్రచారం, వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ►రామప్పకు వచ్చేవారు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇది టూరిజానికి ఊపునిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్/ న్యూఢిల్లీ: వందల ఏళ్లనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం.. నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింద కుషన్‌గా వాడిన శాండ్బాక్స్ టెక్నాలజీ, సూది మొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. అద్భుతాలన్నీ ఒకచోట పేర్చిన రామప్ప దేవాలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది. చైనాలోని వూహాన్ కేంద్రంగా ఆదివారం జరిగిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో.. 28 సభ్య దేశాలకుగాను మెజారిటీ దేశాలు రామప్ప ఆలయానికి హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం యునెస్కో అధికారిక ప్రకటన చేసింది. ఏళ్లుగా చేస్తున్న కృషితో.. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. కానీ నిర్ణీత నమూనాలో డోజియర్ (దరఖాస్తు) రూపొందకపోవటంతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే లోపాలను సరిదిద్దుతూ మరో డోజియర్‌ను పంపారు. దాన్ని యునెస్కో పరిశీలనకు స్వీకరించింది. ప్రముఖ నర్తకి, యునెస్కో కన్సల్టెంట్‌గా ఉన్న చూడామణి నందగోపాల్ రెండు రోజుల పాటు రామప్ప ఆలయాన్ని పరిశీలించి.. శిల్పాలు, ఇతర ప్రత్యేకతలను అందులో పొందుపర్చారు. తర్వాత యునెస్కో అనుబంధ ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మ్యాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)’ ప్రతినిధి వాసు పోష్యానందన 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు ఉండి.. ఆలయం ప్రత్యేకతలను, యునెస్కో గైడ్‌లైన్స్ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి.. యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న ప్యారిస్‌లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తుశాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ప్రతినిధులు వెళ్లి.. మరిన్ని వివరాలు అందజేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా చూడాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆక్రమణలను చూసి బిత్తరపోవడంతో.. నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులతో ప్రతిపాదన పంపారు. హైదరాబాద్‌కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం.. ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు చూసి బిత్తరపోయి, ప్రతిపాదన సమయంలో తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. మళ్లీ సమస్య ఎదురైంది. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట చుట్టూ భారీగా ఆక్రమణలు ఉండటం, సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తిరస్కరించింది. చివరగా ఆక్రమణల బెడద లేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ‘ద గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్ వే’ పేరుతో ప్రతిపాదన పంపారు. ఇందులో ‘కేంద్ర పురావస్తు విభాగం (ఏఎస్ఐ)తోపాటు వరంగల్ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలకంగా వ్యవహరించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, కమిటీలను నియమించింది. సౌకర్యాలు కల్పించాలి.. ప్రస్తుతం రామప్ప కట్టడం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఏఎస్ఐ పరిధిలో ఉంది. కట్టడం పర్యవేక్షణ మాత్రమే దానిది. మిగతా వసతుల కల్పన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రెండేళ్ల క్రితం యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లాక.. కేంద్రం రామప్పలో రూ.15 కోట్లతో పలు పనులు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఎస్ఐ ఎనిమిది కట్టడాల బాధ్యత చూస్తోంది. కేంద్రం ఒక్కోదాని నిర్వహణకు ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఇస్తోంది. అయితే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఏటా రూ.4 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన స్థాయిలో నిధులు ఇస్తే.. రామప్ప రూపురేఖలు మారుతాయి. పీవీ అప్పుడే ఆకాంక్షించారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 55 ఏళ్ల కిందటే రామప్పకు ప్రపంచ గుర్తింపు గురించి ఆకాంక్షించారు. ఆలయంలోని అద్భుతాలను చూసి అబ్బురపడిన ఆయన తన భావాలకు ‘రామప్ప– ఏ సింఫనీ ఇన్ స్టోన్స్’ పేరుతో అక్షర రూపం ఇచ్చారు. ఆ నిర్మాణం ప్రపంచ ఖ్యాతి పొందగలిగినదని అందులో పేర్కొన్నారు. ఆ శిల్పాలు అద్భుతాలే.. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్ డోలరైట్ (నల్లశానపు) రాయిని వాడారు. ►సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది. కానీ రామప్పలో దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటు చేసి.. దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ►వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడతాయి. ►నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశ ద్వారం, రంగమండపం అరుగు తదితర చోట్ల జైన తీర్థంకరులు, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉండటం గమనార్హం. ►ఇక్కడ నంది కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. ►గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ►భారీ గండ శిలల శిల్పాలు, నగిషీలను వాడినందున మరింత బరువు పడకూడదని.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నీటిపై తేలే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు. బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్లు, ఊక తదితరాల మిశ్రమాన్ని పోతపోసి కాల్చి ఈ ఇటుకలను తయారు చేశారు. కప్పు వరకు రాతితో నిర్మించి మూడంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. అద్దంలాంటి నునుపుతో.. ఆలయంలో భారీ రాతి స్తంభాలు, మదనిక–నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. ►ఇక్కడి ఆగ్నేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగిమలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్యగత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి. ►దూలాలపై శివ కల్యాణసుందరమూర్తి, బ్రహ్మవిష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు దిక్పాలకులు, సప్త రుషులు, గజాసురసంహారమూర్తి, అమృత కలశానికి అటూ ఇటూ దేవతామూర్తులు వంటి చిత్రాలు ఉన్నాయి. ►ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్‌ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి. రామప్పకు ఎలా వెళ్లాలి? వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉంది. దీనికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం హైదరాబాద్‌లోనిదే. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. రైలు మార్గంలో అయితే వరంగల్ నగరం శివార్లలో ఉన్న కాజీపేట జంక్షన్లో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. బస్సుల ద్వారా అయితే.. వరంగల్ నగరంలోని హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడ ములుగు వెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేట (రామప్ప టెంపుల్ ప్రాంతం) ఉంటుంది. ఆటోలు, ప్రైవేటు వాహనాలలో వెళ్లొచ్చు. అభివృద్ధి పనులు షురూ.. రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, శిల్పకళా వేదికగా మార్చేందుకు ఇప్పటికే పనులు చేపట్టారు. రూ.5 కోట్లతో ఆడిటోరియం, రెండు స్వాగత తోరణాలు కట్టారు. ఆలయం పక్కన చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటు కోసం నమూనాలను సిద్ధం చేశారు. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్పకళా అధ్యయనం కోసం కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. తరలిరానున్న పర్యాటకులు రాష్ట్రంలో గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, కట్టడాలున్నా తగిన ప్రచారం, వసతులు లేక దేశ, విదేశీ పర్యాటకులు పెద్దగా రావడం లేదు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళలకు పోటెత్తుతున్నారు. తాజాగా రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడంతో పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత సమకూరనుంది. వందల ఏళ్లనాటి ఆలయాన్ని పరిరక్షించడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రామప్పకు సగటున నెలకు దేశీయ పర్యాటకులు 25 వేల మంది, విదేశీయులు 20 మంది మాత్రమే వస్తున్నారు. ఇకపై లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. దివ్యంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయ రాజవంశ విశిష్ట శిల్పకళా వైభవం రామప్ప ఆలయంలో కళ్లకు కడుతోంది. ఆ దేవాలయ సముదాయాన్ని అందరూ సందర్శించాలని, ఆలయ మహత్మ్యం తెలుసుకొని స్వయంగా అనుభూతి పొందాలని కోరుతున్నా. – ప్రధాని మోదీ కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడానికి మద్దతిచ్చిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. – సీఎం కేసీఆర్ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు 13వ శతాబ్దపు కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది తెలంగాణ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు. దీనిపై తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీమ్ ఇండియాకు అభినందనలు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకు, శిల్ప కళా చాతుర్యానికి రామప్ప ఆలయం ఓ చక్కని ఉదాహరణ. టీమ్ ఇండియాకు అభినందనలు. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంతోషకరమైన వార్త రామప్ప ఆలయానికి వారసత్వ హోదా దక్కడం గొప్ప వార్త. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. –కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో ఆనందంగా ఉంది రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందం కలిగించింది. దీనికి మార్గదర్శనం, మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీకి దేశం తరఫున, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో విదేశాంగ శాఖ, భారత పురావస్తు శాఖ చేసిన కృషిని అభినందిస్తున్నా. – ట్విట్టర్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రామప్ప తర్వాతి లక్ష్యం హైదరాబాద్ నగరమే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప దేవాలయాన్ని చేర్చడం సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు లభించడంలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు. తెలంగాణ నుంచి రామప్ప తొలి వారసత్వ కట్టడంగా గుర్తింపు సాధించింది. తర్వాత హైదరాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. –ట్విట్టర్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చరిత్రలో చిరస్థాయిగా.. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజిది. ఈ గుర్తింపుతో ‘రామప్ప’ కట్టడం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించడం సంతోషకరం. – శ్రీనివాస్‌గౌడ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి చాలా సంతోషం.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో సంతోషంగా ఉంది. ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ గుర్తింపు రావడానికి కృషిచేసిన సీఎం కేసీఆర్ సహా అందరికీ ధన్యవాదాలు. – పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మా కృషి ఫలించింది రామప్పకు ప్రతిష్టాత్మక గుర్తింపు రావటంతో ఆనందంగా ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిలో మా ట్రస్టు కీలకపాత్ర పోషించింది. పర్యాటకపరంగా రామప్ప ప్రాంత రూపురేఖలు మారతాయి. – పాపారావు, కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
వారసత్వ రేసులో రామప్ప.. యునెస్కో కీలక సూచనలు
సాక్షి, పాలంపేట(వరంగల్): రుద్రేశ్వరాలయం అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ రామప్ప అంటే చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు అంశం చివరి అంకానికి చేరుకుంది. అయితే రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలా, వద్దా? అనేది జులై 25న తేలనుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్లను గుర్తించేందుకు చైనాలో యునెస్కో జులై 16 నుంచి 31 వరకు కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. యూనెస్కో సూచనలు ఇప్పటికే రామప్ప ఆలయానికి సంబంధించిన నివేదికను పరిశీలించిన యునెస్కో బృందం పలు సందేహాలు లేవనెత్తి వాటికి సంబంధించి కీలక సూచనలు చేసింది. వీటికి అనుగుణంగా రామప్ప ఆలయం ఉన్న పాలంపేట గ్రామం పేరు మీదుగా పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాథికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో పాటు యూనెస్కో చేసిన పలు సూచనలకు అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యునెస్కో సూచనలో మరికొన్ని కీలక అంశాలు, అడిగిన అదనపు సమాచారం ► రామప్ప ఆలయానికి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలు, కట్టడాలు, రామప్ప సరస్సు, మంచి నీటి పంపిణీ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చట్టపరమైన హక్కులు కల్పించాలి. ► రామప్ప ఆలయం, సరస్సు పరిధిలో జరిగే ఇతర అభివృద్ధి పనులకు హెరిటేజ్ పరిధిలోకి తీసుకురావాలి. ► గతంలో విప్పదీసిన కామేశ్వరాలయం పునర్ నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలి ► రామప్ప ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తుల వల్ల ఆలయ నిర్మాణానికి నష్టం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► శిథిలమవుతున్న ఆలయ ప్రహారి గోడల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆలయ పరిరక్షణలో స్థానికులు, ఆయల పూజారులలకు భాగస్వామ్యం కల్పించాలి ► ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కాపాడటానికి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు ► జాతరలు, పండుగల సమయంలో ఆలయ ప్రాంగణంలో అధిక మొత్తంలో ప్రజలు ఉండకుండా చేపట్టే చర్యలు, పర్యాటకుల పర్యటనలకు సంబంధించి సమీకృత ప్లాను , ఎటునుండి రావాలి, ఎక్కడ ఎం చూడాలి, సూచిక బోర్డు లాంటి వివరాలు, విదేశీ భాషలలో ఆలయ వివరాలు ► కట్టడానికి సమీపంలో భవిష్యత్ లో చేప్పట్టనున్న ప్రాజెక్టుల వివరాలు అద్భుతాల నెలవు రామప్ప ఆలయం అద్భుతాలకు నెలవు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, శిల్ప కళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యం. -
World Heritage Sites : ‘వారసత్వ రేసులో రామప్ప’
సాక్క్షి, వెబ్‌డెస్క్ : ద్భుతాలకు నెలవైన రామప్ప వైభవం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట నుంచి చైనాకు చేరుకుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో కొత్తవాటిని చేర్చేందుకు యూనెస్కో సమావేశాలు చైనాలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇండియా తరఫున 2020 నామినీగా రామప్ప ఎంపికైంది. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐదేళ్లుగా ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఓ సారి చూద్దాం... -
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్; నేలమీద హరివిల్లు
రోజెస్ ఆర్ రెడ్... వయొలెట్స్ ఆర్ బ్లూ... పిల్లలకు రంగులను పరిచయం చేసే ఈ గేయానికి రూపం వస్తే ఎలా ఉంటుంది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లా ఉంటుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాదాపుగా 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే జూలై –ఆగస్టు నెలల్లో వెళ్లాలి. జూన్ నుంచి అక్కడక్కడా పూలు కనిపిస్తాయి. కానీ లోయ మొత్తం పూల తివాచీలా కనిపించేది జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే. ఇది అద్భుతమైన టెక్కింగ్ జోన్. గోవింద్ ఘాట్ నుంచి సుమారు 15 కిలోమీటర్లు నడిస్తే కానీ చేరుకోలేం. అందుకే రెండు రోజుల ట్రెకింగ్ ప్లాన్ చేసుకోవాలి. మొదటి రోజు ట్రెక్‌లో హిమాలయాల సౌందర్య వీక్షణంలోనే సాగుతుంది. ఇక్కడ మంచు మెల్లగా మబ్బు తునకలుగా ప్రయాణించదు. తెరలు తెరలుగా గాలి దుమారంలాగ వేగంగా కదులుతుంటుంది. మాట్లాడడానికి నోరు తెరిస్తే నోట్లో నుంచి ఆవిరి వస్తుంది. సుమఘుమలు రెండవ రోజు ట్రెకింగ్‌లో పూల ఆనవాళ్లు మొదలవుతాయి. ముందుకు వెళ్లే కొద్దీ పుష్పావతి లోయ రంగురంగుల హరివిల్లును తలపిస్తుంది. ఈ లోయను పూర్వకాలంలో పుష్పావతి లోయగా పిలిచేవారు. ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే లెక్క చెప్పడం కష్టమే. కేవలం ఈ లోయలో మాత్రమే ఉండే పూల రకాలు ఐదు వందలకు పైగా ఉన్నట్లు ఇక్కడ రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ చంద్ర ప్రకాశ్ ‘ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్: మిత్స్ అండ్ రియాలిటీ’లో రాశారు. ఇక్కడ పుష్పావతి నది ప్రత్యేక ఆకర్షణ. తిప్రా గ్లేసియర్ కరిగి గౌరీ పర్బత్ మీదుగా జాలువారి నది రూపం సంతరించుకుంటుంది. పుష్పావతిలోయలో ప్రవహిస్తుండడంతో దీనికి పుష్పావతి నది అనే పేరు స్థిరపడిపోయింది. ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నేషనల్ పార్కుగా ప్రకటించి పరరక్షిస్తోంది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చింది. మృగాల్లేవు... మునుల్లేరు! ఇక్కడ హిమాలయ పర్వతాలు 3350 మీటర్ల నుంచి 3650 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఎలుగుబంటి, నక్క, మంచులో తిరిగే చిరుత వంటి కొన్ని అరుదైన జంతువులుంటాయి. కానీ పర్యాటకుల తాకిడితో అవి ట్రెక్కింగ్ జోన్ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. మునులు ఈ ప్రశాంత వాతావరణంలో తపస్సు చేసుకునే వారని, ఇప్పుడు మునులు కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతారు. పర్వత ప్రదేశాల్లో కనిపించే అరుదైన పక్షులు మాత్రం ఇప్పటికీ స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఈ టూర్లో పూలతోపాటు ఆకాశంలో ఎగిరే పక్షులను చూడడం మర్చిపోవద్దు. -
Sanchi Stupa: అనగనగా.... ఓ బౌద్ధస్థూపం
రెండు వందల నోటు మీద గాంధీజీ ఉంటాడు. నోటును వెనక్కి తిప్పితే గాంధీ కళ్లద్దాలతోపాటు... ఓ పురాతన కట్టడం కూడా కనిపిస్తుంది. అదే... అశోకుడు కట్టించిన గొప్ప బౌద్ధ స్థూపం. రెండు వేల మూడువందల ఏళ్ల నాటి సాంచి స్థూపం. సాంచి బౌద్ధ స్థూపం పర్యటనకు వెళ్లే ముందు సాంచి స్థూపం ఉన్న ప్రదేశం గురించి చెప్పుకోవాలి. సాంచి స్థూపాన్ని నిర్మించిన అశోకుడి భార్య పేరు విదిశ. ఆమె పేరు మీద సాంచికి పది కిలోమీటర్ల దూరాన ఒక పట్టణం కూడా ఉంది. అశోకుడితోపాటు విదిశ కూడా బౌద్ధాన్ని విస్తరింపచేయడంలో కీలక పాత్ర వహించింది. బౌద్ధ ప్రచారం కోసం శ్రీలంక వెళ్లిన సంఘమిత్ర, మహేంద్రలు అశోకుడు– విదిశల పిల్లలే. అశోక స్తంభం బౌద్ధ ఆరామాలు సాధారణంగా నీటి వనరులకు దగ్గరగా ఒక మోస్తరు ఎత్తున్న కొండల మీదనే ఉంటాయి. అలాగే... నివాస ప్రదేశాలకు సుమారు కిలోమీటరు దూరానికి మించకుండా ఉంటాయి. సన్యాసులు ప్రశాంతంగా వారి జీవనశైలిని కొనసాగించడానికి, గ్రామంలోకి వచ్చి భిక్ష స్వీకరించడానికి అనువుగా ఉండేటట్లు నిర్మించుకునే వాళ్లు. సాంచి స్థూప నిర్మాణంలోనూ అదే శైలిని అనుసరించారు. స్థూపంలో చక్కని శిల్పసౌందర్యం ఉంది. బుద్ధుని జీవితంలోని ఘట్టాలను శిల్పాల రూపంలో చెక్కారు. ఈ స్తూపం వ్యాసం 120 అడుగులు, ఎత్తు 54 అడుగులు. స్థూపానికి నాలుగు వైపుల ఉన్న తోరణ ద్వారాల్లో దక్షిణ ద్వారానికి దగ్గరగా అశోకుని స్తంభం ఉంది. ఇది సాంచి అశోకుని స్తంభం అంటారు. నాలుగు సింహాలు నాలుగు దిక్కులను చూస్తున్న స్థూపం ఇది. మన జాతీయ చిహ్నంగా సింహాలను ఈ స్థూపం నుంచి తీసుకున్నారు. స్థూపం ఆవరణలో ఉన్న మ్యూజియంలో నమూనా స్థూపాన్ని చూడవచ్చు. మహాభిక్షపాత్ర సాంచి స్థూపం ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహణలో ఉంది. ఇక్కడ బౌద్ధ సాహిత్యం, సాంచి స్థూపం నమూనాలను కొనుక్కోవచ్చు. ఇక్కడి మ్యూజియంలో పెద్ద భిక్ష పాత్ర ఉంటుంది. అది రాతితో చెక్కిన పాత్ర. సాంచి పర్యటనకు వచ్చే వాళ్లు ఎక్కువగా భోపాల్‌లోనే బస చేస్తుంటారు. అయితే ఇక్కడ శ్రీలంక మహాబోధి సొసైటీ ఆరామంతోపాటు అనేక దేశాల బౌద్ధ సన్యాసులు నిర్మించుకున్న ఆరామాలు కూడా ఉన్నాయి. సాంచి స్థూపం గురించి... సాంచి పట్టణం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. పురాతన కట్టడాల అన్వేషణలో భాగంగా మనదేశంలో పర్యటించిన బ్రిటిష్ అధికారి జనరల్ టేలర్ 1818లో సాంచి బౌద్ధస్థూపం ప్రాముఖ్యతను గుర్తించాడు. తర్వాత 1881 నుంచి పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి నెమ్మదిగా సాగిన మరమ్మత్తు పనులు 1912 – 1919 మధ్య కాలంలో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో త్వరితగతిన పూర్తయ్యాయి. ఈ స్థూపం 1989లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందింది. బౌద్ధ బంధం మయన్మార్ బౌద్ధ సన్యాసులను ఐదేళ్ల కిందట మనదేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రాల సందర్శనకు తీసుకు వెళ్లాను. ఆ సన్యాసులందరూ నాగార్జున యూనివర్సిటీలో మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్‌లో చదువుకోవడానికి మనదేశానికి వచ్చినవాళ్లు. కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొందరు రీసెర్చ్ కోసం వచ్చారు. బౌద్ధాన్ని ఆచరించే కుటుంబాలు తమ పిల్లల్లో ఒకరిద్దరిని ధర్మ పరిరక్షణ కోసం అంకితం చేస్తాయి. అలా వాళ్లు చిన్నప్పుడే బౌద్ధ సన్యాసులుగా మారిపోతారు. అశోకుడు– విదిశ తమ పిల్లలను బౌద్ధానికి అంకితం చేశారు. – డాక్టర్ బి. రవిచంద్రారెడ్డి, బౌద్ధ ఉపాసకులు Meenmutty Waterfalls: మీన్ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం -
భార్య ప్రేమకు నిదర్శనం.. హుమయూన్ సమాధి
ఈ ఒక్క నిర్మాణం... పది గ్రంథాలకు సమానం. ఒక పూర్తి స్థాయి దృశ్యకావ్యం. వందలాది జీవితాలకు దర్పణం. భార్య ప్రేమకు నిదర్శనం. హుమయూన్ సమాధి... ఢిల్లీ పర్యటనలో చాలా మంది మిస్సయ్యే ప్రధానమైన పర్యాటక ప్రదేశం. ఢిల్లీ టూర్ అనగానే ఆగ్రాలోని తాజ్‌మహల్‌తో మొదలు పెట్టి, ఎర్రకోట, కుతుబ్‌మినార్, ఐరన్ పిల్లర్, ఇండియా గేట్, అక్షర్ధామ్, లోటస్ టెంపుల్, జంతర్‌మంతర్, చాందినీ చౌక్, కన్నాట్ సర్కిల్, రాజ్‌ఘాట్, బిర్లాటెంపుల్, జమా మసీద్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవన్... అన్నీ కవర్ చేస్తారు. ఈ టూంబ్ గుర్తుకు వచ్చినా సరే... ‘అంతదూరం వెళ్లడం దేనికీ... ట్రైన్లో వెళ్లేటప్పుడు కనిపిస్తుంది. చూడవచ్చు’ అని తేల్చేస్తారు. ఇది మధుర రోడ్లో నిజాముద్దీన్ అనే ప్రదేశంలో ఉంది. ట్రైన్లో ఢిల్లీ స్టేషన్ చేరేలోపు కనిపిస్తుంది. ముందుగా తెలిస్తే తప్ప వెళ్లేటప్పుడు గమనించడం కుదరదు. తిరుగు ప్రయాణంలో గుర్తు పెట్టుకుని చూసినా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలోని పై అంతస్థును మాత్రమే చూడగలం. మనకు కనిపించని మరో అంతస్థు కూడా ఉన్నట్లు అప్పుడు తెలియదు కాబట్టి కనిపించినంతటితోనే సంతృప్తి చెందుతాం. కానీ... హుమయూన్ సమాధి కోసం కనీసం రెండు గంటల సమయం కేటాయించి చూస్తేనే నిర్మాణం గొప్పదనాన్ని, సునిశితమైన పనితనాన్ని ఆస్వాదించగలుగుతాం. హుమయూన్ సమాధి ప్రాంగణం భర్త కోసం హుమయూన్ సమాధి నిర్మాణ కౌశలాన్ని స్వయంగా చూసిన తర్వాత తాజ్‌మహల్ వంటివన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి చూస్తే సమాధి నిర్మాణం సుదూర తీరాన ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది పేరుకి సమాధే కానీ ముప్పై ఎకరాల్లో విస్తరించిన కట్టడం. విశాలమైన తోటల నడుమ ఉంటుంది. మోకాళ్లకు శ్రమ తెలియకుండా ఆరంగుళాల మెట్లను ఎక్కడానికి అలవాటు పడిన వాళ్లకు ఈ మెట్లు ఎక్కడం కొంచెం కష్టమే. మొఘలులు భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత నిర్మించిన పెద్ద కట్టడాల్లో ఇది ముఖ్యమైనది. హుమాయూన్ భార్య హాజీ బేగం పర్షియా నుంచి ఆర్కిటెక్టులను పిలిపించి మరీ కట్టించింది. ఈ సమాధి నిర్మాణం హుమయూన్ మరణించిన తొమ్మిదేళ్లకు క్రీ.శ 1565లో మొదలైంది. పూర్తవడానికి ఏడేళ్లు పట్టింది. నిర్మాణాన్ని మొదలు పెట్టిన మిరాక్ మీర్జా మరణించడంతో అతడి కొడుకు సయీద్ ముహమ్మద్ పూర్తి చేశాడు. మొఘలుల తొలి చార్భాగ్ సమాధి ఇది. చుట్టూ నాలుగు తోటలతో జామెట్రికల్ లే అవుట్‌తో డిజైన్ చేశారు. ఏ దిక్కు నుంచి చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది. కింది అంతస్థులో పదిహేడు ఆర్చ్‌లు కనిపిస్తున్నాయి. అన్ని వైపులా ఇదే కొలతలు, నమూనాతో ఆర్చ్‌లు ఉంటాయి. బ్రిటిష్ అధికారులు బహదూర్‌షాను అదుపులోకి తీసుకున్న చిత్రం నాటి తోటల్లేవు మొఘలుల కాలంలో వేసిన తోటలు ఇప్పుడు లేవు. మామిడి వంటి రకరకాల చెట్లతో తోటల ప్రాముఖ్యత మాత్రం తగ్గకుండా నిర్వహిస్తున్నారు. చారిత్రక నిర్మాణాల మరమ్మత్తు కత్తిమీద సాములాంటి పని. అప్పటి నిపుణుల నిర్మాణ కౌశలానికి భంగం కలగకుండా చేయాల్సి ఉంటుంది. హుమయూన్ సమాధి మరమ్మత్తులు కూడా పలుచటి సిమెంట్ పొరలతో అత్యంత నైపుణ్యంగా చేశారు. తోటల నిర్వహణ కోసం 128 భూగర్భజలాశయాలను కూడా పూడిక తీసి పూర్తి స్థాయిలో పని చేయిస్తున్నారు. ఇది పేరుకు హుమాయూన్ సమాధి నిర్మాణమే కాని, ఇందులో హుమయూన్ సమాధితోపాటు అతడి భార్యలు హాజీ బేగం, హమీదా బేగం సమాధులు, షాజహాన్ కొడుకు దారుషుకో సమాధి, ఇంకా మొఘల్ రాజ ప్రముఖుల సమాధులు కూడా ఉన్నాయి. నిర్మాణం నాటికి ఎవరూ ఊహించని మరో విషయం ఏమిటంటే... మొఘలు పాలనకు సమాధి కూడా ఇక్కడే జరిగింది. మొఘల్ చివరి పాలకుడు బహదూర్ షా అతడి సంతానాన్ని బ్రిటిష్ సైనిక అధికారి స్వాధీనం చేసుకున్నది ఇక్కడే. చదువరి ఇంతకీ హుమయూన్ ఎవరనే సందేహం కలిగితే... అందుకు సమాధానం అతడు అక్బర్ తండ్రి. భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్‌కు కొడుకు. సున్నిత మనస్కుడు, బాగా చదువుకున్న వాడు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఒకరోజు నమాజ్ సమయమైందని గుర్తుకు వచ్చి హడావుడిగా లైబ్రరీ మెట్లు దిగుతున్న సమయంలో మెట్ల మీద నుంచి జారి పడిపోయాడు. తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. అక్బర్ పుట్టే నాటికి రాజ్యం లేదు హుమయూన్ 23 ఏళ్లకే రాజయ్యాడు. వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని సోదరుల మధ్య విద్వేషాల కారణంగా పదేళ్లకే కోల్పోయాడు. కొన్నేళ్లపాటు కాందిశీకుడిగా గడిపాడు. హుమయూన్ హిందూ రాజులతో స్నేహంగా ఉండేవాడు. గర్భిణి అయిన భార్యను సింధు రాజు సంరక్షణలో ఉంచి యుద్ధానికి సిద్ధం కావడానికి ఎడారులకు వెళ్లిపోయాడు. అక్బర్ పుట్టినప్పుడు వర్తమానం తెచ్చిన వార్తాహరుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదని ఆవేదన చెందాడు. బికారిగా కొడుకుకు ముఖం చూపించలేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పదిహేనేళ్ల పోరాటం తర్వాత సింహాసనాన్ని 1555 జూలై నెలలో తిరిగి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆరు నెలలకే 1556, జనవరి నెలలో తుది శ్వాస వదిలాడు. చదవండి: దుబాయ్ టూర్: అది అరబిక్ కడలందం.. కశ్మీర్ సోయగం: ఒక్కొక్కరికి ఎంత ఖర్చంటే! -
బంగారు టాయిలెట్ దోచుకెళ్లారు
లండన్: బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లోని 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌ను దొంగలు శనివారం దోచుకెళ్లారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా పేరందుకున్న ప్యాలెస్‌లో ఈ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 66 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం ఉదయం 4:50 గంటలకు ఈ దొంగతనం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. టాయిలెట్ పైపులు గోడల లోపలికి బిగించి ఉండటం వల్ల గోడలకు నష్టం జరిగిందని, ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయిందని తెలిపారు. దీన్ని దొంగిలించడానికి నిందితులు రెండు వాహనాలు ఉపయోగించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ప్యాలెస్ డిస్ప్లేపై చూపిన బంగారు టాయిలెట్‌ను దోచుకెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
‘రామప్ప’కు టైమొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: నీటిలో తేలియాడే ఇటుకలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘రామప్ప’కు యునెస్కో పట్టాభిషేకం చేసే తరుణం ఆసన్నమైంది. చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులకు ప్రపంచ వారసత్వ హోదా తిరస్కరించిన ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఈసారి రామప్ప దేవాలయాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. వచ్చే నెల 25న యునెస్కో బృందం రాష్ట్రానికి రానుంది. ఆ అద్భుత దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కలి్పంచాల్సిందిగా 2017లో భారత ప్రభుత్వం యునెస్కోకు దరఖాస్తు చేసింది. దాని ప్రత్యేకతలు, అది అద్భుత నిర్మాణంగా మారటానికి అందులో నిగూఢమైన అంశాలను వివరిస్తూ డోషియర్ (దరఖాస్తు ప్రతిపాదన) దాఖలు చేసిన ఇంతకాలానికి దాన్ని పరిశీలించేందుకు ఆ సంస్థ రానుంది. ఈ సారి వస్తుందనే ధీమా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడాలు/ప్రాంతాలు ఏవీ లేవు. దీంతో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో చారి్మనార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులను యూనిట్‌గా చేసి యునెస్కోకు దరఖాస్తు చేశారు. కానీ నగరానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు అక్కడి కబ్జాలు చూసి అవాక్కయ్యారు. కట్టాడాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ప్రైవేటు నిర్మాణాలుండటం, కట్టడాలకు అతి చేరువగా వాహనాలు వెళ్తుండటం, ఓ పద్ధతి లేకుండా దుకాణాలు వెలియటంతో గుర్తింపు ఇవ్వలేమని యునెస్కో తిరస్కరించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రామప్ప దేవాలయాన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించి కేంద్రాన్ని కోరింది. దీంతో 2017లో కేంద్రం యునెస్కోకు దరఖాస్తు చేసింది. అయితే, ఆలయ ప్రత్యేకతలకు సంబంధించిన వివరాలు సరిగా లేవంటూ యునెస్కో తిప్పి పంపింది. యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ట్ అయిన చూడామణి నందగోపాల్‌ను అధికారులు పిలిపించి ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు పంపారు. దాన్ని స్వీకరించిన యునెస్కో.. ఆ వివరాలు కచి్చతంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు బృందాన్ని పంపుతోంది. రామప్ప విశేషాలు.. ఇది రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆ ఆల యానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే దేవాలయానికి నామకరణం చేశారు. ఇలా శిల్పి పేరుతో ఆలయం మన దేశంలో మరెక్కడా లేదు. క్రీ.శ.1213లో ఆలయ ప్రాణ ప్రతిష్ట జరిగిందని అక్కడి శాసనం చెబుతోంది. పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామశివారులో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరువలో రామప్ప పేరుతో పెద్ద చెరువు కూడా ఉంది. దానికి అనుబంధంగా కొన్ని ఉప ఆలయాలున్నా.. అవన్నీ పర్యవేక్షణ లేక శిథిలమయ్యాయి. కాగా, మన దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాలు 38 ఉన్నాయి. అద్భుత నిర్మాణం.. నర్తకి కళ్లముందే నృత్యం చేస్తున్నట్లు అనిపించేంత సహజంగా ఆలయంలో శిల్పాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు, పైకప్పు, ఫ్లోర్‌పై చూడ చక్కని, అబ్బురపరిచే చెక్కడాలున్నాయి. దక్షిణ భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన హంపి, హాలెబీడు, తంజావూరు ఆలయాలతో పోలుస్తూ చూడామణి నందగోపాల్ రామప్ప ప్రత్యేకతలను గుర్తించి నివేదించారు. హంపి, హాలెబీడు, తంజావూరులలో శిల్పాలను సిస్ట్ రాతిపై చెక్కారు. కానీ రామప్పలో కఠినంగా ఉండే డోలరైట్ రాతిపై చెక్కారు. శిల్పాలు అద్దం మాదిరిగా నునుపు తేలుతూ మెరుస్తూ ఉండటం నాటి శిల్పుల నిర్మాణ పనితనానికి నిదర్శనం. వెంట్రుక దూరేంతటి సన్నటి సందులతో కూడిన డిజైన్లు శిల్పాలపై ఉండటం దీని విశిష్టత. గర్భాలయ ప్రవేశ మార్గం పక్కన ఉండే వేణుగోపాలస్వామి శిల్పంపై మీటినప్పుడు సప్తస్వరా లు పలకటం నాటి పరిజ్ఞానాన్ని స్పష్టం చేస్తుంది. ఈ ఆలయానికి వాడిన ఇటుకలు నీటిలో తేలుతాయి. నిర్మాణ బరువును తగ్గించేందుకు ఈ ఇటుకలు రూపొందించారు. పూర్తి నల్లరాతితో ఆలయాన్ని నిర్మించారు. కానీ సమీపంలో ఎక్కడా అలాంటి రాళ్ల జాడ కనిపించదు. వేరే ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఆ రాళ్లను తెప్పించారన్నమాట. పేరిణి నృత్యం స్పష్టించేందుకు ఈ ఆలయంలోని శిల్పాల నృత్య భంగిమలే ప్రేరణ. గణపతి దేవుడి బావమరిది జాయపసేనానీ 1250లో రచించిన నృత్య రత్నావళి గ్రంథంలోని వర్ణనకు ఈ ఆలయ శిల్పాలే ప్రేరణ. -
ఔరా... పురా వైభవం
ఏప్రిల్ 18 వరల్డ్ హెరిటేజ్ డే వేర్లు లేని చెట్టు ఎంత బలహీనమో, గతం గురించిన అవగాహన లోపించడం కూడా అంతే బలహీనం. గతంలో స్ఫూర్తిదాయక చరిత్ర ఉంటుంది. కదలించే సంస్కృతి ఉంటుంది. పెను నిద్దుర వదిలించే సాహిత్యం ఉంటుంది. కనుల పండగ చేసే కట్టడం ఉంటుంది. ప్రకృతి అందించిన విలువైన బహుమానం ఉంటుంది. జ్ఞానదరహాసం ఉంటుంది. వియత్నాంలోని ‘హలాంగ్ బే’ జీవవైవిధ్యానికి నిలువెత్తు చిత్రం. ఒక వియత్నాం కవి అన్నట్లు ఆకాశాన్ని ముద్దాడే అందమైన కొండలున్నాయి అక్కడ. ఈజిప్ట్‌లో రాజసంగా కొలువు తీరిన ఏకశిలా విగ్రహం స్పింక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా మాట్లాడుకోవాల్సింది ఎంతో కొంత ఉందనే అనిపిస్తుంది. రష్యాలోని ఇంద్రధనుస్సు వర్ణాల సెయింట్ బేసిల్ క్యాథడ్రల్, ప్రాచీన ఫ్రెంచి శైలిలో ఫ్రాన్స్‌లో నిర్మితమైన ‘గార్డెన్స్ ఆఫ్ వెర్సైలీ’, జ్ఞాన వెలుగేదో అలలు అలలుగా ప్రసరించే థాయ్‌లాండ్‌లోని ‘వాట్ యాయ్ చాయ్ మాగ్ఖోన్’... ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చోటుచేసుకున్న వీటి గురించి ఏది చెప్పుకున్నా ఒక తీరని దాహం. అందమైన సింహావలోకనం. -
ప్రపంచ వారసత్వ సంపదగా‘రాణి కీ వావ్’
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ‘రాణి కీ వావ్’కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాబితాలో రాణి కీ వావ్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఖతార్‌లోని దోహాలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో యునెస్కో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కీ వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని యునెస్కో కొనియాడింది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఏడు భూగర్భ అంతస్తుల బావి భారత్‌లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఉదాహరణగా నిలిచిందని ప్రశంసించింది. వరదలకుతోడు నాటి భూగర్భ మార్పుల వల్ల సరస్వతి నది కనుమరుగు కావడంతో ఈ బావి దాదాపు ఏడు శతాబ్దాలపాటు మట్టిలో కూరుకుపోయింది. అనంతర కాలంలో భారత పురావస్తుశాఖ ఈ బావిని గుర్తించి అది పాడవకుండా చర్యలు చేపట్టింది. దీనిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం ఉంది.