బంగారు టాయిలెట్‌ దోచుకెళ్లారు | Solid gold toilet stolen from Blenheim Palace | Sakshi
Sakshi News home page

బంగారు టాయిలెట్‌ దోచుకెళ్లారు

Published Sun, Sep 15 2019 3:42 AM | Last Updated on Sun, Sep 15 2019 3:42 AM

Solid gold toilet stolen from Blenheim Palace - Sakshi

లండన్‌: బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్‌ ప్యాలెస్‌లోని 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌ను దొంగలు శనివారం దోచుకెళ్లారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా పేరందుకున్న ప్యాలెస్‌లో ఈ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 66 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్రిటిష్‌ కాలమానం ప్రకారం ఉదయం 4:50 గంటలకు ఈ దొంగతనం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. టాయిలెట్‌ పైపులు గోడల లోపలికి బిగించి ఉండటం వల్ల గోడలకు నష్టం జరిగిందని, ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయిందని తెలిపారు. దీన్ని దొంగిలించడానికి నిందితులు రెండు వాహనాలు ఉపయోగించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ప్యాలెస్‌ డిస్‌ప్లేపై చూపిన బంగారు టాయిలెట్‌ను దోచుకెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement