ప్రతిష్టాత్మక ప్రపంచ పుస్తక రాజధాని–2019 టైటిల్‌కు షార్జాను ఎంపిక చేసినట్లు యూనెస్కో ప్రకటించింది.
దుబాయి: ప్రతిష్టాత్మక ప్రపంచ పుస్తక రాజధాని–2019 టైటిల్‌కు షార్జాను ఎంపిక చేసినట్లు యూనెస్కో ప్రకటించింది. స్థానిక, మతపరమైన ముద్రణా సంస్థలకు సహాయం చేయడంతో పాటు ప్రజలందరికీ పుస్తకాలను అందుబాటులో ఉండేలా చర్యలకు గాను షార్జాను ఎంపిక చేశామని యూనెస్కో తెలిపింది.
దీనిపై ఎమిరెట్స్ పబ్లికేషన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షైకా అల్ క్యాసిమి మాట్లాడుతూ ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉందని, నాలుగు దశాబ్దాల క్రితం షేక్ మహ్మమద్ అల్ క్యాసిమి చేసిన కృషికి ఇది ఫలితమని వ్యాఖ్యానించారు. షార్జా చిల్డ్రన్ రీడింగ్ ఫెస్టివల్, ఉచిత హోమ్ లైబ్రరీలు ఏర్పాటు వంటి కార్యక్రమాలను షార్జా వార్షిక సాంస్కృతిక క్యాలెండర్ పేరుతో నిర్వహిస్తుంది. 2001 నుంచి వరల్డ్ బుక్ క్యాపిటల్ పేరుతో యూనెస్కో టైటిల్‌ను ప్రకటిస్తుంది. 2003లో ఢిల్లీ ఈ టైటిల్‌కు ఎంపికైంది.